బిజీ బిజీగా శైలజ
సౌత్ సినీ రంగంలో మల్లూవుడ్ బ్యూటిల హవా కొనసాగుతోంది. ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నటీమణుల్లో ఎక్కువ మంది మలయాళీ భామలే ఉండగా, తాజాగా మరో అందాల భామ కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇటీవల తెలుగులో నేను శైలజ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కీర్తీ సురేష్, తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ దూసుకుపోతోంది.
కీర్తి, ధనుష్ సరసన హీరోయిన్గా నటించిన రైల్ సినిమా గత వారం రిలీజ్కాగా మరో మూడు తమిళ సినిమాలు ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి. ఈ మూడు సినిమాలు టాప్ స్టార్స్తోనే కావటం విశేషం. విజయ్, సూర్యల తదుపరి చిత్రాలతో పాటు సామి సినిమాకు సీక్వల్గా విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సామి 2లో కూడా కీర్తి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు తెలుగులో నాని హీరోగా తెరకెక్కుతున్న నేను లోకల్ సినిమాలో కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తోంది.