రామ్‌చరణ్ కోసమే ఈ అడ్జస్ట్‌మెంట్! - హీరో సూర్య | Suriya's Singam 3 postponed again | Sakshi
Sakshi News home page

రామ్‌చరణ్ కోసమే ఈ అడ్జస్ట్‌మెంట్! - హీరో సూర్య

Dec 5 2016 12:02 AM | Updated on Sep 4 2017 9:54 PM

రామ్‌చరణ్ కోసమే ఈ అడ్జస్ట్‌మెంట్! - హీరో సూర్య

రామ్‌చరణ్ కోసమే ఈ అడ్జస్ట్‌మెంట్! - హీరో సూర్య

‘‘హీరోగా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు నా కోసం కథలు రాస్తారనీ, ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు.

‘‘హీరోగా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు నా కోసం కథలు రాస్తారనీ, ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు. ఐదేళ్ల తర్వాత ‘సింగం-3’ చేయాలనేది మా ప్లాన్. కుటుంబ సభ్యులు, అభిమానుల కోరిక మేరకు ఇప్పుడే చేశా. నా కోసమే 8 నెలలు కష్టపడి హరి ఈ కథ రాశారు’’ అన్నారు సూర్య. హరి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సింగం-3’. ‘సింగం’ సిరీస్‌లో వస్తోన్న ఈ మూడో చిత్రంలో అనుష్క, శ్రుతీహాసన్ హీరోయిన్లు. హ్యారీస్ జైరాజ్ స్వరకర్త. తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 11న తెలుగు పాటల్ని, 23న తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

విడుదల తేదీని ఈ నెల 16 నుంచి 23కు మార్చడంపై సూర్య స్పందిస్తూ.. ‘‘రామ్‌చరణ్ ‘ధృవ’ మా ఫ్యామిలీ సినిమా వంటిదే. దాంతో చిన్న అడ్జస్ట్‌మెంట్ చేశాం’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ - ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్, తమిళనాడులో ఎమ్జీఆర్ సీఎంలుగా ఉన్నప్పడు జరిగిన ఘటనల స్ఫూర్తితో చిత్రం తెరకెక్కింది. ‘సింగం’ అనేది సినిమా మాత్రమే కాదు, ఓ మతం’’ అన్నారు.

 ‘‘సూర్య అంటే అభిమానం. అందుకే ‘సింగం-3’ హక్కులు తీసుకున్నా’’ అన్నారు మల్కాపురం శివకుమార్. ‘‘టీజర్, ట్రైలర్‌లు థౌజెండ్‌వాలా అయితే.. సినిమా టెన్ థౌజెండ్ వాలా తరహాలో ఉంటుంది’’ అన్నారు మాటల రచయిత శశాంక్ వెన్నెలకంటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement