Sonia Agarwal Detective Sathyabama Movie Trailer And First Look Released - Sakshi
Sakshi News home page

Sonia Agarwal: ‘డిటెక్టివ్‌ సత్యభామ’గా సోనియా అగర్వాల్‌, ట్రైలర్‌, ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Published Fri, Dec 10 2021 8:40 AM | Last Updated on Fri, Dec 10 2021 9:46 AM

Sonia Agarwal Detective Sathyabama Movie Trailer And First Look Released - Sakshi

సోనియా అగర్వాల్, సాయి పంపన, రవి వర్మ, సునీత పాండే ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘డిటెక్టివ్‌ సత్యభామ’. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అంతం చేయడానికి సత్యభామ చేసిన పోరాటమే ఈ చిత్రం. నవనీత్‌ చారి దర్శకత్వంలో శ్రీశైలం పోలెమోని నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్‌ను విడుదల చేసిన తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ.. ‘‘మహిళలపై జరుగుతున్న ఆత్యాచారాల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. నవనీత్‌ మల్టీ టాలెంటెడ్‌. సిరాజ్‌గారి ద్వారా ఈ సినిమా విడుదల కానుండటం నిర్మాతలకు హెల్ప్‌ అవుతుంది’’ అన్నారు.

‘‘చాలా తక్కువ సమయంలో అనుకున్న బడ్జెట్‌లో నవనీత్‌గారు ఈ సినిమాను పూర్తి చేశారు. త్వరలోనే సినిమా విడుదల వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు శ్రీశైలం. ‘‘సోనీ అగర్వాల్‌ వంటి ఓ స్టార్‌ హీరోయిన్‌ ఈ సినిమా కథను ఓ సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేయడాన్ని బట్టి కథలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు నవనీత్‌. ఈ కార్యక్రమంలో మాటల రచయిత బాషా శ్రీ, టీఎఫ్‌సీసీ డైరెక్టర్స్‌ వింగ్‌ జాయింట్‌ సెక్రటరీ సిరాజ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement