Tharuvatha Katha
-
తరువాత ఏమైంది..?
సస్పెన్స్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘తరువాత కథ’. సోనియా అగర్వాల్, అర్చన, సమీర్, వినోద్‌కుమార్ ముఖ్యతారలుగా శ్రీ పద్మావతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్. పద్మజ నిర్మించారు. ప్రభాకరన్ దర్శకుడు. ఈ నెల మూడో వారంలో సినిమా విడుదల కానుంది. ప్రతి సన్నివేశం తరువాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తిని రేకెత్తించే విధంగా ఈ చిత్రం ఉంటుందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఉదయభాస్కర్, సంగీతం: తారక రామరావు, ఎడిటింగ్: రమే్‌ష్. -
ఉత్కంఠ భరితంగా...
‘7/జి బృందావన్ కాలనీ’ ఫేమ్ సోనియా అగర్వాల్, అర్చన, వినోద్‌కుమార్, రవిప్రకాశ్, శివాజీ రాజా ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘తరువాత కథ’. ప్రభాకరన్ దర్శకత్వంలో ఆర్. పద్మజ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్స్‌కి భిన్నంగా ఉండటంతో పాటు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది. పార్వతీ చంద్ ఇచ్చిన సంభాషణలు, తారక రామారావు స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: ఉదయ్‌భాస్కర్ జాస్తి.