‘అమ్మా నాన్న ఊరెళితే’
‘అమ్మా నాన్న ఊరెళితే’
Published Tue, Aug 6 2013 1:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
‘7/జి బృందావన కాలనీ’లో నాయికగా చేసిన సోనియా అగర్వాల్ ఓ ప్రత్యేక పాత్ర పోషించిన చిత్రం ‘అమ్మా నాన్న ఊరెళితే’. అంజి శ్రీను దర్శకుడు. జక్కుల నాగేశ్వరరావు నిర్మాత. సిద్దార్థ్ వర్మ, విజయ్, మధు, తేజ, శిల్పాస్విత ఇందులో ముఖ్యతారలు.
ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘నేటి యువతపై ప్రభావం చూపుతున్న విషయాలను టార్గెట్ చేస్తూ ఈ సినిమా చేశాం.
వాణిజ్య అంశాలతో పాటు వినోదానికీ పెద్ద పీట వేశాం. ఈ నెల మూడో వారంలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మున్నకాశి, కెమెరా: ఖాదర్, సహనిర్మాతలు: సలామ్, అశోక్.
Advertisement
Advertisement