S3
-
ఆనందంతో నాన్నగారు హత్తుకున్నారు
‘‘ఎస్ 3’ అందరికంటే నాకు చాలా ఇంపార్టెంట్. ఈ నెల 9న ఏ పండగా లేదు. అయినా, ‘సింగం’ ప్రేమికులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఇంత పెద్ద హిట్ చేశారు. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని హీరో సూర్య అన్నారు. సూర్య, అనుష్క, శ్రుతీహాసన్ హీరో హీరోయిన్లుగా హరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘ఎస్ 3’ ఇటీవల విడుదలైంది. మంగళవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. సూర్య మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు ‘ఫిల్మ్ ఫేర్ లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్ అవార్డు’ అందుకున్నప్పుడు నేను, కార్తీ ఆయన్ను హత్తుకున్నాం. ఇప్పుడు ‘ఎస్ 3’ చూసి, నాన్నగారు నన్ను హత్తుకున్నారు. అది మాటల్లో చెప్పలేని ఆనందం. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా సంతోషంగా ఉన్నారు. మహిళా ప్రేక్షకులు డైలాగ్స్‌కి చప్పట్లు కొడుతున్నారు. దక్షిణాది చిత్రసీమలో ఏడాదికి వెయ్యి సినిమాలు రిలీజవుతున్నాయి. కానీ, ఏడు శాతం చిత్రాలు మాత్రమే హిట్ అవుతున్నాయి. ఇది చాలా పూర్. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వైవిధ్యమైన సినిమా చేస్తున్నా. కీర్తీ సురేశ్ కథానాయిక. రమ్యకృష్ణగారు ముఖ్య పాత్ర చేస్తున్నారు’’ అన్నారు. ‘‘ఎస్ 3’ హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ చిత్రం వసూళ్లు బాగున్నాయి. మీతో (సూర్య, హరి) నా ప్రయాణం నిరంతరాయంగా కొనసాగాలి’’ అని శివకుమార్ అన్నారు. దర్శకుడు హరి మాట్లాడుతూ– ‘‘మా చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు, సూర్య అభిమానులకు చాలా చాలా కృతజ్ఞతలు. ‘ఎస్ 3’ విజయం చాలా ఎనర్జీ ఇచ్చింది. ‘సింగమ్’ సిరీస్‌లో ‘ఎస్ 4’ మూవీ వస్తుంది. కానీ, వెంటనే కాదు. ఐదారేళ్లు పడుతుంది’’ అన్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - సింగం 3
-
'ఎస్ 3 (యముడు 3)' మూవీ రివ్యూ
టైటిల్ : ఎస్ 3 (యముడు 3) జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : సూర్య, అనుష్క, శృతిహాసన్, థాకూర్ అనూప్ సింగ్, శరత్ సక్సెనా సంగీతం : హారిస్ జయరాజ్ దర్శకత్వం : హరి నిర్మాత : జ్ఞానవేల్ రాజా యముడు(సింగం), సింగం (యముడు 2) సినిమాలతో ఘనవిజయాలు సాధించిన సూర్య, అదే సీరీస్ లో మూడో భాగం ఎస్ 3తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలి రెండు భాగాలకు మించిన స్పీడుతో అంతకు మించిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో తెరకెక్కిన సింగం 3 ఎన్నో అవాంతరాలు, వాయిదాల తరువాత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూడో భాగంతో సూర్య తన స్పీడు కంటిన్యూ చేశాడా..? సింగం సక్సెస్ ట్రాక్ కంటిన్యూ అయ్యిందా..? కథ : కర్ణాటకలో జరిగిన ఓ కమిషనర్ హత్య కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు ఎలాంటి క్లూ సాధించలేకపోతారు. దీంతో ఆ కేసును డీల్ చేయడానికి ఓ పవర్ ఫుల్ ఆఫీసర్‌కు కేసును అప్పగించాలని నిర్ణయిస్తారు. పురుషోత్తమ్, భాయ్, డానీ లాంటి నేరస్తుల ఆటకట్టించిన ఆంధ్రా పోలీస్ నరసింహం (సూర్య) అయితేనే ఈ కేసును సాల్వ్ చేయగలడని, సిబిఐ ద్వారా కర్ణాటకలో అపాయింట్ చేస్తారు. అప్పటికే మంగుళూరు సిటీని తన కంట్రోల్లో పెట్టుకొని ఎన్నో నేరాలు చేస్తున్న ఎంఎస్ రెడ్డి అలియాస్ మదుసూధన్ రెడ్డి (శరత్ సక్సెనా) గురించి తెలుసుకొని కమీషనర్ హత్యకు ఎంఎస్ రెడ్డికి సంబంధం ఉందని అనుమానిస్తాడు. ఆ విషయాలు తెలుసుకోవడానికి ఎంఎస్ రెడ్డి మనుషులతో సన్నిహితంగా ఉంటున్నట్టు నటిస్తాడు నరసింహం. ఈ విషయం గురించి ఇన్వెస్టిగెటివ్ జర్నలిస్ట్ అగ్ని అలియాస్ విద్య (శృతి హాసన్) కర్ణాటక టుడేలో అవినీతి ఆఫీసర్ అంటూ ఆర్టికల్ రాస్తుంది. నరసింహం అనుకున్నట్టుగానే కమీషనర్ హత్య వెనుక ఎంఎస్ రెడ్డి ఉన్నాడని తెలుసుకుంటాడు. కానీ ఇంత పకడ్బందిగా హత్య చేసేంత తెలివి ఎంఎస్ రెడ్డికి లేదని అతని వెనుక ఇంకా ఎదో పెద్ద పవర్ ఉందన్నఅనుమానం కలుగుతుంది. విఠల్ ప్రసాద్ (థాకూర్ అనూప్ సింగ్) సెంట్రల్ మినిస్టర్ రామ్ ప్రసాద్ (సుమన్) కొడుకు. తండ్రి అండతో ఆస్ట్రేలియాలో ఉంటూ అక్కడి స్క్రాప్‌ను ఇండియాకు డంప్ చేసే బిజినెస్ చేస్తుంటాడు. మంగుళూరులో జరిగే ఎన్నో నేరాలకు విఠలే కారణం అని తెలుసుకున్న నరసింహం.. ఆస్ట్రేలియా నుంచి విఠల్‌ను ఇండియా ఎలా రప్పించాడు. చివరకు విఠల్ ఆట ఎలా కట్టించాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : తొలి రెండు భాగాల్లో పవర్ ఫుల్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్న సూర్య మరోసారి తన పవర్ ఫ్యాక్డ్ ఎనర్జీతో అలరించాడు. పదుల సంఖ్యలో క్యారెక్టర్స్ వచ్చిపోతున్నా సినిమా అంతా వన్ మేన్ షో అనిపించేలా ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో సినిమాకు మరింత ఎనర్జి అందించాడు. తొలి రెండు భాగాల్లో సింగం ప్రియురాలి కనిపించిన అనుష్క ఈ సినిమాలో భార్యగా కనిపించింది. కాస్త బొద్దుగా ఉన్నఅనుష్కను చూసి అభిమానులు నిరాశపడినా గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. జర్నలిస్ట్ పాత్రలో కనిపించిన శృతిహాసన్ తనదైన నటనతో మెప్పించింది. స్టైలిష్ విలన్‌గా థాకూర్ అనూప్ సింగ్ నటన బాగుంది. ఇతర పాత్రల్లో శరత్ సక్సెనా, రాధికా శరత్ కుమార్, శరత్ బాబు, సుమన్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : సూర్య మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించిన దర్శకుడు మరోసారి సూర్యలోని ఎనర్జికి తగ్గ పవర్ ఫుల్ పాత్రను డిజైన్ చేశాడు. సింగం సీరీస్ లోని తొలి రెండు భాగాలను మించిన స్పీడుతో ఈసారి సూర్యను యూనివర్సల్ కాప్‌గా చూపించాడు. సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కాస్త లాజిక్లను పక్కన పెట్టిన దర్శకుడు ఏ మూమెంట్ లోనూ సినిమా స్లో అవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే తొలి రెండు భాగాలకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్లస్ అయ్యింది. కానీ మూడో భాగానికి దేవిని పక్కన పెట్టి హారిస్ జయరాజ్‌ను తీసుకోవటం అంతగా వర్క్ అవుట్ కాలేదు. హారిస్ జయరాజ్ నేపథ్య సంగీతంతో పరవాలేదనిపించినా.. పాటల విషయంలో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు.ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సూర్య నటన స్క్రీన్ ప్లే యాక్షన్ ఎపిసోడ్స్ మైనస్ పాయింట్స్ : పాటలు సినిమా లెంగ్త్ ఓవరాల్‌గా ఎస్ 3 (యముడు 3) పవర్ ప్యాక్డ్ పోలీస్ యాక్షన్ డ్రామా.. సింగం జోరు కొనసాగుతోంది... - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
హీరో సూర్యకు పెటా సారీ
చెన్నై: తమిళ హీరో సూర్యకు పెటా (ద పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్) ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి పూర్వా జోషిపురా క్షమాపణలు చెప్పారు. సూర్య కేవలం తన రాబోయే చిత్రం ఎస్3 (ఇప్పుడు సీ3గా పేరు మర్చారు) ప్రచారం కోసమే జల్లికట్టును సమర్థిస్తున్నారని గతంలో పూర్వ వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా సూర్య తన లాయర్ ద్వారా ఆమెకు నోటీసులు జారీ చేయించారు. దీంతో క్షమాపణలు కోరుతూ సూర్య లాయర్‌కు ఆమె ఒక లేఖ పంపారు. -
రిలీజ్ డేట్ ముఖ్యమే
‘‘ప్రతి ఏడాది వందకుపైగా సినిమాలు రిలీజవుతుంటే... 30, 40 సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి. మిగతా సినిమాల్లో మంచివి ఉన్నప్పటికీ, పరిస్థితుల కారణంగా ప్రేక్షకులకు చేరువ కావడం లేదు. రిలీజ్ టైమ్ కూడా ఒక్కోసారి రిజల్ట్‌పై ప్రభావం చూపిస్తుంది’’ అన్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్. సూర్య, అనుష్క, శ్రుతీహాసన్ ముఖ్యతారలుగా హరి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మించిన తమిళ చిత్రాన్ని ‘ఎస్3–యముడు3’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారీయన. ఈ నెల 26న వస్తోన్న ఈ సినిమా గురించి మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ – ‘‘డిసెంబర్ 16న రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. డీమానిటైజేషన్, చెన్నైలో తుఫాన్, ఇతర కారణాలతో వాయిదా పడి ఈ 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. నాకు ప్రతి సినిమాని ప్రేక్షకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం అలవాటు. ఇటీవలే ‘ఎస్3’ ఫస్ట్ కాపీ చూశా. మా సంస్థ నిర్మించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ తర్వాత అంత సంతృప్తినిచ్చిన చిత్రమిదే. రాజకీయ నేపథ్యం గల ఓ ఇంటర్నేషనల్ స్మగ్లర్ని నరసింహం ఎలా పట్టుకున్నాడనేది చిత్రకథ. వృత్తి పట్ల నిబద్ధత, నిజాయితీ కలిగిన పోలీసాఫీసర్ నరసింహంగా సూర్య అద్భుతంగా నటించారు. తమిళ చిత్రమైనా.. తెలుగు నేటివిటీతో కూడిన చిత్రమిది. 60 శాతం చిత్రాన్ని విశాఖలోనే తీశారు. ‘సింగం’ సిరీస్‌లో వచ్చిన ‘యముడు’, ‘సింగం’ చిత్రాలను మించిన యాక్షన్, ఎమోషన్ ‘ఎస్3’లో ఉన్నాయి. సూర్యగారు ఛాన్స్ ఇస్తే ఆయనతో స్ట్రయిట్ తెలుగు సినిమా తీయాలనుంది. ప్రస్తుతం వేరే హీరోలతో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం’’ అన్నారు. -
సముద్రం... స్వీట్ మెమొరీస్!
‘‘ఓపక్క అందమైన సముద్రం.. మరోపక్క ‘సింగం–3’ షూటింగ్.. నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి తెలుసా!’’ అన్నారు శ్రుతీహాసన్. సూర్య సరసన ఆమె ఓ కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘సింగం–3’. హరి దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రంలో అనుష్క మరో కథానాయిక. సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని ‘ఎస్3– యముడు–3’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 26న రిలీజవుతున్న ఈ చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలను విశాఖలోనే చిత్రీకరించారు. ‘‘చిన్నప్పుడు ఎప్పుడో నాన్నగారి (కమల్‌హాసన్)తో పాటు విశాఖ వెళ్లా. నాన్న షూటింగ్ చేస్తుంటే.. నేను వేసవి సెలవుల్ని ఎంజాయ్ చేశా. ‘ఎస్3’ షూటింగ్ చేస్తుంటే చిన్నప్పటి జ్ఙాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఈ చిత్రంలో నేను జర్నలిస్ట్‌గా నటించా. చాలా బోల్డ్ క్యారెక్టర్’’ అన్నారు శ్రుతీహాసన్. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ – ‘‘నిజాయితీ గల పోలీసాఫీసర్ వృత్తి నిర్వహణలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడనేది చిత్రకథ. పరుగులు పెట్టే కథనంతో మాస్ –యాక్షన్ ఎంటర్టైనర్గా హరిగారు ఈ సినిమా తీశారు. ‘యముడు’, ‘సింగం’ సినిమాల తరహాలో ‘ఎస్3’ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, ‘రాడాన్’ రవి, సుమిత్ర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: హ్యారిస్ జయరాజ్. -
మరో టీజర్‌తో ఎస్–3 కనువిందు
నటుడు సూర్య నటించిన ఎస్–3 చిత్రం మరో టీజర్ అభిమానులకు కనువిందు చేస్తోంది. 24 వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత సూర్య నటించిన చిత్రం ఎస్–3. ఈ చిత్రానికి ఇంతకుముందు వచ్చిన సింగం, సింగం–2 చిత్రాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఎస్–3. ఇందులో సూర్యకు జంటగా అనుష్కతో పాటు శ్రుతీహాసన్ నటించారు. హరి దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. పూర్తి కమర్షియల్ అంశాలతో పక్కా మాస్ చిత్రంగా తెరకెక్కిన చిత్రం ఎస్–3. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాలతో పాటు అనుష్క, శ్రుతీహాసన్‌ల అందాలు చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. కాగా గతేడాది డిసెంబర్ 16న ఎస్–3 చిత్రం విడుదల కావలసి ఉండగా పెద్ద నోట్ల ప్రభావం, తదితర అంశాల కారణంగా విడుదలను నిర్మాత వాయిదా వేసుకున్నారు. అయితే ఎస్–3 చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మరో టీజర్‌ను విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ టీజర్‌తో పాటు నటుడు సూర్య తమిళనాడు, కేరళా రాష్ట్రాల్లోని థియేటర్లను పర్యవేక్షించనున్నారని తెలిసింది. ఎస్–3 చిత్రంపై అభిమానుల స్పందన ఎలా ఉందనే విషయాన్ని సూర్య తెలుసుకోవాలని అనుకుంటున్నదువల్లే ఈ విజిట్ అని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. కాగా చిత్రాన్ని ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ నెలలో బైరవా చిత్రం తరువాత విడుదలవుతున్న మరో భారీ చిత్రం ఇదే అవుతుందన్నది గమనార్హం. -
కబాలి తరువాత ఎస్3నే..!
చాలా రోజులుగా తన రేంజ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సూర్య, 24 సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు. తన మార్క్ ప్రయోగాత్మక చిత్రంతోనే కమర్షియల్ సక్సెస్ కూడా సాధించి సత్తా చాటాడు. ఇప్పుడు తనకు బాగా కలిసొచ్చిన సింగం సీరీస్‌తో మరోసారి తన కలెక్షన్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు సూర్య. ఈ డిసెంబర్లో రిలీజ్ అవుతున్న ఎస్ 3 సినిమా ఇప్పటికే రికార్డ్ల వేట మొదలు పెట్టింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి తరువాత అంత వేగంగా మూడు మిలియన్ల వ్యూస్ సాధించిన చిత్రంగా నిలిచింది ఎస్3. ఇప్పటికే 4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఎస్ 3 మరిన్ని రికార్డ్ ల దిశగా దూసుకుపోతోంది. సూర్య సరసన అనుష్క, శృతిహాసన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీత దర్శకుడు. -
సూర్యతో ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు
నటుడు సూర్య ఈ మధ్య ఎక్కువగా ఇద్దరు లేక ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేసేస్తున్నారు. సింగం, సింగం-2, సింగం-3గా ప్రస్తుతం తెరకెక్కుతున్న ఎస్-3, ఇటీవల విడుదలైన 24 చిత్రాల్లో ఇద్దరు భామలతో రొమాన్స్ చేయడం చూస్తున్నాం. తాజాగా మరోసారి ఇద్దరు హీరోయిన్లతో డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారు. ఎస్-3 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న సూర్య తదుపరి ముత్తయ్య దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా ఆయన మరోసారి గ్రామీణ యువకుడిగా మారుతున్నారు. ఇంతకు ముందు ముత్తయ్య దర్శకత్వం వహించిన కుట్టిపులి, కొంబన్, మరుదు చిత్రాలు గ్రామీణ నేపథ్యంలో తె రకెక్కిన చిత్రాలేనన్న విషయం తెలిసిందే. తన తాజా చిత్రానికి అదే నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఇందులో తన నవ్వులతోనే వశీకరణం చేసుకుంటున్న నటి కీర్తీ సురేశ్, తొలి చిత్రంతోనే కోలీవుడ్‌ను దృష్టిని తన వైపునకు తిప్పుకున్న ముంబయి బ్యూటీ రితికాసింగ్ నాయికలుగా నటించనున్నారన్నది తాజా సమాచారం. బిజీగా ఉన్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తాజాగా సూర్యతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారన్నమాట. ఈ చిత్రం ఈ నెల రెండో వారంలో ప్రారంభం కానుంది. దీన్ని సూర్య 2డీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ, స్టూడియోగ్రీన్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. నటుడు సూర్య ఈ మధ్య ఎక్కువగా ఇద్దరు లేక ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేసేస్తున్నారు. సింగం, సింగం-2, సింగం-3గా ప్రస్తుతం తెరకెక్కుతున్న ఎస్-3, ఇటీవల విడుదలైన 24 చిత్రాల్లో ఇద్దరు భామలతో రొమాన్స్ చేయడం చూస్తున్నాం. తాజాగా మరోసారి ఇద్దరు హీరోయిన్లతో డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారు. ఎస్-3 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న సూర్య తదుపరి ముత్తయ్య దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా ఆయన మరోసారి గ్రామీణ యువకుడిగా మారుతున్నారు. ఇంతకు ముందు ముత్తయ్య దర్శకత్వం వహించిన కుట్టిపులి, కొంబన్, మరుదు చిత్రాలు గ్రామీణ నేపథ్యంలో తె రకెక్కిన చిత్రాలేనన్న విషయం తెలిసిందే. తన తాజా చిత్రానికి అదే నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఇందులో తన నవ్వులతోనే వశీకరణం చేసుకుంటున్న నటి కీర్తీ సురేశ్, తొలి చిత్రంతోనే కోలీవుడ్‌ను దృష్టిని తన వైపునకు తిప్పుకున్న ముంబయి బ్యూటీ రితికాసింగ్ నాయికలుగా నటించనున్నారన్నది తాజా సమాచారం. బిజీగా ఉన్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తాజాగా సూర్యతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారన్నమాట. ఈ చిత్రం ఈ నెల రెండో వారంలో ప్రారంభం కానుంది. దీన్ని సూర్య 2డీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ, స్టూడియోగ్రీన్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. -
షూటింగ్లో ఉండగానే సూర్య సినిమా రికార్డు
చెన్నై: తమిళ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ’ఎస్-3’. ’సింగ్’ సిరీస్‌లో వస్తున్న మూడో సీక్వెల్ ఇది. ’సింగమ్-3’ నే సంక్షిప్తంగా ’ఎస్-3’ అంటున్నారు. ఇప్పటికే ’సింగం’, ’సింగం2’ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న మూడో స్వీకెల్పైనా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా తమిళనాడు థియేటర్ ప్రదర్శన హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. ‘ఎస్-3’ థియేట్రికల్ హక్కులు రూ. 41 కోట్లకు అమ్ముడుపోయాయని, ‘సింగం-2’ భారీ విజయం నేపథ్యంలో రికార్డు ధరకు సినిమా హక్కులు హాట్ కేక్‌లా అమ్ముడుపోయాయని చిత్రవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హరి దర్శకత్వంలో విశాఖపట్నంలో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన శృతి హాసన్, అనుష్క షెట్టి నటించనున్నారు. -
ఇక్కడ దేవసేన... అక్కడ కావ్యా మహాలింగం
సమ్మర్ ధమాకా ఆమె కవ్వించగలరు... అవసరమైతే కత్తి పట్టగలరు... రాజుల కథలు, చారిత్రక కథలకు ప్రాణం పోయగలరు. అవును... ఇవాళ గ్లామర్కైనా, చరిత్ర చెక్కిన శిల్పానికైనా కేరాఫ్ అడ్రస్... హీరోయిన్ అనుష్క. వృత్తి మీద బోలెడంత కమిట్మెంట్ చూపుతూ, పాత్రను మెప్పించడం కోసం ఏ కష్టానికైనా వెనుకాడదు కాబట్టే, ఇప్పుడు ఈ స్వీటీ తెలుగు, తమిళ సినీ దర్శక, నిర్మాతలకు అక్షరాలా స్వీటీ! వేర్ ఆర్ యూ.. యూ.. యూ... మొదటి సినిమా ‘సూపర్’ని ఏ ముహూర్తాన అంగీకరించారో కానీ, నిజంగానే అనుష్క కెరీర్ పదకొండేళ్లుగా సూపర్‌గా సాగుతోంది. ఒకవేళ ‘అరుంధతి’ చేయకపోయి ఉంటే.. ఆమె ఇప్పటికీ హీరోల సరసన డ్యుయెట్లు పాడుకునే పాత్రలకే పరిమితమయ్యేవారేమో! ఆ చిత్రంతో కథను తన భుజాల మీద నడిపించగలననీ, శక్తిమంతమైన పాత్రలను అద్భుతంగా చేయగలననీ నిరూపించుకున్నారామె. ఆటోవాలల నుంచి ఆడ ఫ్యాన్స్ వరకూ అందరూ ‘భేష్ జేజెమ్మా’ అన్నారు. ఫలితంగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ అంటే అనుష్క అన్నట్లుగా అయిపోయింది. అలాగే, రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకూ అవకాశాలు దక్కుతున్నాయి. మొత్తానికి ఈ బెంగళూరు బ్యూటీ కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలు. ప్రస్తుతం చేతిలో రెండు చిత్రాలో బిజీగా ఉన్నారామె. ఒకటి ‘బాహుబలి -2’, మరొకటి తమిళంలో ‘సింగమ్ 3’. ఈ రెండూ కాక మరో లేడీ ఓరియంటెడ్ చిత్రానికి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది. ప్రస్తుతం ‘బాహుబలి’ రెండో భాగం, ‘సింగమ్’ మూడో భాగం అయిన ‘ఎస్ 3’ చిత్రాలకు డేట్స్ కేటాయించి బిజీ బిజీగా షూటింగ్ చేసేస్తున్నారు అనుష్క. ‘బాహుబలి’ తొలి భాగంలో డీ-గ్లామరైజ్డ్ దేవసేనగా కనిపించిన ఆమె, మలి భాగంలో యువరాణి దేవసేనగా అలరించనున్నారు. ప్రస్తుతం ఈ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఆర్ఎఫ్సీలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈ నెల 23 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుందని భోగట్టా. ఒకవైపు యువరాణి దేవసేనగా భారీ పాత్రను పోషిస్తున్న అనుష్క ‘ఎస్ 3’లో కావ్యా మహాలింగంగా రెగ్యులర్ గర్ల్‌గా గ్లామర్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఈ పాత్ర ఓ రిలీఫ్ అనాలి. ఎందుకంటే, ఈ మధ్య దేవసేనగా, ‘రుద్రమదేవి’గా, ‘సైజ్ జీరో’లో బొద్దు పాపగా కనిపించిన అనుష్కను రెగ్యులర్ గ్లామరస్ రోల్లో చూడాలని ఆమె అభిమానులకు ఉంటుంది. ఆ మాటకొస్తే.. కత్తి తిప్పడాలు, గుర్రపు స్వారీ చేయడాలు.. వంటివన్నీ బాగానే ఉన్నా ఎలాంటి ఒత్తిడీ లేకుండా హాయిగా పాటలు పాడే క్యారెక్టర్ చేయాలని ఉందని ఆ మధ్య అనుష్క అన్నారు. శరీరానికి శ్రమ లేని ఈ పాత్రను ఆమె ఎంజాయ్ చేస్తున్నారనే అనాలి. ‘బాహుబలి 2’ వచ్చే ఏడాది వస్తుంది. ఈలోపే ‘ఎస్ 3’ విడుదలవుతుంది కాబట్టి కావ్యగా అభిమానులను మురిపిస్తారు అనుష్క. వచ్చే ఏడాది యువరాణి దేవసేనగా మెరుస్తారు. ఆ మెరుపు సంగతలా ఉంచితే.. యువరాణిగా అంటే మాటలు కాదు. వేసుకునే బట్టలు, పెట్టుకునే నగలు అన్నీ భారీగానే ఉంటాయ్. కేశాలంకరణ అయితే మెడ మోయలేనంత ఉంటుంది. మేకప్ కూడా భారీయే. మాంచి ఎండల్లో ఇలా తయారవ్వడం అంటే చిన్న విషయం కాదు. అందుకే బాస్.. అనుష్కను అభినందించాల్సిందే!