యువతే లక్ష్యంగా... | 'Amma Nanna Oorelithe' Movie ready to release | Sakshi
Sakshi News home page

యువతే లక్ష్యంగా...

Published Sun, Sep 21 2014 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

యువతే లక్ష్యంగా...

యువతే లక్ష్యంగా...

 సిద్దార్థ్‌వర్మ, విజయ్, మధు, తేజ, సాయిభవానీరాజు, మహి, శిల్పశ్వి ప్రధాన పాత్రధారులుగా, రూపొందిన చిత్రం ‘అమ్మానాన్న ఊరెళితే’. ‘7/జి బృందావన కాలనీ’ ఫేం సోనియా అగర్వాల్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి అంజి శ్రీను దర్శకుడు. వీరవెంకట దుర్గాప్రసాద్ అనగాని, నాగమణి అనగాని నిర్మాతలు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
 
 ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘యువతను లక్ష్యంగా చేసుకొని కుటుంబ ప్రేక్షకులు మెచ్చే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పనిచేసిన అందరూ చక్కగా సహకరించారు. వచ్చే నెల రెండోవారంలో కానీ, మూడో వారంలో కానీ సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. యువతకు కావాల్సిన సందేశంతో ఈ చిత్రం రూపొందిందని సహ నిర్మాత సత్యనారాయణ అన్నారు. ఇంకా యూనిట్ సభ్యులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement