
తమిళ హీరో శింబు నటించిన చివరి చిత్రం పత్తుతల. ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. దీంతో ఈయన తర్వాత చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ఆయన అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శింబు కథానాయకుడిగా కమల్ హాసన్ ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి దేశింగు పెరియసామి దర్శకత్వం వహించనున్నారట. ఈయన చెప్పిన కథ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ప్రముఖ స్టార్స్‌ను మెప్పించిందని, ఇందులో రజనీ నటించాల్సిందని ప్రచారం జరిగింది.
హీరో, విలన్.. అన్నీ ఒక్కడే
అలాంటి కథలో ఇప్పుడు శింబు నటించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రం కోసం శింబు కరాటే వంటి విద్యల్లో శిక్షణ పొందడం విశేషం. ఇది పీరియాడికల్ కథా చిత్రంగా ఉంటుందని టాక్. ఈ మూవీలో శింబు హీరో, విలన్ పాత్రను తనే పోషించనున్నారని టాక్! ఇకపోతే ఈ చిత్రంలో బాలీవుడ్ మోస్ట్ టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న దీపికాపదుకొనే, కీర్తీసురేశ్ హీరోయిన్లుగా నటించనున్నట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ క్వీన్‌తో..
హీరోకు జంటగా కీర్తీసురేశ్, విలన్ సరసన దీపికా పదుకొనే నటించబోతున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే ఇది నిజంగానే భారీ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రమవుతుంది. దీపికా పదుకొనే చాలా గ్యాప్ తరువాత మరోసారి కోలీవుడ్ ప్రేక్షకులను ఈ చిత్రం ద్వారా పలకరించనున్నారన్నమాట. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లను ఫిబ్రవరి మూడో వారంలో విడుదల చేయడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది: మెగాస్టార్ ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment