
ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాల డబ్బింగ్ విషయంలో సౌలభ్యం బాగా పెరిగిపోయింది. థియేటర్లలో కంటే డబ్ చేసిన నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు. అలా ఇప్పుడు హారర్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏంటా చిత్రం?
(ఇదీ చదవండి: 'పుష్ప 2' కాదు.. అసలు కథ ముందుంది!)
'7జీ బృందావన కాలనీ' సినిమా పేరు చెప్పగానే హీరోయిన్ సోనియా అగర్వాల్ గుర్తొస్తుంది. అయితే ఈ మూవీ తర్వాత కథానాయికగా ఏం సినిమాలు చేసిందో తెలీదు. సహాయ పాత్రల్లో అయితే అడపాదడపా కనిపిస్తోంది. ఈమె ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా '7/జీ: ద డార్క్ స్టోరీ'. ఈ ఏడాది జూలైలో తమిళంలో రిలీజైంది.
తమిళ వెర్షన్ ఆగస్టులో ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వెర్షన్‌ని నేరుగా ఆహా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు (డిసెంబరు 12) నుంచి స్ట్రీమింగ్ అవుతుందని పోస్టర్ రిలీజ్ చేశారు. కథ పరంగా రొటీన్ హారర్ మూవీ లాంటిదే. ఓ ఇంట్లోకి ఫ్యామిలీ వస్తారు. అదే ఇంట్లో దెయ్యం ఉంటుంది. ఇంతకీ ఎవరా దెయ్యం? ఏంటి సంగతి అనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)
Switch to '7/G - The Dark Story' 👻 🏘
⏰ Stay connected on this Thursday! pic.twitter.com/Fa3NruRrh4— ahavideoin (@ahavideoIN) December 10, 2024