సినిమా ఇండస్ట్రీలో ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడాకులు తీసుకుంటారు. ఒకప్పుడు బెస్ట్ కపుల్ అనిపించుకున్న వారే ఆ తర్వాత విడాకులు తీసుకొని షాక్ ఇచ్చిన జంటలు చాలానే ఉన్నాయి. వారిలో తమిళ స్టార్ డైరెక్టర్ సెల్వరాఘవన్- హీరోయిన్ సోనియా అగర్వాల్ కూడా ఉన్నారు. 7/G బృందావన్ కాలనీతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ సోనియా అగర్వాల్.
ఆ సినిమా సమయంలోనే డైరెక్టర్ సెల్వరాఘవన్‌తో ప్రేమలో పడిన ఆమె హీరోయిన్‌గా పీక్ టైంలో ఉండగానే అతడిని 2006లో పెళ్లాడింది. అయితే మనస్పర్థల కారణంగా వీరు 2010లో విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ విషయంపై సెల్వ రాఘవన్ ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ''కొన్ని కారణాల వల్ల నేను, సోనియా విడాకులు తీసుకున్నాం.
అప్పుడు నా తమ్ముడు ధనుష్ ఒక మాట అన్నాడు.. దీని గురించి త్వరగా బయటపడు. దేవుడు నీకు సరైన అవకాశం ఇస్తాడు. అప్పుటిదాకా ఒంటరిగా ఉండు అని. నిజంగానే విడాకుల తర్వాత చాలా మానసిక క్షోభకు గురయ్యాను. కానీ సరైన సమయంలో నా జీవితంలోకి గీతాంజలి వచ్చింది. ఆమె వల్ల నా జీవితంలో పెను మార్పు చోటుచేసుకుంది. ఇప్పుడు ఇద్దరం సంతోషంగా ఉన్నాం'' అంటూ చెప్పుకొచ్చారు. సెల్వ రాఘవన్ 2011 లో గీతాంజలి రామన్ ను రెండో వివాహం చేసుకోగా సోనియా మాత్రం సింగిల్‌గానే ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment