సూర్యతో ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు | Suriya to romance Ritika Singh and Keerthy Suresh in next | Sakshi
Sakshi News home page

సూర్యతో ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు

Published Thu, Sep 1 2016 1:47 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

సూర్యతో ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు

సూర్యతో ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు

నటుడు సూర్య ఈ మధ్య ఎక్కువగా ఇద్దరు లేక ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేసేస్తున్నారు. సింగం, సింగం-2, సింగం-3గా ప్రస్తుతం తెరకెక్కుతున్న ఎస్-3, ఇటీవల విడుదలైన 24 చిత్రాల్లో ఇద్దరు భామలతో రొమాన్స్ చేయడం చూస్తున్నాం. తాజాగా మరోసారి ఇద్దరు హీరోయిన్లతో డ్యూయెట్లు పాడడానికి సిద్ధం అవుతున్నారు.
 
 ఎస్-3 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న సూర్య తదుపరి ముత్తయ్య దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా ఆయన మరోసారి గ్రామీణ యువకుడిగా మారుతున్నారు. ఇంతకు ముందు ముత్తయ్య దర్శకత్వం వహించిన కుట్టిపులి, కొంబన్, మరుదు చిత్రాలు గ్రామీణ నేపథ్యంలో తె రకెక్కిన చిత్రాలేనన్న విషయం తెలిసిందే.
 
 తన తాజా చిత్రానికి అదే నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ఇందులో తన నవ్వులతోనే వశీకరణం చేసుకుంటున్న నటి కీర్తీ సురేశ్, తొలి చిత్రంతోనే కోలీవుడ్‌ను దృష్టిని తన వైపునకు తిప్పుకున్న ముంబయి బ్యూటీ రితికాసింగ్ నాయికలుగా నటించనున్నారన్నది తాజా సమాచారం. బిజీగా ఉన్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తాజాగా సూర్యతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారన్నమాట. ఈ చిత్రం ఈ నెల రెండో వారంలో ప్రారంభం కానుంది. దీన్ని సూర్య 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థ, స్టూడియోగ్రీన్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement