
కోలీవుడ్‌లో 'తుళ్లువదో ఇళమై' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన సెల్వరాఘవన్ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత కాదల్‌కొండేన్, 7జీ రెయిన్‌బో కాలనీ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నటుడిగా బిజీ అవుతున్న ఈయన మళ్లీ దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యారు. ఈయన ఇంతకుముందు కోలీవుడ్‌లో దర్శకత్వం వహించిన సక్సెస్‌ఫుల్ చిత్రం 7జీ రెయిన్‌బో కాలనీ తెలుగులో 7/G బృందావన్ కాలనీగా విడుదలైంది.
(ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన అంకుశం రామిరెడ్డి ఎలా మరణించారో తెలుసా?)
తెలుగు వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీస్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అందులో 7/G బృందావన్ కాలనీ ఒకటి. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ మూవీ 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అప్పట్లో ఈ సినిమాకు యువతలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్‌కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.
తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ను తెరకెక్కించేందకు ప్లాన్ చేస్తున్నారు సెల్వరాఘవన్. తొలి భాగంలో నిర్మాత ఏఎం.రత్నం వారసుడు రవికృష్ణ కథానాయకుడిగా పరిచయం అయ్యారు. తరువాత ఆయన నటించిన పలు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో నటనకు దూరంగా ఉంటున్నారు. అలాంటిది 7/G బృందావన్ కాలనీ చిత్రం ద్వారా రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాడు.
(ఇదీ చదవండి: BRO Twitter Review ‘బ్రో’ మూవీ ట్విటర్ రివ్యూ)
కాగా ఇందులో నటించే కథానాయకి పాత్ర కోసం నటి అదితి శంకర్, ఇవనాలలో ఒకరిని నటింపజేయడానికి దర్శకుడు సెల్వరాఘవన్ చర్చలు జరుపుతున్నట్లు టాక్. వీరిలో ఆ లక్కీ నటి ఎవరనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అదితిశంకర్ నటించిన మావీరన్ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అధర్వ తమ్ముడు ఆకాశ్ మురళీకి జంటగా నటిస్తున్నారు. ఇకపోతే లవ్ టుడే చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న నటి ఇవనా నటుడు హరీశ్ కల్యాణ్‌కు జంటగా నటించిన ఎల్‌జీఎం చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. కాగా 7/G బృందావన్ కాలనీ చిత్రానికి సీక్వెల్ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment