సిద్దార్థ్ వర్మ హీరోగా 'కొంచెం కొత్తగా'
సిద్దార్థ్ వర్మ హీరోగా 'కొంచెం కొత్తగా'
Published Wed, Aug 28 2013 12:54 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
‘3 జి లవ్’, ‘అమ్మా నాన్న ఊరెళితే’ చిత్రాల కథానాయకుడు సిద్దార్థ్ వర్మ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కొంచెం కొత్తగా’. శ్రవణ్ రాజు దర్శకుడు. క్రియేటివ్ ఫ్రేమ్స్ పతాకంపై బూరుగుబావి నర్సింగ్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
సెప్టెంబరులో చిత్రీకరణ మొదలుకానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘టైటిల్‌కి తగ్గట్టుగానే కథాకథనాలు కొత్తగా ఉంటాయి.
ఒకే బస్సులో ప్రయాణం చేస్తున్న ఒకమ్మాయి, అబ్బాయి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రణయంగా ఎలా మారిందన్నదే ఈ చిత్రం ప్రధాన కథాంశం. కథానాయిక, ఇతర తారల ఎంపిక జరుగుతోంది’’ అని తెలిపారు.
Advertisement
Advertisement