హాస్యనటుడు వివేక్ నటి సోనియా అగర్వాల్ నడుమును రెచ్చిపోయి గిల్లేశాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. హాస్యనటుడిగా తమిళ ప్రేక్షకుల గుండెల్లో గూడుకట్టుకున్న వివేక్‌కు కథా నాయకుడిగా ఆదరణ పొందాలన్నది చిరకాలవాంఛ. అందుకు చేసిన ఒకటి రెండు ప్రయత్నాలు సఫలం కాలేదు. తాజాగా మరో ప్రయత్నమే పాలక్కాడు మాధవన్. ఈ చిత్రంలో ఆయన తన మార్కు హీరోయిజాన్ని చూపించడానికి సిద్ధం అయ్యారు. ఎస్‌ఎస్‌ఎస్ ఎం టర్‌టైన్‌మెంట్ అధినేత జె ఎ లారెన్స్ సమర్పణలో మ్యాగ్నస్ ప్రొడక్షన్ పతాకంపై ఎస్.సజీవ్ నిర్మించిన చిత్రం పాలక్కాడు మాధవన్.
వివేక్ సరసన సోనియా అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటి షీలా ముఖ్యపాత్రను పోషించారు. ఎం.చంద్రమోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్రీకాంత్‌దేవా సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువా రం ఉదయం చెన్నైలోని సత్యం సినీ కాంప్లెక్స్‌లో జరిగింది. చిత్ర ఆడియోను నటు డు శివకార్తికేయన్ ఆవిష్కరించగా యువ సంగీత దర్శకుడు అనిరుధ్ తొలి సీడీని అందుకున్నారు. ఈ చిత్రంలో అనిరుధ్ ఒక పాట పాడటం విశేషం.
ఈ కార్యక్రమంలో నటుడు వివేక్ మాట్లాడుతూ ఇది అగ్రహారంలో జరిగే వినోదభరిత కథా చిత్రం అన్నారు. తన లాంటి నటులు సరసన నటించడానికి చాలామంది హీరోయిన్లు సాహసించని పరిస్థితిలో నటి సోనియా అగర్వాల్ ధైర్యంగా ముందుకొచ్చి నటించారన్నారు. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో తానామె నడుమును గిల్లాల్సి ఉంటుందన్నారు. అలా చేయడానికి సందేహించడంతో ఫర్వాలేదు నటనే కదా అంటూ సోనియా ప్రోత్సహించారన్నారు. అలాంటి ఎంకరేజ్‌మెంట్ ఉండడంతో రెచ్చిపోయి గిల్లేశానని అన్నారు. పాలక్కాట్టు మాధవన్‌ను మొదట చిన్న చిత్రం గానే ప్రారంభించినా పెద్ద చిత్రంగా తెరకెక్కిందని వివేక్ వెల్లడించారు.
ఆమె నడుమును గిల్లేశా
Published Fri, Apr 24 2015 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM
Advertisement
Advertisement