అలాంటి వ్యక్తి నా జీవితంలో లేనట్లే.. ముఖం కూడా చూడను: సోనియా అగర్వాల్ | Sonia Agarwal About Her Divorce With Selvaraghavan - Sakshi
Sakshi News home page

Sonia Agarwal : భార్యాభర్తలుగా దూరమై స్నేహితులుగా ఎలా కలుస్తాం: సోనియా అగర్వాల్

Published Thu, Aug 24 2023 1:51 PM | Last Updated on Thu, Aug 24 2023 2:02 PM

Sonia Agarwal About Her Divorce With Selvaraghavan - Sakshi

సోనియా అగర్వాల్ టాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా కుర్రకారులో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. 2004లో విడుదలైన '7/జీ బృందావన కాలనీ' అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం కుమారుడు రవికృష్ణ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో సోనియా అగర్వాల్ హీరోయిన్ నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తర్వాత ఇక్కడ అంతగా అవకాశాలు రాకపోవడంతో తమిళ్‌, కన్నడ సినిమాలపై ఫోకస్‌ పెట్టి అక్కడ మంచి విజయాలే అందుకుంది. తాజాగ '7/జీ బృందావనీ కాలనీ'  సీక్వెల్‌ తీస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: చంద్రయాన్‌ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్‌ హీరోయిన్‌)

తమిళంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలోనే హీరో ధనుష్‌ అన్నయ్య అయిన  దర్శకుడు సెల్వ రాఘవన్‌ను 2006లో వివాహమాడి ఆపై  2010లో విడాకులు తీసుకుంది. తర్వాత సెల్వరాఘవన్ 2011లో మళ్లీ పెళ్లి చేసుకున్నా.. సోనియా ఒంటరిగానే జీవిస్తోంది. తాజాగ ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను ఇలా పంచుకున్నారు. 'దర్శకుడిగా సెల్వరాఘవన్ మొండి పట్టుదలగలవాడు.

కానీ వ్యక్తిగత జీవితంలో అలాంటి వ్యక్తి కాదు. చాలా ప్రశాంతమైన వ్యక్తి, ఎల్లప్పుడూ బిజీగా ఉంటారు. రచన వగైరాలతో ఎప్పుడూ తనదైన లోకంలో ఉండేవాడు. కానీ తనతో వైవాహిక జీవితం గురించి ఇక మాట్లాడే ప్రసక్తే లేదు. మేం ఎందుకు విడిపోయామో అతనికి, నాకు తెలుసు. ప్రస్తుతం ఆయన వెళ్తున్న దారిలో ఎంత సంతోషంగా ఉన్నారో.. నేను కూడా అంతే సంతోషంగా ఉన్నాను.' అని సోనియా అన్నారు.

జీవితంలో భార్యాభర్తలుగా కలిసి ఉన్నవాళ్లు విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా ఎలా ఉంటున్నారో తనకు అర్థం కావడం లేదని తెలిపింది. తన వరకు అయితే అది సాధ్యం కాదని చెప్పింది. అలాంటి పని మాత్రం చేయలేనని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అతను తన కంటికి మళ్లీ స్నేహితుడిగా కనిపించడని పేర్కొంది. ప్రేమ చనిపోయిన తర్వాత స్నేహితుడిలా చూడలేమని తెలిపింది. జీవితంలో మళ్లీ తన ముఖం చూడనని, అలాంటి వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ లేనట్లేనని సోనియా అగర్వాల్ అన్నారు. పెళ్లి తర్వాత తన సినిమా కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదని సోనియా పేర్కొంది.

(ఇదీ చదవండి: రాజమౌళి- మహేశ్‌బాబు సినిమాపై అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది)

పెళ్లి జరిగిన సమయం నుంచే నటించకూడదని సెల్వ కుటుంబం అభ్యంతరం చెప్పిందని ఆమె గుర్తుచేసుకుంది. అందుకే ఆ సమయంలో  బ్రేక్ తీసుకున్నానని తెలిపింది.  అయితే 2010లో  భర్త నుంచి విడిపోయిన తర్వాత, తిరిగి సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసినట్లు సోనియా చెప్పింది. ఆ తర్వాత ఆమె కన్నడ,తమిళ్‌లో పలు సినిమాలతో బిజీగానే ఉంటుంది. ఇప్పుడు  '7/జీ బృందావన కాలనీ' సీక్వెల్‌తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆమె ప్రకటించింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement