షూటింగ్‌లో ఉండగానే సూర్య సినిమా రికార్డు | Suriya S3 Tamil Nadu theatricals bagged for Rs 41 crore | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో ఉండగానే సూర్య సినిమా రికార్డు

Published Sat, Jul 16 2016 2:33 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

షూటింగ్‌లో ఉండగానే సూర్య సినిమా రికార్డు

షూటింగ్‌లో ఉండగానే సూర్య సినిమా రికార్డు

చెన్నై: తమిళ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ’ఎస్‌-3’. ’సింగ్‌’ సిరీస్‌లో వస్తున్న మూడో సీక్వెల్‌ ఇది. ’సింగమ్‌-3’ నే సంక్షిప్తంగా ’ఎస్‌-3’ అంటున్నారు. ఇప్పటికే ’సింగం’, ’సింగం2’ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న మూడో స్వీకెల్‌పైనా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా తమిళనాడు థియేటర్ ప్రదర్శన హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. ‘ఎస్-3’ థియేట్రికల్ హక్కులు రూ. 41 కోట్లకు అమ్ముడుపోయాయని, ‘సింగం-2’ భారీ విజయం నేపథ్యంలో రికార్డు ధరకు సినిమా హక్కులు హాట్ కేక్‌లా అమ్ముడుపోయాయని చిత్రవర్గాలు తెలిపాయి.  

ప్రస్తుతం హరి దర్శకత్వంలో విశాఖపట్నంలో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన శృతి హాసన్, అనుష్క షెట్టి నటించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement