అమ్మా నాన్న ఊరెళితే... | Sony Agarwal in special song for Amma, Nanna oorellithe... | Sakshi
Sakshi News home page

అమ్మా నాన్న ఊరెళితే...

Published Sat, Oct 5 2013 12:43 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

అమ్మా నాన్న ఊరెళితే... - Sakshi

అమ్మా నాన్న ఊరెళితే...

సిద్దార్థ్‌వర్మ, విజయ్, ఎస్.మధు, తేజ, అశ్వి, తనూష, సుస్మిత, మనస్విని ముఖ్య పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘అమ్మానాన్నా ఊరెళితే’. అంజిశ్రీను దర్శకుడు. జక్కుల నాగేశ్వరరావు నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘‘అమ్మానాన్న ఊరెళితే’ పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నకు సమాధానమే మా సినిమా. 
 
 యువత భవితపై ప్రభావం చూపుతున్న పలు అంశాలను ఈ సినిమాలో చర్చించాం. సోని అగర్వాల్ ప్రత్యేక గీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. అక్టోబర్ చివరి వారంలో తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. 
 
 మహేంద్ర, ఎఫ్.ఎం. బాబాయ్, సంధ్యా జనక్, మల్లికార్జునరావు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి మాటలు: కె.వి.రాజు, కెమెరా: షేక్ ఖాదర్‌బాషా, సంగీతం: మున్నాకాశీ, ఎడిటింగ్: బుల్‌రెడ్డి, కళ: భాస్కర్, సహ నిర్మాతలు: ఎస్.సలామ్, అశోక్, నిర్మాణసారథ్యం: గాజుల ఖాదర్‌బాషా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement