
బాలీవుడ్‌లో పోలీస్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలకు రోహిత్ శెట్టి పెట్టింది పేరు. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా ‘సింగమ్’ (2001), ‘సింగమ్ రిటర్న్స్’ (2014)), ‘సింబ’ (2018),‘సూర్యవన్షీ’(2021) వంటి పోలీస్ బ్యాక్‌డ్రాప్ చిత్రాలు వచ్చాయి. ఇక అజయ్ దేవగన్‌తోనే రోహిత్ శెట్టి ‘సింగమ్ ఎగైన్’ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో లేడీ పోలీసాఫీసర్ పాత్రకు దీపికా పదుకోన్‌ను తీసుకున్నట్లు గురువారం ప్రకటించారు రోహిత్.
‘‘సింగమ్ ఎగైన్’లో దీపిక లేడీ సింగమ్’’ అని ‘సర్కస్’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో పేర్కొన్నారు రోహిత్ శెట్టి. రణ్ వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘సర్కస్’ ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఇందులో ప్రత్యేక పాటకు భర్త రణ్‌వీర్‌తో కలిసి స్టెప్స్ వేశారు దీపిక. ఈ పాట విడుదల వేదికపై సింగమ్ సిరీస్‌లో అజయ్ దేవగన్ ఎలా నడిచేవారో అనుకరిస్తూ దీపికా నడిచి, అలరించారు.
Comments
Please login to add a commentAdd a comment