Singham 3
-
అఫీషియల్: సింగమ్-3లో హీరోయిన్గా దీపికా పదుకొణె..
బాలీవుడ్లో పోలీస్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలకు రోహిత్ శెట్టి పెట్టింది పేరు. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా ‘సింగమ్’ (2001), ‘సింగమ్ రిటర్న్స్’ (2014)), ‘సింబ’ (2018),‘సూర్యవన్షీ’(2021) వంటి పోలీస్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు వచ్చాయి. ఇక అజయ్ దేవగన్తోనే రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో లేడీ పోలీసాఫీసర్ పాత్రకు దీపికా పదుకోన్‌ను తీసుకున్నట్లు గురువారం ప్రకటించారు రోహిత్. ‘‘సింగమ్ ఎగైన్’లో దీపిక లేడీ సింగమ్’’ అని ‘సర్కస్’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో పేర్కొన్నారు రోహిత్ శెట్టి. రణ్ వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘సర్కస్’ ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఇందులో ప్రత్యేక పాటకు భర్త రణ్వీర్తో కలిసి స్టెప్స్ వేశారు దీపిక. ఈ పాట విడుదల వేదికపై సింగమ్ సిరీస్‌లో అజయ్ దేవగన్ ఎలా నడిచేవారో అనుకరిస్తూ దీపికా నడిచి, అలరించారు. -
జ్యోతిక ఆ మాట అనకముందే నేను సినిమా చేస్తా!
వంద రోజులు ఆడిన సినిమాల గురించి విన్నాం. వంద రోజులు వాయిదా పడిన సినిమా గురించి ఇప్పుడు వింటున్నాం. అదే ‘ఎస్3–యముడు3’. ‘అయినా నో టెన్షన్’ అంటున్నారు హీరో సూర్య. ‘సింగం’ సిరీస్ మీద ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం అలాంటిది అన్నారు. సూర్య, అనుష్క, శ్రుతీహాసన్ ముఖ్య తారలుగా హరి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ‘సింగం–3’ని నిర్మాత మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఈ నెల 9న వస్తున్న ఈ సినిమా గురించి సూర్య చెప్పిన సంగతులు..... జ్యోతికకి బైక్ నేర్పినట్టున్నారు? ఇట్ వాజ్ ఫన్. ఆల్రెడీ తనకి కొంచెం వచ్చు. గతంలో ఓ సినిమాలో హ్యార్లీ డేవిడ్సన్ నడిపింది. ‘మగళిర్ మట్టుమ్’లోని ఓ సీన్లో ఆగ్రా, ఉత్తరప్రదేశ్ రోడ్లపై ఊర్వశిగారిని వెనక కూర్చోబెట్టుకుని బుల్లెట్ నడపాలి. జ్యోతిక ఓ నెలలో కంప్లీట్‌గా నేర్చుకుంది. మొదటిరోజే నేను తన వెనక కూర్చోవలసి వచ్చింది. ‘నీకంత కాన్ఫిడెన్స్ ఏంటి? నేను బండి పడేస్తాననే భయం లేదా?’ అని జ్యోతిక అడిగింది. నేను వెనక కూర్చుంటే తనకి కాన్ఫిడెన్స్ పెరిగి, బాధ్యతగా బైక్ రైడ్ చేస్తుందని నా నమ్మకం. ► మొత్తానికి వాయిదాల పర్వం పూర్తయింది! (నవ్వుతూ..) దీపావళికి చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. ఓసారి తమిళనాడు ముఖ్యమంత్రి మరణం, మరోసారి ‘జల్లికట్టు’.. తదితర కారణాల వల్ల సుమారు వంద రోజులు వాయిదా పడింది. విడుదల తేదీ ప్రకటించి, మళ్లీ మళ్లీ వాయిదా వేయడం వల్ల ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ పెరుగుతుంది. కానీ, వాళ్లంతా ప్రేమ, గౌరవంతో సినిమాపై ఆసక్తితో ఉన్నారు. ‘సింగం’ సిరీస్‌కి హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఉండడం వల్లే ‘ఎస్ 3’పై క్రేజ్ ఉంది. ► వసూళ్లపై ఈ ప్రభావం ఉంటుందనుకుంటున్నారా? దీపావళికి విడుదలైతే 15 నుంచి 20 శాతం ఎక్కువ వసూళ్లు వచ్చే ఛాన్సుందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఇప్పుడు పండగ వాతావరణం లేదు. కానీ, ఫిబ్రవరిలో విడుదలైన కార్తీ ‘పరుత్తి వీరన్’, ‘యుగానికి ఒక్కడు’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. కథ బాగుంటే సినిమా ఎప్పుడు విడుదలైనా హిట్టే. ► ‘జల్లికట్టు’కి మద్దతుగా సినిమా వాయిదా వేస్తే.. పబ్లిసిటీ కోసమేనంటూ పెటా ఆరోపణలు చేయడం, మీరు లీగల్ నోటీసుల వరకూ వెళ్లడం.. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? తమిళనాడు ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ‘జల్లికట్టు’కి మద్దతుగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఓ తమిళ వ్యక్తిగా నేనూ మద్దతిచ్చా. ‘దిస్ ఈజ్ మై ఫేస్. నేను బయటకి వచ్చినప్పుడు నా ముఖాన్ని పక్కనపెట్టి, మాస్క్ వేసుకుని రాలేను కదా!’. ‘ఎస్3’ విడుదలకి నాలుగు రోజుల ముందు ఈ ‘జల్లికట్టు’ అంశం తెరపైకి వచ్చింది. ఓ తమిళుడిగా సంస్కృతి పరిరక్షణకు మద్దతిస్తే వాళ్లు అలా మాట్లాడడం బాధాకరం. చివరికి, క్షమాపణలు చెప్పారు. ► ‘సింగం’ ఫ్రాంఛైజీలో మిమ్మల్ని ఎగై్జట్ చేస్తున్న అంశాలేంటి? ఈరోజు ఐపీయస్ సీవీ ఆనంద్‌గారితో మాట్లాడితే... ప్రభుత్వ సహకారంతో బ్యాంకాక్ వెళ్లి కృషి బ్యాంక్ నిందితులను పట్టుకున్న వైనం గురించి చెప్పారు. ‘సింగం–2’లో ఆపరేషన్ ‘డి’ పేరుతో హీరో సౌతాఫ్రికా వెళతాడు. సినిమాల్లో చూపించినవి 80 శాతం రియల్ లైఫ్‌లో జరుగుతున్నాయి. మామూలుగా ఓ మనిషిని చెంపదెబ్బ కొట్టడానికి కూడా మన చట్టాలు ఒప్పుకోవు. కానీ, కమర్షియల్ యాక్షన్ పేరుతో ఓ 20 శాతం డ్రామా జోడించి, అర్థవంతమైన కమర్షియల్ సినిమాలు తీస్తున్నాం. సీవీ ఆనంద్ వంటి రాష్ట్రపతి పురస్కార గ్రహీతలు (పోలీసులు) ‘సింగం’ చిత్రాలను గౌరవిస్తున్నారు. పోలీస్ ట్రైనింగ్ అకాడెమీలలో చూపించి ‘మీరూ ఇలా ఉండాల’ని చెబుతున్నారు. అవి విన్నప్పుడు ఎగై్జట్‌మెంట్ వస్తుంది. ►ఎన్టీఆర్, ఎమ్జీఆర్ సీఎంలుగా ఉన్నప్పటి సంఘటనల స్ఫూర్తితో ‘ఎస్3’ తీశామన్నారు. అవేంటి? పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఓ సీనియర్ అధికారి మాకు చెప్పింది ఏంటంటే... ఎన్టీఆర్‌గారు మొదటిసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు తమిళనాడు సీఎంగా ఎమ్జీఆర్ ఉన్నారు. అప్పుడు ఏపీలో జరిగిన ఓ రైడ్‌కి ఎక్కువ పోలీస్ సపోర్ట్ అవసరమైనప్పుడు ఎమ్జీఆర్గారు తమిళనాడు ఐపీయస్ అధికారులను ఏపీకి పంపించారు. ఓ రాష్ట్ర పోలీసులు పొరుగు రాష్ట్ర పోలీసులకు సహాయం చేయడమనే సంఘటన స్ఫూర్తితో దర్శకుడు హరిగారు ఈ కథ రాశారు. ► ‘సింగం’ మ్యూజిక్‌కి బ్రాండ్ తీసుకొచ్చిన దేవిశ్రీప్రసాద్‌ని ఎందుకు తప్పించారు? సంగీత దర్శకుడు హ్యారీస్ జయరాజ్‌తో నేను 8, హరిగారు 4 సినిమాలు చేశాం. అన్నీ మ్యూజికల్ హిట్సే. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడం కోసమే ‘ఎస్3’కి ఆయన్ని తీసుకున్నాం. ప్రతి సినిమాకీ మణిరత్నం ఒకే డీఓపీతో పని చేయరు కదా! ఇదీ అంతే. ఏం చేసినా ‘సింగం’ బ్రాండ్ కోసమే. దేవిశ్రీతో ఈ మాట చెప్పగానే పెద్ద మనసుతో అంగీకరించారు. ► ‘ఎస్3’కి ముందు హరి దర్శకత్వంలో మరో కథతో సినిమా చేయాలనుకున్నారు కదా! అది మిలటరీ నేపథ్యంలో జరిగే కథ. ఫుల్ స్క్రిప్ట్ రెడీ. నాకూ ఆ సినిమా చేయాలనుంది. ‘సింగం–4’కి ముందే అది పట్టాలు ఎక్కుతుందని ఆశిస్తున్నా. ప్రస్తుతానికి ఏదీ ప్లాన్ చేయలేదు. ► ‘స్పెషల్ చబ్బీస్’ రీమేక్ ‘తానా సేంద కూట్టమ్’ చిత్రీకరణ ఎంతవరకూ వచ్చింది? కంప్లీట్ రీమేక్ కాదు. ఆ సిన్మాలో రెండు సన్నివేశాల స్ఫూర్తితో వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు విఘ్నేశ్ శివన్ కొత్త కథ రాశాడు. ‘స్పెషల్ చబ్బీస్’ కంటే ‘తానా సేంద కూట్టమ్’ డిఫరెంట్‌గా ఉంటుంది. యువ దర్శకులతో పనిచేసినప్పుడు మనల్ని కొత్తగా ఆవిష్కరిస్తారు. రజనీకాంత్‌గారు కూడా యువ దర్శకుడు రంజిత్‌తో ‘కబాలి’ చేశారు. ► మొన్న ఆదివారం మీ శ్రీమతి జ్యోతికకి దోసెలు వేశారు. తొలిసారి గరిటె తిప్పారా? లేదండీ! (నవ్వుతూ..) అప్పుడప్పుడూ వంట చేస్తాను. ఆమ్లెట్స్, దోసెలు వేస్తా. సమోసాలు చేయడమూ వచ్చు. అయితే... జ్యోతిక ‘మగళిర్ మట్టుమ్’ ట్రైలర్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. చాలా మంచి చిత్రమది. నలుగురు మహిళలు రోడ్ ట్రిప్‌కి వెళ్లినప్పుడు ఏం జరిగిందనేది కథ. మహిళలు మాత్రమే కాదు మగవారు కూడా చూడాల్సిన సినిమా. ► ‘మగళిర్ మట్టుమ్’ని తెలుగులో డబ్బింగ్ చేసే ఆలోచన ఉందా? తప్పకుండా డబ్బింగ్ చేస్తాం. ‘36 వయదినిలే’ తెలుగు డబ్బింగ్ కూడా పూర్తయింది. మంచి విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నాం. పెళ్లైన మహిళల్లో స్ఫూర్తి నింపే చిత్రమది. ఏ వయసులోనైనా కొత్త కెరీర్ స్టార్ట్ చేయొచ్చని చెప్పే సినిమా. ఎంటర్టైన్మెంట్ సినిమాలు మనం ఎక్కువ చేస్తాం. ఒక్కోసారి వాటిలో అర్థవంతమైన విషయాలు కూడా చెప్పొచ్చు. అప్పుడొచ్చే సంతృప్తి, సంతోషం మాటల్లో వర్ణించలేం. ► మీరు, మీ భార్య జ్యోతిక మళ్లీ తెరపై కనిపించేది ఎప్పుడు? గతేడాది కలసి ఓ సినిమా చేయాల్సింది. కానీ, కుదరలేదు. మళ్లీ ‘నేను నటించడం మానేస్తాను’ అని జ్యోతిక చెప్పక ముందే ఓ సినిమా చేసేయాలి. -
సముద్రం... స్వీట్ మెమొరీస్!
‘‘ఓపక్క అందమైన సముద్రం.. మరోపక్క ‘సింగం–3’ షూటింగ్.. నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి తెలుసా!’’ అన్నారు శ్రుతీహాసన్. సూర్య సరసన ఆమె ఓ కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘సింగం–3’. హరి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంలో అనుష్క మరో కథానాయిక. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని ‘ఎస్3– యముడు–3’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 26న రిలీజవుతున్న ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలను విశాఖలోనే చిత్రీకరించారు. ‘‘చిన్నప్పుడు ఎప్పుడో నాన్నగారి (కమల్‌హాసన్)తో పాటు విశాఖ వెళ్లా. నాన్న షూటింగ్ చేస్తుంటే.. నేను వేసవి సెలవుల్ని ఎంజాయ్ చేశా. ‘ఎస్3’ షూటింగ్ చేస్తుంటే చిన్నప్పటి జ్ఙాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఈ చిత్రంలో నేను జర్నలిస్ట్‌గా నటించా. చాలా బోల్డ్ క్యారెక్టర్’’ అన్నారు శ్రుతీహాసన్. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ – ‘‘నిజాయితీ గల పోలీసాఫీసర్ వృత్తి నిర్వహణలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడనేది చిత్రకథ. పరుగులు పెట్టే కథనంతో మాస్ –యాక్షన్ ఎంటర్టైనర్గా హరిగారు ఈ సినిమా తీశారు. ‘యముడు’, ‘సింగం’ సినిమాల తరహాలో ‘ఎస్3’ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, ‘రాడాన్’ రవి, సుమిత్ర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: హ్యారిస్ జయరాజ్. -
సింగం 3 మరోసారి వాయిదా..?
సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సీరీస్ సింగం. తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన ఈ సీరీస్‌లో ఇప్పుడు మూడో భాగం రెడీ అయ్యింది. తొలి రెండు భాగాలకు మించి భారీ బడ్జెట్‌తో మరింత రేసీ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సింగం 3 సినిమాను ముందుగా డిసెంబర్ 16నే రిలీజ్ చేయాలని భావించారు. అయితే అందుకు వారం ముందు ధృవ సినిమా రిలీజ్ కావటంతో సింగం 3ని డిసెంబర్ 23కు వాయిదా వేశారు. కానీ ఇప్పుడు 23న కూడా ఈ సినిమా రిలీజ్ ఉండదనే టాక్ వినిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో పాటు వర్థ తుఫాను దెబ్బకు విలవిలలాడిన ప్రజలు అప్పుడే థియేటర్లకు వస్తారా.. అన్న ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. అదే సమయంలో సెన్సార్ బోర్డ్ సింగం 3 సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వటం కూడా వాయిదాకు కారణం అన్న టాక్ వినిపిస్తోంది. తమిళనాట యు సర్టిఫికేట్ వచ్చిన సినిమాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో మరోసారి రివ్యూ కమిటీకి వెళ్లి సింగం 3కి యు సర్టిఫికేట్ తెచ్చుకోవాలని భావిస్తున్నారట. అందుకే సినిమాను మరో వారం పాటు వాయిదా వేస్తే బెటర్ అన్న ఆలోచన ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. సింగం 3 సినిమా రిలీజ్ డేట్‌పై గురువారమే నిర్మాత జ్ఞానవేల్ రాజా క్లారిటీ ఇవ్వనున్నారు. -
రామ్‌చరణ్ కోసమే ఈ అడ్జస్ట్మెంట్! - హీరో సూర్య
‘‘హీరోగా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు నా కోసం కథలు రాస్తారనీ, ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు. ఐదేళ్ల తర్వాత ‘సింగం-3’ చేయాలనేది మా ప్లాన్. కుటుంబ సభ్యులు, అభిమానుల కోరిక మేరకు ఇప్పుడే చేశా. నా కోసమే 8 నెలలు కష్టపడి హరి ఈ కథ రాశారు’’ అన్నారు సూర్య. హరి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సింగం-3’. ‘సింగం’ సిరీస్‌లో వస్తోన్న ఈ మూడో చిత్రంలో అనుష్క, శ్రుతీహాసన్ హీరోయిన్లు. హ్యారీస్ జైరాజ్ స్వరకర్త. తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 11న తెలుగు పాటల్ని, 23న తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. విడుదల తేదీని ఈ నెల 16 నుంచి 23కు మార్చడంపై సూర్య స్పందిస్తూ.. ‘‘రామ్‌చరణ్ ‘ధృవ’ మా ఫ్యామిలీ సినిమా వంటిదే. దాంతో చిన్న అడ్జస్ట్మెంట్ చేశాం’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ - ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్, తమిళనాడులో ఎమ్జీఆర్ సీఎంలుగా ఉన్నప్పడు జరిగిన ఘటనల స్ఫూర్తితో చిత్రం తెరకెక్కింది. ‘సింగం’ అనేది సినిమా మాత్రమే కాదు, ఓ మతం’’ అన్నారు. ‘‘సూర్య అంటే అభిమానం. అందుకే ‘సింగం-3’ హక్కులు తీసుకున్నా’’ అన్నారు మల్కాపురం శివకుమార్. ‘‘టీజర్, ట్రైలర్లు థౌజెండ్‌వాలా అయితే.. సినిమా టెన్ థౌజెండ్ వాలా తరహాలో ఉంటుంది’’ అన్నారు మాటల రచయిత శశాంక్ వెన్నెలకంటి. -
ముందుకు దూకడానికే!
సింహం ఓ అడుగు వెనక్కి వేసిందంటే నాలుగడుగులు ముందుకు దూకుతుందంటారు. ఇప్పుడు తమిళ నటుడు సూర్య అభిమానులు ఈ మాటే అంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సింగం-3’ విడుదల ఓ వారం వెనక్కి వెళ్లింది. ఈ చిత్రాన్ని తొలుత ఈ నెల 16న రిలీజ్ చేయాలనుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల ఓ వారం వాయిదా వేసి, రెండు భాషల్లోనూ ఈ నెల 23న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్య, అనుష్క, శ్రుతీ హాసన్ ముఖ్యతారలుగా హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. తెలుగులో నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేస్తున్నారు. త్వరలో తెలుగు పాటలు విడుదల చేయనున్నారు. హ్యారీస్ జైరాజ్ స్వరకర్త. అన్నట్లు, సూర్య సినిమా ఒక వారం వెనక్కి వెళ్ళిందే తడవుగా, తెలుగులో కొన్ని సినిమాల రిలీజ్ ముందుకొచ్చింది. -
తెలిసి తప్పు చేస్తే...
తప్పు చేస్తే.. అదీ తెలిసి తప్పు చేస్తే.. ఆ చేసినోడు దేవుడైనా వదలకూడదనే సిన్సియర్ పోలీసాఫీసర్ నరసింహం అవినీతిపరులను ఎలా వేటాడాడనే కథతో రూపొందుతోన్న చిత్రం ‘సింగం-3’ (ఎస్-3). యముడు 3.. అనేది ఉపశీర్షిక. హరి దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మల్కాపురం శివకుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ 48 గంటల్లో ఐదు మిలియన్ వ్యూస్ సాధించింది. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ‘‘తెలుగు, తమిళ భాషల్లో టీజర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. ‘యముడు’, ‘సింగం’ చిత్రాల తర్వాత సింగం ఫ్రాంచైజీలో వస్తున్న ఈ చిత్రంలో సూర్య నటన, క్యారెక్టర్ హైలైట్‌గా నిలుస్తాయి. హీరోయిన్లు అనుష్క, శ్రుతీహాసన్ క్యారెక్టర్లకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలాఖరున పాటల్ని, డిసెంబర్ 16న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు -
సింగం ఈజ్ బ్యాక్!
భయం లేదు.. చిక్కులెన్ని ఎదురైనా ముందడుగు వేసే వీరుడు.. పిడుగల్లే వచ్చే పోలీస్.. నరసింహం అలియాస్ సింగం మళ్లీ వస్తున్నాడు. సింహంలా గర్జించడానికి సిద్ధమయ్యాడు. హరి దర్శకత్వంలో మాస్ పోలీసాఫీసర్ నరసింహంగా హీరో సూర్య నటిస్తున్న చిత్రం ‘సింగం-3’. ‘యముడు’, ‘సింగం’ చిత్రాల తర్వాత ‘సింగం’ ఫ్రాంచైజీలో రూపొందుతోన్న మూడో చిత్రమిది. దీపావళి కానుకగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. నవంబర్ 7న టీజర్ విడుదల చేయనున్నారు. అనుష్క, శ్రుతీహాసన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ - ‘‘సింగం సిరీస్‌లో గత రెండు సినిమాల కంటే పవర్ఫుల్ కథతో ఈ సినిమా రూపొందుతోంది. నవంబర్ చివరి వారంలో పాటల్ని, డిసెంబర్ 16న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
సింగంతో ఓ సెల్ఫీ
వన్.. టు.. త్రీ.. మొన్నటివరకూ శ్రుతీహాసన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసేశారు. అదే ‘సింగం-3’. సూపర్ హిట్ ‘సింగం’ ఫ్రాంచైజీలో రూపొందు తోన్న మూడో చిత్రమిది. ‘యముడు’, ‘సింగం’ చిత్రాలతో సూర్యకు సూపర్ సక్సెస్ అందించిన దర్శకుడు హరి, ఈ మూడో చిత్రానికి సైతం దర్శకత్వం వహిస్తున్నారు. జార్జియా లో సూర్య, శ్రుతీలపై చిత్రీకరించిన పాటతో షూటింగ్ మొత్తం పూర్తయిందని సమాచారం. ‘‘సింగం 3’ షూటింగ్ పూర్తి చేశా, తర్వాతి సినిమా కోసం ఎదురు చూస్తున్నా’’ అని శ్రుతీహాసన్ ట్వీట్ చేశారు. ఈ సినిమా గుర్తుగా సూర్యతో ఓ సెల్ఫీ తీసుకున్నారు. అనుష్క మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నవంబర్‌లో పాటల్ని, డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి కానుకగా టీజర్ విడుదల చేయనున్నారు. -
అనుష్క అప్సెట్ అయిందా!
టాలీవుడ్ స్వీటీ అనుష్క ఇప్పుడు భారీ సినిమాలతో చాలా బిజీగా ఉంది. ‘బాహుబలి-2’, ’సింగం-3’, ’ఓమ్ నమో వెంకటేశాయ’, ’భాగమతి’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న అనుష్క చుట్టూ వెబ్ మీడియాలో చాలా రుమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అనుష్క టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాతతో ప్రేమాయణం సాగిస్తున్నట్టు తాజాగా వందతులు వస్తున్నాయి. ఆ నిర్మాతను త్వరలోనే అనుష్క పెళ్లి కూడా చేసుకోబోతున్నదంటూ టాలీవుడ్లో రుమర్లు షికారు చేస్తున్నాయి. అనుష్క పెళ్లి విషయంలో రుమర్లు రావడం ఇదే కొత్త కాదు. గతంలోనూ ఓ యంగ్ హీరోను ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్టు వదంతులు ప్రచారం అయ్యాయి. దీంతో అనుష్కనే స్వయంగా వివరణ ఇచ్చింది. తాను రహస్యంగా పెళ్లి చేసుకోబోనని, తన పెళ్లి గురించి అందరికీ చెప్పి చేసుకుంటానని ఆ మధ్య చెప్పింది. అయినా, తాజాగా ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న రుమర్లు అనుష్కను బాధించాయట. ఈ కథనాలపై ఆమె తన సన్నిహితుల వద్ద అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అయినా.. ఈ 35 ఏళ్ల జేజమ్మ ఇలాంటి రుమర్లు పట్టించుకోకుండా ఫుల్ జోష్‌లో ఉన్న తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందని సన్నిహితులు చెప్తున్నారు. -
వర్షం.. సముద్రం.. సింగం..!
తొలకరి చినుకుల పలకరింపులు ప్రారంభమయ్యాయి. ఈ వర్షంలో ఎవరికైనా పని చేయాలంటే కాస్త చికాకు సహజమే.. వీలైతే వర్షంలో తడవాలనుకుంటారు. కుదిరితే ఇంటి పట్టున కూర్చుని వేడి వేడి పకోడీ లాగించాలనుకుంటారు. శ్రుతీహాసన్ మాత్రం షూటింగ్ చేయడానికే ఇష్టపడతారు. ‘‘ఆహా.. విశాఖలో వాతావరణం ఎంత బాగుంది!! పక్కనే సముద్రం.. పైన వర్షం.. నాకు బాగా ఇష్టమైన రెండు విషయాలు. ‘సింగం 3’ తాజా షెడ్యూల్ మొదలైంది’’ అని సోషల్ మీడియాలో శ్రుతి పేర్కొన్నారు. వర్షం పడుతున్న వేళ నటించడమంటే ఈ బ్యూటీకి బాగా ఇష్టమట. ‘‘వాతావరణం కూల్‌గా ఉంటుంది. కూల్‌గా పని చేయొచ్చు. అందుకే వర్షం పడుతున్నా పని చేయాలనుకుంటా’’ అని శ్రుతి అంటున్నారు. ‘యముడు’, ‘సింగం’ చిత్రాల తర్వాత తమిళ హీరో సూర్య, దర్శకుడు హరి కలయికలో రూపొందుతున్న చిత్రం ‘సింగం 3’. ప్రస్తుతం విశాఖలో చిత్రీకరణ జరుగుతోంది. ఓ పెద్ద కేసుని పరిష్కరిస్తున్న పోలీస్ అధికారి సూర్యకు సహాయం చేసే విలేకరి విద్యా పాత్రలో శ్రుతి కనిపిస్తారని సమాచారం. నెలాఖరు వరకూ విశాఖలో ‘సింగం 3’ షెడ్యూల్ జరుగనుంది. అనుష్క మరో కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక.. తండ్రి కమల్‌హాసన్‌తో శ్రుతి నటిస్తున్న ‘శభాష్ నాయుడు’ గురించి చెప్పాలంటే... ఈ రియల్ లైఫ్ ఫాదర్, డాటర్ ఈ చిత్రంలో రీల్‌పై కూడా ఆ పాత్రల్లో కనిపించనున్నారు. లాస్ ఏంజిల్స్, అమెరికాలో గత నెల 7 నుంచి 26వ తేదీ వరకూ ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. శ్రుతిపై ఓ పాటతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అమెరికా నుంచి ఇండియా తిరిగొచ్చిన వెంటనే నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభించారు. మూడు భాషల్లోనూ 42 నిమిషాల నిడివి గల సన్నివేశాల ఎడిటింగ్ పూర్తయిందని కమల్ తెలిపారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయాలను కుంటున్నారు. -
బీచ్‌లో హీరో సూర్య కలకలం
పోలీసుల హడావుడితోసందర్శకుల్లో కలవరం సినిమా షూటింగ్ సందడి అని తెలిసి ఆనందం బీచ్‌రోడ్ : రయ్‌న దూసుకొచ్చిన కార్లు... బిలబిలామంటూ దిగిన పోలీసులు. ఈ హడావుడికి విశాఖ బీచ్ రోడ్డులో జనం హడలిపోయారు. కాసేపు పోలీసుల హడావుడి చూసిన వారు...చివరకు అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ హడావుడి అంతా హీరో సూర్య నటిస్తున్న సింగం-3 సినిమా షూటింగ్లో భాగం. నిజానికి సినిమా షూటింగ్ అంటే పెద్ద పెద్ద కెమెరాలు, రెండు మూడు మేకప్ బస్సులు ఉంటాయి. కానీ ఈ షుటింగ్ మాత్రం అలాంటి హడావుడి లేకుండా అత్యాధునిక కెమెరాలను ఉపయోగించడం వల్ల ఇది సినిమా షూటింగ్ అనే విషయం తెలుసుకోవటానికే కొంత సమయం పట్టింది. షూటింగ్లో భాగంగా సూర్య ఎరుపు రంగు కారులో వచ్చి ఓ రౌడీని విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టి తరువాత కారులో వెళ్లిపోవాలి. ఇదీ సీన్. కానీ సూర్య తిరిగి వెళ్లేటప్పుడు ఎరుపు రంగు కారు స్టార్ట్ కాలేదు. దీంతో మరల తెలుపు రంగు కారుతో సీన్‌ను రీషూట్ చేశారు. బీచ్‌లో సందర్శకులు ఈ షూటింగ్‌ను ఆసక్తిగా తిలకించారు. -
జూలైలో సెట్స్ మీదకు సూర్య, త్రివిక్రమ్ మూవీ
చాలా రోజులుగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తానంటూ ఊరిస్తూ వస్తున్న సూర్య.. ఎట్టకేలకు దానికి ముహూర్తం నిర్ధారించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాను 2016 జూలైలో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం త్రివిక్రమ్ నితిన్ హీరోగా అ..ఆ.. సినిమాను తెరకెక్కిస్తుండగా, ఇటీవలే 24 షూటింగ్ పూర్తిచేసిన సూర్య, సింగం 3 షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత సూర్య, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను త్రివిక్రమ్‌తో వరుస సినిమాలు చేస్తున్న హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మించనున్నారు. త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.