నాకు నేనే సవాల్‌గా మారా: స్టార్ హీరోయిన్ | Tollywood Heroine Taapsee Pannu Comments On Her Career | Sakshi

Taapsee Pannu: అంత ఈజీగా ఈ స్థాయికి రాలేదు: తాప్సీ

Published Fri, May 3 2024 7:23 AM | Last Updated on Fri, May 3 2024 8:57 AM

Tollywood Heroine Taapsee Pannu Comments On Her Career

దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగి ఆ తరువాత ఉత్తరాదిలో రాణిస్తున్న నటి తాప్సీ. తెలుగు, తమిళం భాషల్లో గ్లామర్‌నే నమ్ముకున్న ఈ ఢిల్లీ బ్యూటీ హిందీలో అభినయానికి ప్రాముఖ్యత కలిగిన చిత్రాల్లో నటిస్తున్నారు. అంతే కాదు అక్కడ హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రాల్లో నటించే స్థాయికి చేరుకున్నారు. ఇటీవల ఈమె షారూఖ్‌ఖాన్‌తో జత కట్టిన డంకీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, తాప్సీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ప్రస్తుతం ఈ భామ పిర్‌ ఆయి హసీన్‌ దిల్రూబా, కెల్‌కెల్‌ మెయిన్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. దక్షిణాదిలో మంచి అవకాశాలు వస్తే నటించడానికి రెడీ అంటున్న తాప్సీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తనకు తానే సవాల్‌గా మారినట్లు తెలిపారు. ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానన్నారు. నటనలో మంచి స్థాయిలో ఉన్నా.. దాని నుంచి బయటకు వచ్చి ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నానన్నారు.

తాను నటిస్తున్న పాత్రల స్వభావాలను తన దృష్టితో చూస్తున్నానని.. మాటల్లో మాత్రమే కాకుండా కల్పనల నుంచి పుట్టే ప్రపంచాన్ని చూడాలని కోరుకుంటున్నానన్నారు. కాగా నటిగా తానీ స్థాయికి చేరుకోవడం అంత సులభం కాలేదన్నారు. అందుకు కఠినంగా శ్రమించినట్లు చెప్పారు. నిత్యం ముందడుగు వేస్తూ ఎదుగుతూ వచ్చానన్నారు. అలా ఇది తన శ్రమకు దక్కిన స్థానం అని అన్నారు. అందుకే తాను చాలా సంతోషంగా ఉన్నానని తాప్సీ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement