అమ్మా నాన్న ఊరెళితే? | youth will like this story of 'Amma nanna oorelithe' | Sakshi
Sakshi News home page

అమ్మా నాన్న ఊరెళితే?

Published Sun, Sep 15 2013 12:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM

అమ్మా నాన్న ఊరెళితే?

అమ్మా నాన్న ఊరెళితే?

ఈ రోజుల్లో యువత అభివృద్ధి చెందడానికి ఎన్ని మార్గాలున్నాయో, అథోగతి పాలవ్వడానికి అన్ని మార్గాలున్నాయి. యువత భవితపై అధిక ప్రభావం చూపిస్తున్న కొన్ని అంశాలను నేపథ్యంగా తీసుకుని ఈ సినిమా చేశామంటున్నారు దర్శకుడు అంజి శ్రీను. సుజాత ఆర్ట్స్ పతాకంపై జక్కుల నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘అమ్మా నాన్న ఊరెళితే..?’. ‘7/జి బృందావనకాలనీ’ ఫేమ్ సోనియా అగర్వాల్ ఇందులో ప్రత్యేక పాత్ర చేయడం విశేషం.
 
 నిర్మాత మాట్లాడుతూ -‘‘యువతకు నచ్చే కథాంశమిది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన  వస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని ఏకకాలంలో విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: కె.వి.రాజు, పాటలు: పోతుల రవికిరణ్, శ్రీరాం తపస్వీ, సంగీతం: మున్నాకాశి, ఖాదర్, సహనిర్మాతలు: సలామ్, అశోక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement