తెలిసి తప్పు చేస్తే... | Singam 3 teaser Five Million Views | Sakshi
Sakshi News home page

తెలిసి తప్పు చేస్తే...

Published Sun, Nov 13 2016 11:02 PM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM

తెలిసి తప్పు చేస్తే... - Sakshi

తెలిసి తప్పు చేస్తే...

తప్పు చేస్తే.. అదీ తెలిసి తప్పు చేస్తే.. ఆ చేసినోడు దేవుడైనా వదలకూడదనే సిన్సియర్ పోలీసాఫీసర్ నరసింహం అవినీతిపరులను ఎలా వేటాడాడనే కథతో రూపొందుతోన్న చిత్రం ‘సింగం-3’ (ఎస్-3). యముడు 3.. అనేది ఉపశీర్షిక. హరి దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మల్కాపురం శివకుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ 48 గంటల్లో ఐదు మిలియన్ వ్యూస్ సాధించింది. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ‘‘తెలుగు, తమిళ భాషల్లో టీజర్‌కు అద్భుత స్పందన లభిస్తోంది. ‘యముడు’, ‘సింగం’ చిత్రాల తర్వాత సింగం ఫ్రాంచైజీలో వస్తున్న ఈ చిత్రంలో సూర్య నటన, క్యారెక్టర్ హైలైట్‌గా నిలుస్తాయి. హీరోయిన్లు అనుష్క, శ్రుతీహాసన్ క్యారెక్టర్లకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలాఖరున పాటల్ని, డిసెంబర్ 16న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement