సముద్రం... స్వీట్‌ మెమొరీస్‌! | srutihasan in Singham-3 shooting | Sakshi
Sakshi News home page

సముద్రం... స్వీట్‌ మెమొరీస్‌!

Published Wed, Jan 18 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM

సముద్రం... స్వీట్‌ మెమొరీస్‌!

సముద్రం... స్వీట్‌ మెమొరీస్‌!

‘‘ఓపక్క అందమైన సముద్రం.. మరోపక్క ‘సింగం–3’ షూటింగ్‌.. నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి తెలుసా!’’ అన్నారు శ్రుతీహాసన్‌. సూర్య సరసన ఆమె ఓ కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘సింగం–3’. హరి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ చిత్రంలో అనుష్క మరో కథానాయిక. సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత మల్కాపురం శివకుమార్‌ ఈ చిత్రాన్ని ‘ఎస్‌3– యముడు–3’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 26న రిలీజవుతున్న ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలను విశాఖలోనే చిత్రీకరించారు. ‘‘చిన్నప్పుడు ఎప్పుడో నాన్నగారి (కమల్‌హాసన్‌)తో పాటు విశాఖ వెళ్లా. నాన్న షూటింగ్‌ చేస్తుంటే.. నేను వేసవి సెలవుల్ని ఎంజాయ్‌ చేశా. ‘ఎస్‌3’ షూటింగ్‌ చేస్తుంటే చిన్నప్పటి జ్ఙాపకాలన్నీ గుర్తొచ్చాయి.

ఈ చిత్రంలో నేను జర్నలిస్ట్‌గా నటించా. చాలా బోల్డ్‌ క్యారెక్టర్‌’’ అన్నారు శ్రుతీహాసన్‌. మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ – ‘‘నిజాయితీ గల పోలీసాఫీసర్‌ వృత్తి నిర్వహణలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడనేది చిత్రకథ. పరుగులు పెట్టే కథనంతో మాస్‌ –యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా హరిగారు ఈ సినిమా తీశారు. ‘యముడు’, ‘సింగం’ సినిమాల తరహాలో ‘ఎస్‌3’ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, ‘రాడాన్‌’ రవి, సుమిత్ర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: హ్యారిస్‌ జయరాజ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement