Singam 2
-
షూటింగ్లో ఉండగానే సూర్య సినిమా రికార్డు
చెన్నై: తమిళ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ’ఎస్-3’. ’సింగ్’ సిరీస్‌లో వస్తున్న మూడో సీక్వెల్ ఇది. ’సింగమ్-3’ నే సంక్షిప్తంగా ’ఎస్-3’ అంటున్నారు. ఇప్పటికే ’సింగం’, ’సింగం2’ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వస్తున్న మూడో స్వీకెల్పైనా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా తమిళనాడు థియేటర్ ప్రదర్శన హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. ‘ఎస్-3’ థియేట్రికల్ హక్కులు రూ. 41 కోట్లకు అమ్ముడుపోయాయని, ‘సింగం-2’ భారీ విజయం నేపథ్యంలో రికార్డు ధరకు సినిమా హక్కులు హాట్ కేక్‌లా అమ్ముడుపోయాయని చిత్రవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం హరి దర్శకత్వంలో విశాఖపట్నంలో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన శృతి హాసన్, అనుష్క షెట్టి నటించనున్నారు. -
ముచ్చటగా మూడోసారి!
పదహారణాల తెలుగమ్మాయి అంజలి చేతిలో ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిపి అరడజను సినిమాల వరకూ ఉన్నాయి. సో.. కథానాయికగా ఫుల్ బిజీ. అయినప్పటికీ ‘తరమణి’ అనే చిత్రంలో అతిథి పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ పాత్ర తెరపై కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకుల మన్ననలు పొందే విధంగా ఉంటుందట. అందుకే, అంజలి ఈ పాత్ర అంగీకరించారట. కాగా, తమిళంలో కో, సింగమ్ 2 చిత్రాల్లో అతిథి పాత్రలు చేశారు అంజలి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి చేయనున్నారు. -
సింగం - 2 యూనిట్ స్పందన.
-
సింగం - 2 యూనిట్ స్పందన