ఆయన భార్యకు ఇష్టమైతే..నటించడానికి ఓకే
జీవితంలో అనుభవాలకు మించిన పాఠాలు ఉండవని చెప్పడం అతిశయోక్తి కాకపోవచ్చు. అలా పరిణితి పొందిన నటి సోనియా అగర్వాల్. ఆది నుంచి విజయపరంపరను కొనసాగించిన ఈ ఉత్తరాది బ్యూటీ దర్శకు డు సెల్వరాఘవన్‌ను ప్రేమించి పెళ్లాడిన తరువాత జీవితంలో కాస్త తడబడ్డారు. అందుకు మూల్యం భారీగానే చెల్లించుకోవాల్సి వచ్చింది. మనస్పర్థలు, పెళ్లి విడాకులు సోనియాను బాధించాయనే చెప్పాలి. మళ్లీ నటనపై దృష్టి సారించిన సోనియా అగర్వాల్‌కు ఇటీవల హాస్య నటుడు వివేక్ సరసన నటించిన పాలక్కాట్టు మాధవన్ చిత్రంలో నటనకు మంచి గుర్తింపే లభించింది. ఈ సందర్భంగా ఈ భామ తో చిన్న భేటీ
ప్రశ్న: డ్రీమ్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న మీరు నటి సదా ఇప్పుడు హాస్యనటుల సరసన నటిస్తున్నారే?
జ: కలలరాణి, అందాల దేవతలుగా మేము పే రు తెచ్చుకుని ఉండవచ్చు. ఇప్పుడు సినిమా పూర్తిగా మారి పోయింది. చాలా చిత్రాల్లో కథానాయికలు వేరే మాదిరిగా నటిస్తున్నా రు. నటి త్రిష ఎన్నై అరిందాల్ చిత్రంలో తల్లిగా నటించారు. నాకిప్పుడు 33 ఏళ్ల వయసు. ఈ వయసుకు ఏతరహా పాత్ర ల అవకాశాలు వస్తాయో అవే చేయగ లం. 16 ఏళ్ల అమ్మాయిలా స్క్రీన్ మీద కనిపించలేం కదా? నాకు తెలిసి ఇప్పుడు కథ, పాత్రలే ముఖ్యం. మేమంతా పాత్రదారులం అంతే.
ప్రశ్న: విద్యాబాలన్ లాంటి తారలు చాలెంజింగ్ పాత్రలు చేస్తున్నారు. మీరు అలాంటి పాత్రలు చేయాలని ఆశిస్తున్నారా?
జ: రిస్క్ చేయడం అంటే సహజంగానే ఇష్టం.విద్యాబాలన్, కంగనా రావత్ తరహాలో చిత్రాలు చేయడానికి నేనేప్పుడూ సిద్ధమే.
ప్రశ్న: దర్శకుడు సెల్వరాఘవన్ నుంచి విడిపోయిన తరువాత ఒంటరి జీవితం సంతోషంగా ఉందా? కష్టం అనిపిస్తోందా?
జ : నాకు ఒంటరిగా ఉంటున్నాననే భావనే కలగలేదేప్పుడూ. నా చుట్టూ ఎప్పుడూ నా నట బృందం ఉంటుంది. నేనాయన్ని మిస్ చేసుకున్న విషయం నిజమే. అయితే అందుకు బాధ పడలేదు. ఒక బ్రేక్‌అప్ అంతే. అయినా అదే నిర్ణయం కాదు. నా కుటుంబం, బంధువులతో సంతోషంగా జీవిస్తున్నాను. చెన్నైలోనే నివశిస్తున్నాను. ఇక్కడే నటిస్తున్నాను.
ప్రశ్న: సరే దర్శకుడు సెల్వరాఘవన్ మళ్లీ చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రంలో అవకాశం వస్తే నటిస్తారా?
జ : ఇప్పటి వరకూ ఆ చిత్రంలో నటించమని నన్ను ఎవరూ అడగలేదు. సెల్వరాఘవన్ మరో పెళ్లి చేసుకున్నారు. పిల్లలున్నారు. ఆయన చిత్రంలో నటించాలని నాకూ చాలా ఆశే. అయితే నేను నటించడం ఆయన భార్యా ఇష్ట పడాలి. ఆమె ఎలాంటి సమస్య ఉండదని భావిస్తే నేను తప్పకుండా నటిస్తాను.
ప్రశ్న: నటుడు ధనుష్ గురించి?
జ: ధనుష్ మంచి నటుడు. ప్రతిభావంతుడు. నాకు మంచి మిత్రుడు. మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు. ఒకే రంగంలోనే ఉన్నాం కదా?ఆయనతో నటించే అవకావం మరోసారి వస్తే తప్పకుండా నటిస్తా.
ప్రశ్న: చాలా మంది నటీమనులు నటన కాకుండా వేరే వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. మీకు అలాంటి ఆలోచన లేదా?
జ: చండీగర్‌లో లెదర్ ఫ్యాక్టరీ ప్రారంభించనున్నాను. ఆ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆగస్టులో ఆ వ్యాపారం ప్రారంభమవుతుందని భావిస్తున్నాను. ఒక పక్క నటన, మరో పక్క వ్యాపారం అంటూ ప్లాన్ చేస్తున్నాను.
ప్రశ్న: మళ్లీ వివాహం చేసుకునే ఆలోచన ఉందా?
జ: ఎమీ నిర్ణయించు కోలేదు. అయితే మంచి వ్యక్తి దొరికితే, నా గురించి తనూ, ఆయన గురించి నేను పూర్తిగా తెలుసుకుని ఒకరినొకరు అర్థం చేసుకుంటే తప్పక పెళ్లి చేసుకుంటా. మరో మూడు నాలుగేళ్లు ఆగమని చెప్పను. వెంటనే పెళ్లి చేసుకుంటాను.
ప్రశ్న: ఎక్కువగా పార్టీలో కనిపిస్తున్నారనే వాళ్ల ప్రశ్నకు మీ సమాధానం?
జ: నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేసుకుంటున్నాను. ఇందులో ఎ వరికేం చింత? పార్టీలకు వెళ్లే స్వేచ్ఛ నాకు ఉంది. వెళుతున్నాను. ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదుగా.