యువత తప్పు దోవ పడితే..! | 'Amma Nanna Oorelithe' To Be Released on Dec 5 | Sakshi
Sakshi News home page

యువత తప్పు దోవ పడితే..!

Published Wed, Nov 20 2013 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

యువత తప్పు దోవ పడితే..!

యువత తప్పు దోవ పడితే..!

 యువత భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న ప్రధాన అంశాలను ఇతివృత్తంగా తీసుకుని జక్కుల నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం  ‘అమ్మా నాన్న ఊరెళితే..?’. అంజి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో  సిద్దార్ధ్‌వర్మ, విజయ్, మధు, తేజ, శిల్పాస్విత ముఖ్య తారలు. ఓ ప్రత్యేక పాటను సోనియా అగర్వాల్ చేశారు. ఈ పాట సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. వచ్చే నెల 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘యువత తప్పుదోవ పట్టడానికి చాలా కారణాలున్నాయి. కానీ, ఒక్క సినిమాలో అన్నింటినీ చెప్పలేం. అందుకే ప్రధాన అంశాలను తీసుకుని ఈ సినిమా చేశాం. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. అత్యధిక థియేటర్లలో తెలుగు, తమిళ భాషల్లో  ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి  సహనిర్మాతలు: సలామ్, అశోక్, నిర్మాణ సారథ్యం: గాజుల ఖాదర్ భాషా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement