
తమిళసినిమా: నిర్మాత ఎంఎం.రత్నం నిర్మించిన చిత్రం 7జీ రెయిన్‌బో కాలనీలో ఆయన కుమారుడు రవికృష్ణను కథానాయకుడిగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సోనియా అగర్వాల్ నాయకిగా నటించారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2004లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోన 7జీ బృందావన్ కాలనీ పేరుతో అనువాదమై సక్సెస్ అయ్యింది.
యువన్‌శంకర్ రాజా సంగీతం అందింన ఇందులోని పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఆ తర్వాత రవికృష్ణ కొన్ని చిత్రాలు నటించినా అవేవీ ఆశించిన విజయాలను సాధించలేదు. దీంతో ఆయన చాలాకాలం నటనకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో 7జీ రెయిన్‌బో కాలనీ చిత్రానికి సీక్వెల్‌ను నిర్మించాలని ఆలోచన ఉన్నట్లు నిర్మాత ఎంఎం.రత్నం ఇటీవల ఒక వేదికపై పేర్కొన్నారు.
అయితే ఇందులో నటించే హీరో హీరోయిన్లు ఎవరు, దర్శకుడు ఎవరు అనేది ఆయన ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఆయన తెలుగులో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరిహర వీరమల్లు అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బహుశా ఆ చిత్రం పూర్తయిన తర్వాత 7జీ రెయిన్‌బో కాలనీ సీక్వెల్‌పై దృష్టి పెడతారేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment