Siddharth Varma
-
గచ్చిబౌలిలో దారుణం..
-
‘డైల్ ఇనిస్టిట్యూషన్స్’ ఘరానా మోసం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాజమండ్రికి చెందిన ఓ యువకుడికి విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంది. తండ్రి రోజువారీ కూలీ. ఆర్థిక స్థోమత లేక ఇంటర్‌తోనే ఆపేశాడు. తండ్రితో పాటే కూలికి వెళ్తూ తన కల నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సోషల్ మీడియాలో వచ్చిన డైల్ ఇనిస్టిట్యూషన్స్ పోస్టుకు ఆకర్షితుడయ్యాడు. వెంటనే విజయవాడ చేరుకుని ఆ సంస్థ నిర్వాహకులను సంప్రదించాడు.కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి 6 నెలల క్రితం రూ.2.39 లక్షలు వసూలు చేశారు. ఎంతకీ ఉద్యోగం రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు సోమవారం విజయవాడలోని పోలీస్ కమిషనరేట్‌కు వచ్చాడు. బీఎస్ఎన్ఎల్, జాతీయ రహదారులు, ఎన్నికల కమిషన్, కార్గో తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు కెనడా, మలేషియా, దుబాయ్ తదితర దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విజయవాడ కేంద్రంగా నిరుద్యోగులకు వల వేసిన డయల్ ఇనిస్టిట్యూషన్స్ నిర్వాహకులు అందినకాడికి దండుకున్నారు. రెండేళ్లపాటు సాగించిన ఈ దందాకు రాష్ట్రవ్యాప్తంగా వేల మంది నిరుద్యోగులు మోసపోయారు. ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.12 లక్షల వరకు కాజేసినట్టు సమాచారం. పోలీస్ కమిషనరేట్‌ను ఆశ్రయించిన బాధితులు సూర్యారావుపేట పోలీసుల తీరుతో బాధితులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. డైల్ ఇన్స్టిట్యూషన్స్ యజమాని దండుబోయిన సిద్ధార్థ్వర్మకు పోలీసులు రాచమర్యాదలు చేస్తూ తమను దూషిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తే కనీసం రశీదులు కూడా ఇవ్వడం లేదని, అడిగితే బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేసులు పెడితే ఏమొస్తుంది, సెటిల్ చేసుకుని ఎంతోకొంత తీసుకెళ్లండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేయకుండా పోలీసులు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే కేసు ఎలా ముందుకు వెళ్తుందో చూస్తానంటూ ఓ పోలీసు అధికారి బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల తీరుతో విసుగు చెందిన బాధితులు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌ను సోమవారం ఆశ్రయించారు. సుమారు 50 మంది బాధితులు తమ గోడు చెప్పుకునేందుకు కమిషనరేట్‌కు వచ్చారు. డెప్యూటీ పోలీస్ కమిషనర్ మేరీప్రశాంతికి ఫిర్యాదులు అందజేశారు. స్టేషన్లోనే వంచించే యత్నం డైల్ ఇనిస్టిట్యూషన్స్ యజమాని దండుబోయిన సిద్ధార్థ్‌వర్మను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ నెల 18వ తేదీన గుంటూరు జిల్లాకు చెందిన ఓ బాధితుడు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చాడు. ‘నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? పది రోజుల్లో మలేషియా వెళ్లాల్సిన వాడివి. కంప్లైంట్ ఇచ్చి ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావ్. డబ్బులు కట్టి వారం రోజుల్లో బయటకు వచ్చేస్తా. నిన్ను మలేషియా పంపిస్తా. నా మాట విని కంప్లైంట్ ఇవ్వకు..’ అంటూ సిద్ధార్థ్‌వర్మ పోలీసుల సమక్షంలోనే మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నించాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ప్రతి ఒక్కరిని పోలీసులు ముందుగా సిద్ధార్థ్ వద్దకు తీసుకెళ్తున్నారని, ఆ తరువాతే ఫిర్యాదు తీసుకుంటున్నారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ‘సాక్షి’ కథనాలతో వెలుగులోకి.. డైల్ ఇనిస్టిట్యూషన్స్ సంస్థ మోసాలను ‘విజయవాడలో ఉద్యోగాల వల’ శీర్షికన ఈ నెల 15న వెలుగులోకి తెచ్చింది. దీంతో కడప, కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, ఏలూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. 15వ తేదీన సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో 12 మంది బాధితులు ఫిర్యాదు చేయగా.. సోమవారం నాటికి ఫిర్యాదు చేసిన బాధితుల సంఖ్య 200కు చేరింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి అరెస్ట్ కాగా, కేసులో ప్రధాన నిందితుడైన దండుబోయిన సిద్ధార్థ్‌వర్మను అరెస్ట్ చేసినట్టు సూర్యారావుపేట సీఐ జానకిరామయ్య తెలిపారు. గుంటూరుకు చెందిన నిందితుడు విజయవాడలో డైల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆయన చెప్పారు. ఇప్పటివరకు 200 మంది బాధితులు ఫిర్యాదు చేశారని, నిందితుడిపై 409, 406, 420 కేసులు నమోదు చేశామన్నారు. అతనికి సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశామన్నారు. ఈ కేసులో మిగిలిన వారి పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. నిందితుడు గతంలోనూ విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లో కాల్ సెంటర్లు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. -
ఇటు వినోదం!అటు సందేశం!!
నేటి యువత తీరుతెన్నులు ఎలా ఉంటున్నాయి? జీవితం పట్ల వాళ్లకి ఎంతవరకు అవగాహన ఉంది? అనే అంశాల సమాహారంతో రూపొందిన చిత్రం ‘నేనూ నా ఫ్రెండ్స్’. సందీప్, సిద్ధార్ధవర్మ, హరీష్, రవి, అంజనా దేశ్‌పాండే, విష్ణుప్రియ, హారిక, కృతిక ఇందులో ముఖ్య తారలు. గండేల హరిత సమర్పణలో సాయిమేధ రమణ, ఓరుగంటి మధుసూధన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘వినోదం, సందేశం రెండూ ఉన్న సినిమా ఇది. క్లయిమాక్స్ ఆయువుపట్టుగా నిలుస్తుంది. కథాబలం ఉన్న సినిమా. ఆ కథను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. చిన్నిచరణ్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం విషయంలో డి. సురేష్‌బాబుగారు అందించిన సహకారానికి కృతజ్ఞతలు’’ అని చెప్పారు. -
ఫిబ్రవరిలోనే సీ ప్లేన్ సేవలు
సాక్షి, ముంబై: అంతా సవ్యంగా సాగితే ఫిబ్రవరిలో సముద్రమార్గం మీదుగా విమాన (సీ ప్లేన్) సేవలు ప్రారంభమయ్యే అవకాశముంది. బీపీటీ తప్ప మిగతా అన్ని శాఖల నుంచి అనుమతి వచ్చిందని మెహెర్ కంపెనీ ఎండీ సిద్ధార్థ్ వర్మ చెప్పారు. దీని నుంచి కూడా అనుమతి లభిస్తే తొలి విడతలో జుహూ సముద్ర తీరం నుంచి గిర్గావ్ (చర్నిరోడ్) చౌపాటి వరకు ఫిబ్రవరి నుంచి సీ ప్లేన్ సేవలు ప్రారంభిస్తామని తెలిపారు. ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.750 చార్జీ వసూలు చేయాలని ఆలోచనలో ఉన్నామన్నారు. ‘ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోకుండా సమయానికి తమ గమ్యస్థానం చేరుకోవాలంటే ముంబైకర్లకు ఈ సీ ప్లేన్ సర్వీసులు ఎంతో దోహదపడతాయి. ఈ సేవలకి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుంద’ని వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో బెస్ట్ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు, చివరకు లోకల్ రైళ్లు కూడా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కిక్కిరిసి ఉంటున్నాయి. వీటి నుంచి ముంబైకర్లకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో సీ ప్లేన్ సేవలు ప్రారంభించాలని కొన్ని సంవత్సరాల క్రితం మెహెర్ కంపెనీ భావించింది. దీనికోసం పర్యావరణ, బాంబే పోర్టు ట్రస్టు (బీపీటీ), నావికా దళం, భద్రత తదితర శాఖల అనుమతి కోరింది. ఇందులో బాంబే పోర్టు ట్రస్టు మినహా మిగతా శాఖల నుంచి ఇటీవలే అనుమతి లభించింది. త్వరలో బీపీటీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలున్నాయి. దీంతో ఫిబ్రవరిలో ఈ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా రోడ్డు మార్గం మీదుగా జుహూ నుంచి గిర్గావ్ చేరుకోవాలంటే కనీసం గంటన్నరకుపైగా సమయం పడుతుంది. అదే సీ ప్లేన్‌లో వస్తే కేవలం ఏడు నిమిషాల్లోనే చేరుకోవచ్చు. జుహూ నుంచి ట్యాక్సీలో వస్తే (ట్రాఫిక్ జాంలో) కనీసం రూ.300-450 వరకు చార్జీలు అవుతాయి. దీన్నిబట్టి చూస్తే సీ ప్లేన్‌లో రావడంవల్ల వ్యాపారవేత్తలు, ఇతర రంగాల ప్రముఖుల విలువైన సమయం ఆదా కానుంది. చార్జీల్లో కూడా పెద్దగా తేడా లేదు. దీంతో ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశముందని సిద్ధార్థ్ వర్మ అభిప్రాయపడ్డారు. ఈ సేవలకు వచ్చే స్పందనను బట్టి మిగతా కీలక ప్రాంతాలకు కూడా సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపారు. భవిష్యత్‌లో ఇంధనం ధరలు పెరిగితే దాన్నిబట్టి చార్జీలు పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ‘ప్రారంభ దశలో ఈ సేవలకు ‘సెస్నా-206’ నాలుగు సీట్ల సామర్థ్యమున్న విమానాలను వినియోగిస్తారు. ఫిబ్రవరి ఆఖరు వరకు సెస్నా-8 తొమ్మిది సీట్ల సామర్థ్యమున్న విమానాలను, ఆ తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరిగితే 19 సీట్ల సామర్థ్యమున్న విమానాలను నడిపే యోచనలో ఉన్నామ’ని ఆయన చెప్పారు. జుహూ-గిర్గావ్ తర్వాత నాసిక్, లవాసా, లోనావాలా, అంబివ్యాలీ ప్రాంతాలకు కూడా నడుపుతామని స్పష్టం చేశారు. ఈ విమానాలు నీటిలో, నేలపై ఇలా ఎక్కడైనా ల్యాండింగ్ చేయడానికి వీలుంది. సాంకేతిక లోపంతో క్రాష్ ల్యాండింగ్ అయ్యే ప్రమాదం లేదు. దీంతో ప్రయాణికులకు ఎలాంటి హాని ఉండదని వర్మ ధీమా వ్యక్తం చేశారు. -
యువత తప్పు దోవ పడితే..!
యువత భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న ప్రధాన అంశాలను ఇతివృత్తంగా తీసుకుని జక్కుల నాగేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘అమ్మా నాన్న ఊరెళితే..?’. అంజి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్దార్ధ్‌వర్మ, విజయ్, మధు, తేజ, శిల్పాస్విత ముఖ్య తారలు. ఓ ప్రత్యేక పాటను సోనియా అగర్వాల్ చేశారు. ఈ పాట సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. వచ్చే నెల 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘యువత తప్పుదోవ పట్టడానికి చాలా కారణాలున్నాయి. కానీ, ఒక్క సినిమాలో అన్నింటినీ చెప్పలేం. అందుకే ప్రధాన అంశాలను తీసుకుని ఈ సినిమా చేశాం. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ఇది. అత్యధిక థియేటర్లలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: సలామ్, అశోక్, నిర్మాణ సారథ్యం: గాజుల ఖాదర్ భాషా. -
అమ్మా నాన్న ఊరెళితే...
సిద్దార్థ్‌వర్మ, విజయ్, ఎస్.మధు, తేజ, అశ్వి, తనూష, సుస్మిత, మనస్విని ముఖ్య పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘అమ్మానాన్నా ఊరెళితే’. అంజిశ్రీను దర్శకుడు. జక్కుల నాగేశ్వరరావు నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘‘అమ్మానాన్న ఊరెళితే’ పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నకు సమాధానమే మా సినిమా. యువత భవితపై ప్రభావం చూపుతున్న పలు అంశాలను ఈ సినిమాలో చర్చించాం. సోని అగర్వాల్ ప్రత్యేక గీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. అక్టోబర్ చివరి వారంలో తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. మహేంద్ర, ఎఫ్.ఎం. బాబాయ్, సంధ్యా జనక్, మల్లికార్జునరావు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి మాటలు: కె.వి.రాజు, కెమెరా: షేక్ ఖాదర్‌బాషా, సంగీతం: మున్నాకాశీ, ఎడిటింగ్: బుల్రెడ్డి, కళ: భాస్కర్, సహ నిర్మాతలు: ఎస్.సలామ్, అశోక్, నిర్మాణసారథ్యం: గాజుల ఖాదర్‌బాషా. -
సిద్దార్థ్ వర్మ హీరోగా 'కొంచెం కొత్తగా'
‘3 జి లవ్’, ‘అమ్మా నాన్న ఊరెళితే’ చిత్రాల కథానాయకుడు సిద్దార్థ్ వర్మ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కొంచెం కొత్తగా’. శ్రవణ్ రాజు దర్శకుడు. క్రియేటివ్ ఫ్రేమ్స్ పతాకంపై బూరుగుబావి నర్సింగ్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సెప్టెంబరులో చిత్రీకరణ మొదలుకానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘టైటిల్‌కి తగ్గట్టుగానే కథాకథనాలు కొత్తగా ఉంటాయి. ఒకే బస్సులో ప్రయాణం చేస్తున్న ఒకమ్మాయి, అబ్బాయి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రణయంగా ఎలా మారిందన్నదే ఈ చిత్రం ప్రధాన కథాంశం. కథానాయిక, ఇతర తారల ఎంపిక జరుగుతోంది’’ అని తెలిపారు.