ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం : సోనీ అగర్వాల్ | first time new item song in Sonia Agarwal | Sakshi
Sakshi News home page

ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం : సోనీ అగర్వాల్

Published Sat, Oct 11 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం : సోనీ అగర్వాల్

ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం : సోనీ అగర్వాల్

‘‘టైటిల్‌కి తగ్గట్టే పూర్తి వినోదాత్మకంగా ఉంటుందీ సినిమా. యువతరమే లక్ష్యంగా చేసిన ఈ చిత్రంలో సోనీ అగర్వాల్ ఓ ప్రత్యేక పాటతో పాటు, కథను మలుపు తిప్పే ఓ సన్నివేశంలో పాల్గొన్నారు. ఆమె పాత్ర సినిమాకే హైలైట్. సెన్సార్ పూర్తయింది. ఈ నెలాఖరులో సినిమాను విడుదల చేస్తాం’’ అని అంజి శ్రీను చెప్పారు. ఆయన దర్శకత్వంలో సిద్దార్థ్‌వర్మ, విజయ్, మధు, తేజ, సాయిభవానీరాజు, మహి, శిల్పశ్వి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘అమ్మానాన్న ఊరెళితే’. ‘7/జి బృందావన కాలనీ’ ఫేం సోనీ అగర్వాల్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి వీరవెంకట దుర్గాప్రసాద్ అనగాని, నాగమణి అనగాని నిర్మాతలు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోనీ అగర్వాల్ మాట్లాడుతూ -‘‘చాలా భిన్నమైన కథాంశంతో రూపొందిన సినిమా ఇది. ఇందులో నేను చేసిన ఐటమ్‌సాంగ్ చాలా కొత్తగా ఉంటుంది. ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం. మంచి టీమ్‌తో కలిసి పనిచేసినందుకు హ్యాపీ’’ అన్నారు. యూనిట్ సభ్యులు కూడా మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement