వర్షం.. సముద్రం.. సింగం..! | Suriya S3 (Singam 3) Shooting with Shruthi Hasan in Vizag | Sakshi
Sakshi News home page

వర్షం.. సముద్రం.. సింగం..!

Published Tue, Jul 12 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

వర్షం.. సముద్రం.. సింగం..!

వర్షం.. సముద్రం.. సింగం..!

తొలకరి చినుకుల పలకరింపులు ప్రారంభమయ్యాయి. ఈ వర్షంలో ఎవరికైనా పని చేయాలంటే కాస్త చికాకు సహజమే.. వీలైతే వర్షంలో తడవాలనుకుంటారు. కుదిరితే ఇంటి పట్టున కూర్చుని వేడి వేడి పకోడీ లాగించాలనుకుంటారు. శ్రుతీహాసన్ మాత్రం షూటింగ్ చేయడానికే ఇష్టపడతారు. ‘‘ఆహా.. విశాఖలో వాతావరణం ఎంత బాగుంది!! పక్కనే సముద్రం.. పైన వర్షం.. నాకు బాగా ఇష్టమైన రెండు విషయాలు. ‘సింగం 3’ తాజా షెడ్యూల్ మొదలైంది’’ అని సోషల్ మీడియాలో శ్రుతి పేర్కొన్నారు. వర్షం పడుతున్న వేళ నటించడమంటే ఈ బ్యూటీకి బాగా ఇష్టమట. ‘‘వాతావరణం కూల్‌గా ఉంటుంది. కూల్‌గా పని చేయొచ్చు.

అందుకే వర్షం పడుతున్నా పని చేయాలనుకుంటా’’ అని శ్రుతి అంటున్నారు. ‘యముడు’, ‘సింగం’ చిత్రాల తర్వాత తమిళ హీరో సూర్య, దర్శకుడు హరి కలయికలో రూపొందుతున్న చిత్రం ‘సింగం 3’. ప్రస్తుతం విశాఖలో చిత్రీకరణ జరుగుతోంది. ఓ పెద్ద కేసుని పరిష్కరిస్తున్న పోలీస్ అధికారి సూర్యకు సహాయం చేసే విలేకరి విద్యా పాత్రలో శ్రుతి కనిపిస్తారని సమాచారం. నెలాఖరు వరకూ విశాఖలో ‘సింగం 3’ షెడ్యూల్ జరుగనుంది. అనుష్క మరో కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక.. తండ్రి కమల్‌హాసన్‌తో శ్రుతి నటిస్తున్న ‘శభాష్ నాయుడు’ గురించి చెప్పాలంటే... ఈ రియల్ లైఫ్ ఫాదర్, డాటర్ ఈ చిత్రంలో రీల్‌పై కూడా ఆ పాత్రల్లో కనిపించనున్నారు.

లాస్ ఏంజిల్స్, అమెరికాలో గత నెల 7 నుంచి 26వ తేదీ వరకూ ఫస్ట్ షెడ్యూల్ జరిగింది. శ్రుతిపై ఓ పాటతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అమెరికా నుంచి ఇండియా తిరిగొచ్చిన వెంటనే నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభించారు. మూడు భాషల్లోనూ 42 నిమిషాల నిడివి గల సన్నివేశాల ఎడిటింగ్ పూర్తయిందని కమల్ తెలిపారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయాలను కుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement