Amma nanna oorelithe
-
‘అమ్మానాన్న ఊరెళితే’ మూవీ ఐటమ్ సాంగ్ స్టిల్స్
-
ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం : సోనీ అగర్వాల్
‘‘టైటిల్‌కి తగ్గట్టే పూర్తి వినోదాత్మకంగా ఉంటుందీ సినిమా. యువతరమే లక్ష్యంగా చేసిన ఈ చిత్రంలో సోనీ అగర్వాల్ ఓ ప్రత్యేక పాటతో పాటు, కథను మలుపు తిప్పే ఓ సన్నివేశంలో పాల్గొన్నారు. ఆమె పాత్ర సినిమాకే హైలైట్. సెన్సార్ పూర్తయింది. ఈ నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాం’’ అని అంజి శ్రీను చెప్పారు. ఆయన దర్శకత్వంలో సిద్దార్థ్‌వర్మ, విజయ్, మధు, తేజ, సాయిభవానీరాజు, మహి, శిల్పశ్వి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘అమ్మానాన్న ఊరెళితే’. ‘7/జి బృందావన కాలనీ’ ఫేం సోనీ అగర్వాల్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి వీరవెంకట దుర్గాప్రసాద్ అనగాని, నాగమణి అనగాని నిర్మాతలు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోనీ అగర్వాల్ మాట్లాడుతూ -‘‘చాలా భిన్నమైన కథాంశంతో రూపొందిన సినిమా ఇది. ఇందులో నేను చేసిన ఐటమ్‌సాంగ్ చాలా కొత్తగా ఉంటుంది. ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం. మంచి టీమ్‌తో కలిసి పనిచేసినందుకు హ్యాపీ’’ అన్నారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు. -
‘అమ్మ నాన్న ఊరెళితే’ మూవీ ప్రస్ మీట్
-
‘అమ్మానాన్న ఊరెళితే’ స్టిల్స్
-
యువతే లక్ష్యంగా...
సిద్దార్థ్‌వర్మ, విజయ్, మధు, తేజ, సాయిభవానీరాజు, మహి, శిల్పశ్వి ప్రధాన పాత్రధారులుగా, రూపొందిన చిత్రం ‘అమ్మానాన్న ఊరెళితే’. ‘7/జి బృందావన కాలనీ’ ఫేం సోనియా అగర్వాల్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి అంజి శ్రీను దర్శకుడు. వీరవెంకట దుర్గాప్రసాద్ అనగాని, నాగమణి అనగాని నిర్మాతలు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘యువతను లక్ష్యంగా చేసుకొని కుటుంబ ప్రేక్షకులు మెచ్చే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పనిచేసిన అందరూ చక్కగా సహకరించారు. వచ్చే నెల రెండోవారంలో కానీ, మూడో వారంలో కానీ సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. యువతకు కావాల్సిన సందేశంతో ఈ చిత్రం రూపొందిందని సహ నిర్మాత సత్యనారాయణ అన్నారు. ఇంకా యూనిట్ సభ్యులు మాట్లాడారు. -
యువత తప్పు దోవ పడితే..!
యువత భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న ప్రధాన అంశాలను ఇతివృత్తంగా తీసుకుని జక్కుల నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘అమ్మా నాన్న ఊరెళితే..?’. అంజి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్దార్ధ్‌వర్మ, విజయ్, మధు, తేజ, శిల్పాస్విత ముఖ్య తారలు. ఓ ప్రత్యేక పాటను సోనియా అగర్వాల్ చేశారు. ఈ పాట సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. వచ్చే నెల 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘యువత తప్పుదోవ పట్టడానికి చాలా కారణాలున్నాయి. కానీ, ఒక్క సినిమాలో అన్నింటినీ చెప్పలేం. అందుకే ప్రధాన అంశాలను తీసుకుని ఈ సినిమా చేశాం. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. అత్యధిక థియేటర్లలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: సలామ్, అశోక్, నిర్మాణ సారథ్యం: గాజుల ఖాదర్ భాషా. -
అమ్మా నాన్న ఊరెళితే?
ఈ రోజుల్లో యువత అభివృద్ధి చెందడానికి ఎన్ని మార్గాలున్నాయో, అథోగతి పాలవ్వడానికి అన్ని మార్గాలున్నాయి. యువత భవితపై అధిక ప్రభావం చూపిస్తున్న కొన్ని అంశాలను నేపథ్యంగా తీసుకుని ఈ సినిమా చేశామంటున్నారు దర్శకుడు అంజి శ్రీను. సుజాత ఆర్ట్స్ పతాకంపై జక్కుల నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘అమ్మా నాన్న ఊరెళితే..?’. ‘7/జి బృందావనకాలనీ’ ఫేమ్ సోనియా అగర్వాల్ ఇందులో ప్రత్యేక పాత్ర చేయడం విశేషం. నిర్మాత మాట్లాడుతూ -‘‘యువతకు నచ్చే కథాంశమిది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని ఏకకాలంలో విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: కె.వి.రాజు, పాటలు: పోతుల రవికిరణ్, శ్రీరాం తపస్వీ, సంగీతం: మున్నాకాశి, ఖాదర్, సహనిర్మాతలు: సలామ్, అశోక్.