
తరువాత ఏమైంది..?
సస్పెన్స్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘తరువాత కథ’. సోనియా అగర్వాల్, అర్చన, సమీర్, వినోద్‌కుమార్
సస్పెన్స్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘తరువాత కథ’. సోనియా అగర్వాల్, అర్చన, సమీర్, వినోద్‌కుమార్ ముఖ్యతారలుగా శ్రీ పద్మావతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్. పద్మజ నిర్మించారు. ప్రభాకరన్ దర్శకుడు. ఈ నెల మూడో వారంలో సినిమా విడుదల కానుంది. ప్రతి సన్నివేశం తరువాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తిని రేకెత్తించే విధంగా ఈ చిత్రం ఉంటుందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఉదయభాస్కర్, సంగీతం: తారక రామరావు, ఎడిటింగ్: రమే్‌ష్.