డ్రగ్స్‌ కేసుతో నాకు సంబంధం లేదు : నటి సోనియా | Bengaluru drug case:Sonia Aggarwal Upset On Being Dragged In Drug case | Sakshi
Sakshi News home page

'బాత్రూంలో దాక్కున్న నటి'.. మీడియాపై సోనియా ఫైర్‌

Sep 2 2021 11:16 AM | Updated on Sep 2 2021 11:38 AM

Bengaluru drug case:Sonia Aggarwal Upset On Being Dragged In Drug case - Sakshi

Bengaluru Drug Case : కన్నడ పరిశ్రమలో డ్రగ్స్‌ వ్యవహారం మరోసారి దుమారం రేపుతోంది.  ఇప్పటికే ఈ కేసులో హీరోయిన్స్‌ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్ట్‌ అయి ఇటీవలె బెయిల్‌ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నటి, మోడల్‌ సోనియా అగర్వాల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈమె ప్రస్తుతం కర్ణాటకలో కాస్మోటిక్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తుంది.

తాజాగా బెంగుళూరులో ఏకకాలంలో జరిపిన సోదాల్లో సోనియాతో పాటు మరో వ్యాపారవేత్త భరత్‌, డీజే వచన్‌ చిన్ప‍ప్ప ఇళ్లలో డ్రగ్స్‌  బయటపడ్డాయి. దీంతో వీరందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరికి  వీరికి నైజీరియా డ్రగ్స్‌ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా డ్రగ్స్‌ వ్యవహారంలో నటి సోనియా అగర్వాల్‌ అరెస్ట్‌ కాగా కొన్ని మీడియా సంస్థలు అత్యత్సాహంతో ఆమెకు బుదులుగా సినీ నటి సోనియా అగర్వాల్‌ ఫోటోను ప్రచురించాయి.

పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో భయపడి ఆమె బాత్రూంలో దాక్కుందని, అయినా లాక్కొచ్చి పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో అంతా 7/జీ  బృందావన కాలనీ ఫేమ్‌ సోనియానే అనుకున్నారు. కానీ సోనియా ఆ వార్తలను కొట్టిపారేశారు. ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని, అసలు పోలీసులు రైడ్‌ చేసింది తన ఇంట్లో కాదని, ఆ సమయంలో తాను కేరళలో షూటింగ్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన గురించి తప్పుడు వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలు, వెబ్‌సైట్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది.

చదవండి : Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన చార్మీ
‘ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిని.. విచార‌ణ‌కు హాజ‌రుకాలేను’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement