అనుష్క అప్‌సెట్‌ అయిందా! | Anushka GOT UPSET WITH RECENT RUMOR | Sakshi
Sakshi News home page

అనుష్క అప్‌సెట్‌ అయిందా!

Published Sun, Sep 25 2016 7:56 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

అనుష్క అప్‌సెట్‌ అయిందా!

అనుష్క అప్‌సెట్‌ అయిందా!

టాలీవుడ్‌ స్వీటీ అనుష్క ఇప్పుడు భారీ సినిమాలతో చాలా బిజీగా ఉంది. ‘బాహుబలి-2’, ’సింగం-3’, ’ఓమ్‌ నమో వెంకటేశాయ’, ’భాగమతి’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న అనుష్క చుట్టూ వెబ్‌ మీడియాలో చాలా రుమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

అనుష్క టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాతతో ప్రేమాయణం సాగిస్తున్నట్టు తాజాగా వందతులు వస్తున్నాయి. ఆ నిర్మాతను త్వరలోనే అనుష్క పెళ్లి కూడా చేసుకోబోతున్నదంటూ టాలీవుడ్‌లో రుమర్లు షికారు చేస్తున్నాయి. అనుష్క పెళ్లి విషయంలో రుమర్లు రావడం ఇదే కొత్త కాదు. గతంలోనూ ఓ యంగ్‌ హీరోను ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్టు వదంతులు ప్రచారం అయ్యాయి. దీంతో అనుష్కనే స్వయంగా వివరణ ఇచ్చింది. తాను రహస్యంగా పెళ్లి చేసుకోబోనని, తన పెళ్లి గురించి అందరికీ చెప్పి చేసుకుంటానని ఆ మధ్య చెప్పింది.

అయినా, తాజాగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న రుమర్లు అనుష్కను బాధించాయట. ఈ కథనాలపై ఆమె తన సన్నిహితుల వద్ద అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అయినా.. ఈ  35 ఏళ్ల జేజమ్మ ఇలాంటి రుమర్లు పట్టించుకోకుండా ఫుల్‌ జోష్‌లో ఉన్న తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందని సన్నిహితులు చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement