భార్యతో తిట్లు తిన్న ప్రముఖ డైరెక్టర్‌.. వీడియో వైరల్! | Director Selva Raghavan Shared The Video Of His Fight With His Wife Viral On Social Media- Sakshi
Sakshi News home page

Selvaraghavan: రెండో భార్యతో గొడవపడ్డ డైరెక్టర్‌.. నెట్టింట వీడియో వైరల్!

Published Fri, Mar 1 2024 7:30 PM | Last Updated on Fri, Mar 1 2024 7:50 PM

Kollywood Director Selvaraghavan Shares Video With His Wife - Sakshi

కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో సెల్వరాఘవన్ ఒకరు. స్టార్‌ హీరోలందరితో ఆయన పలు సినిమాలు చేశారు. కాదల్ కొండేన్ సినిమాతో సెల్వరాఘవన్ దర్శకుడిగా పరిచయమయ్యారు. అయితే అప్పట్లో సూపర్‌ హిట్‌గా నిలిచిన 7/జీ బృందావన కాలనీ హీరోయిన్‌ను 2006లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఏడాది తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన గీతాంజలిని 2011లో రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే తాజాగా డైరెక్టర్‌ సెల్వ రాఘవన్ తన భార్యతో గొడవ పడిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన భార్య తిడుతున్న వీడియోను పోస్ట్ చేయడంతో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెల్వరాఘవన్ ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.

కానీ సతీమణితో గొడవ పడిన విషయాన్ని నెట్టింట పోస్ట్ చేయడంతో ఎంతటి వారైనా భార్య చేతిలో తిట్లు తప్పవని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోలో సెల్వ రాఘవన్ కూడా నేనేం చేశాను.. నన్ను ఎందుకు తిట్టావు.. అంటూ ఫన్నీగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరలవుతోంది. కాగా.. సెల్వ రాఘవన్ ప్రస్తుతం ధనుష్ చిత్రంలో 'రాయాన్' ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement