పైలెట్‌తో స్వాతి పెళ్లి | Colours Swathi get married with Vikas | Sakshi
Sakshi News home page

పెళ్లి కలర్‌ వచ్చేసిందే బాలా

Published Tue, Aug 14 2018 12:13 AM | Last Updated on Tue, Aug 14 2018 8:06 AM

Colours Swathi get married with Vikas - Sakshi

కలర్స్‌ స్వాతి, వికాస్, స్వాతి అంటూ వైరల్‌గా మారిన ఫొటో

‘అష్టా చమ్మా’ సినిమాలో ‘మహేశ్‌ మహేశ్‌...’ అంటూ కలవరించే మహేశ్‌ అభిమానిగా కనిపిస్తారు ‘కలర్స్‌’ స్వాతి. కానీ ప్రస్తుతం ఆమె కలవరిస్తున్న పేరు వికాస్‌ అట. కొంటె చూపుతో ఓ కొంటె చూపుతో అంటూ వికాస్‌ అనే పైలెట్‌ స్వాతి మనసుని దోచేశారట. ఇక్కడున్న ఫొటోని చూసి పెళ్లి ఆల్రెడీ అయిపోయింది అనుకుంటే పొరబడ్డట్టే. ఇది సినిమాలోని పెళ్లి ఫొటోనే. నిజమైన పెళ్లి మరో 15రోజుల్లో జరగనుంది. ‘అష్టా చమ్మా, సుబ్రమణ్యపురం, కార్తికేయ వంటి సినిమాలతో తెలుగులో హీరోయిన్‌గా పాపులారిటీ సంపాదించక ముందు చిన్ని తెరపై ‘కలర్స్‌’ స్వాతిగా బోలెడంత పాపులార్టీ సంపాదించుకున్నారామె. ఈ మధ్య సినిమాలకు చిన్న గ్యాప్‌ ఇచ్చారు. పర్సనల్‌ లైఫ్‌పై ఫోకస్‌ పెట్టారు. త్వరలోనే వధువు కానున్నారు.

కేరళకు చెందిన వికాస్‌ అనే పైలెట్‌తో ఈ నెలాఖరున మూడు ముళ్లు వేయించుకోనున్నారు. స్వాతి వివాహ విషయమై ఆమె  కుటుంబ సభ్యులను ‘సాక్షి’ సంప్రదించగా – ‘‘కేరళకు చెందిన వికాస్‌ అనే పైలెట్‌తో స్వాతి పెళ్లి కుదిరింది. పెళ్లి వేడుక ఈ నెల 30న కేవలం ఇరు కుటుంబ సభ్యులు, దగ్గర చుట్టాలు, క్లోజ్‌ ఫ్రెండ్స్‌ మధ్య హైదరాబాద్‌లో జరగనుంది’’ అన్నారు. మలేషియన్‌ ఎయిర్‌ లైన్స్‌లో పని చేసే వికాస్, స్వాతిది లవ్, అరేంజ్డ్‌ మ్యారెజ్‌ అట. పెళ్లి జరిగిన రెండు రోజులకే కేరళలోని కొచ్చిలో వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఎందుకంటే వికాస్‌ మలయాళీ. ఇదిలా ఉంటే.. స్వాతి అధికారికంగా కాబోయే భర్త ఫొటోను బయటపెట్టలేదు కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో సోమవారం నెట్‌లో హల్‌చల్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement