ఎవనవన్‌ అంటున్న సోనియా అగర్వాల్‌ | Sonia Agarwal says evanavan | Sakshi
Sakshi News home page

ఎవనవన్‌ అంటున్న సోనియా అగర్వాల్‌

Published Fri, Feb 10 2017 1:50 AM | Last Updated on Tue, Sep 5 2017 3:18 AM

ఎవనవన్‌ అంటున్న సోనియా అగర్వాల్‌

ఎవనవన్‌ అంటున్న సోనియా అగర్వాల్‌

నటి సోనియా అగర్వాల్‌ చాలా గ్యాప్‌ తరువాత మళ్లీ నటిగా బిజీ అవుతున్నారు.ఈమె నటించిన చాయ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఎవనవన్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమెతో కలిసి నటుడు అశోకన్‌ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. డ్రీమ్‌ ఆన్‌ ఫ్రేమ్స్‌ పతాకంపై తంగముత్తు, పీకే.సుందర్, కరుణ, నటరాజ్‌ కలిసి నిర్మిస్తున్న ఇందులో అఖిల్‌సంతోష్, మురుగాట్రుపడై చారణ్, సాక్షీశివ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. దీనికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని జే.నట్టికుమార్‌ నిర్వహిస్తున్నారు. అమెరికాలో సినిమా కోర్స్‌ను చదివిన ఈయన.. మోహమున్‌ వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాత జానకిరామన్‌ కొడుకు.

ఇంతకు ముందు రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తమ చిత్ర అవార్డును అందుకున్న మెయ్‌పొరుళ్, పనితుళి చిత్రాలకు నట్టికుమార్‌ దర్శకత్వం వహించారన్నది గమనార్హం. తాజా చిత్రం ఎవనవన్‌ గురించి దర్శకుడు తెలుపుతూ నేటి యువత తాము చేసే పనుల్లో చాలా అవగాహనతో ఉంటున్నారన్నారు. వాటి భవిష్యత్తు  పరిణామాల గురించి ముందుగానే ఊహిస్తున్నారని, అయితే కొందరు మాత్రం చేసే పనుల్లో తప్పులు దొర్లితే అదేమంత పెద్ద తప్పు కాదులే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అలాంటి చిన్న చిన్న తప్పులే చివరికి ఎలాంటి సమస్యలను తెచ్చిపెడుతున్నాయన్నది ఆవి ష్కరించే చిత్రంగా ఎవనవన్‌ చిత్రం ఉంటుందని తెలిపారు. ఇంతకు ముందు తాను తెరకెక్కించిన పిణితుళి చిత్ర షూటింగ్‌ను అధిక భాగం అమెరికాలో చిత్రీకరించినట్లు చెప్పారు.అయితే ఈ చిత్రాన్ని చెన్నై, ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు వెల్లడించారు. పాటలను మాత్రం మలేషియాలో షూట్‌ చేసినట్లు చెప్పారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని బధవారం సాయంత్రం స్థానిక మైలాపూర్‌లోని రష్యన్‌ కల్చరల్‌ సెంటర్‌ ఆవరణలో నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement