
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. నేడు(ఆదివారం) 11:25 గంటలకు బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో నాగశౌర్య-అనూషల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది.
చదవండి : పెళ్లి కొడుకుగా నాగశౌర్య.. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు వైరల్
టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా నాగశౌర్య వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఇక శౌర్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్ల నుంచి కొత్తజంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనర్‌గా పలు అవార్డులను అందుకుంది. కొన్నాళ్లుగా ఆమెకు నాగశౌర్యతో పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment