తుళ్లువదో ఇళమై.. ఈ సినిమాతో సెల్వరాఘవన్ దర్శకుడిగా, ధనుష్ హీరోగా పరిచయమయ్యాడు. వీరిద్దరూ తొలి చిత్రంతోనే అనూహ్య విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ధనుష్ హీరోగా కాదల్ కొండేన్ చిత్రం చేసి మరోసారి సక్సెస్ అందుకున్నాడు. కాగా సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన మూడవ చిత్రం 7 జీ రెయిన్‌బో కాలనీ. 2004లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది.
నిర్మాత ఏఎం రత్నం వారసుడు రవికృష్ణ కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఆయనకు జంటగా నటి సోనియా అగర్వాల్ నటించింది. ఈమెకు ఇదే తొలి చిత్రం. వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఏఎం.రత్నం నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్టయింది. సుమారు రెండు దశాబ్దాల తర్వాత 7జీ రెయిన్‌బో కాలనీ(7జి బృందావన కాలనీ) చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడానికి సెల్వరాఘవన్ సిద్ధమయ్యాడు. ఈ చిత్రాన్ని ఏఎం రత్నమే నిర్మించనున్నట్లు తాజా సమాచారం.
కాగా ఈ చిత్రంలో నటి సోనియా అగర్వాల్‌కు బదులుగా మలయాళం హీరోయిన్ అనశ్వర రాజన్ నటించనున్నట్లు తెలిసింది. ఈమె బాలనటిగా రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత పలు చిత్రాల్లో వివిధ పాత్రలో నటిస్తూ గుర్తింపు పొందింది. ఇటీవల త్రిష కథానాయికగా నటించిన రాంగీ చిత్రంలోనూ ముఖ్యపాత్రను పోషించింది. అదేవిధంగా థగ్స్ , హిందీ చిత్రం యారియన్ 2 తదితర చిత్రాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. కాగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. నటుడు రవి కష్ణ కూడా ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా రీఎంట్రీ ఇవ్వనున్నారు.
చదవండి: థియేటర్‌లో రిలీజైన వారం రోజులకే ఓటీటీలోకి.. మరో మూడు సినిమాలు స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment