బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయన్నది సామెత మాత్రమే కాదు.. జీవిత సత్యం కూడా. దర్శకుడు సెల్వ రాఘవన్, నటుడు ధనుష్‌ల కథ ఇంచుమించు ఇలాంటిదే. వీరిద్దరూ అన్నదమ్ములు అన్న విషయం తెలిసిందే! ఇద్దరు ఒకేసారి సినీ ప్రయాణం ప్రారంభించారు. తుళ్లువదో ఇళమై చిత్రంతో సెల్వరాఘవన్ దర్శకుడుగా, ధనుష్ నటుడుగా పరిచయం అయ్యారు.
ఈ చిత్రం తర్వాత కాదల్ కొండాన్, పుదుపేట్టై, మయక్కం వంటి ఎన్నో చిత్రాలు రూపొందించి మంచి విజయాలను అందుకున్నారు. ఆ తర్వాత సెల్వరాఘవన్, ధనుష్ ఎవరి బాటలో వారు ప్రయాణించారు. చాలా కాలం తర్వాత ఇటీవల 'నానే వరువేన్' చిత్రంతో మళ్లీ కలిశారు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ విషయాన్ని పక్కన పెడితే ధనుష్ కథానాయకుడిగా చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. దర్శకుడిగా, నిర్మాతగా విజయాలను అందుకున్నారు. కాగా ఇప్పుడు దర్శకుడు సెల్వరాఘవన్ కూడా నటుడిగా అవతారం ఎత్తారు. ఈయన సాని కాగితం చిత్రంలో ప్రధాన పాత్రను పోషించి ప్రశంసలను అందుకున్నారు.
అదేవిధంగా బీస్ట్, నానేవరువేన్ చిత్రాలలో కీలకపాత్రలను పోషించారు. రుద్ర తాండవం చిత్రంలో కథానాయకుడిగానూ నటించారు. తాజాగా సెల్వ రాఘవన్.. తాను కథానాయకుడిగా పరిచయం చేసిన తన సోదరుడు ధనుష్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ధనుష్ తన 50వ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తూ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సెల్వ రాఘవన్ ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు తాజా సమాచారం. నటి దుషారా నాయకిగా నటిస్తున్న ఇందులో ఎస్ జే సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, అపర్ణ బాలమురళి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టార్ కథా చిత్రం అని తెలిసింది.
చదవండి: భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న కీర్తి సురేశ్.. ఎంతంటే?
మిథునం రచయిత కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment