malaysian airlines
-
దీపక్ చాహర్‌కు చేదు అనుభవం.. కనీసం ఫుడ్ కూడా లేదంటూ మండిపాటు
వన్డే సిరీస్‌లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా పేసర్ దీపక్ చాహర్‌కు చేదు అనుభవం ఎదురైంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఉన్న దీపక్ చాహర్, శిఖర్ ధావన్, వాషింగ్టన్ సుందర్, శ్రేయస్ అయ్యర్ నేరుగా వెల్లింగ్టన్ నుంచి మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఢాకాకు చేరుకున్నారు. కానీ మలేషియా ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా దీపక్ చాహర్ లగేజ్ మాత్రం ఢాకాకు రాలేదు. ఈ క్రమంలో అసహనానికి గురైన చాహర్ మలేషియా ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. నేను ఇప్పటి వరకు ఇంత చెత్త సర్వీస్‌ను చూడలేదంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. కనీసం ఫుడ్ కూడా లేదు "మలేషియా ఎయిర్‌లైన్స్‌లో దారుణమైన అనుభవం ఎదురైంది. తొలుత మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మా ఫ్లైట్ మార్చారు. మేము బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించినప్పటికీ.. ఎటువంటి ఆహారం కూడా అందజేయలేదు. మాతో పాటు లగేజ్ కూడా రాలేదు. గత 24 గంటల నుంచి లగేజ్ కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఇప్పటి వరకు నా లగేజ్ రాకపోతే.. రేపు మ్యాచ్‌కు ఏ విధంగా సన్నద్దం అవుతాను" అని చాహర్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా చాహర్‌తో పాటు మరి కొంత మంది ప్రయాణికుల లగేజ్ కూడా రాలేదు. ఇక దీపక్ చాహర్ ట్వీట్‌పై మలేషియా ఎయిర్‌లైన్స్ నిమిషాల వ్యవధిలోనే స్పందించింది. చాహర్‌కు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. ఇక భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి వన్డే ఆదివారం(డిసెంబర్ 4)న ఢాకా వేదికగా జరగనుంది. Had a worse experience traveling with Malaysia airlines @MAS .first they changed our flight without telling us and no food in Business class now we have been waiting for our luggage from last 24hours .imagine we have a game to play tomorrow 😃 #worse #experience #flyingcar — Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) December 3, 2022 చదవండి: Ricky Ponting: చాలా మందిని భయపెట్టా.. నాకు కూడా భయమేసింది.. ఇప్పుడిలా! -
పైలెట్‌తో స్వాతి పెళ్లి
‘అష్టా చమ్మా’ సినిమాలో ‘మహేశ్ మహేశ్...’ అంటూ కలవరించే మహేశ్ అభిమానిగా కనిపిస్తారు ‘కలర్స్’ స్వాతి. కానీ ప్రస్తుతం ఆమె కలవరిస్తున్న పేరు వికాస్ అట. కొంటె చూపుతో ఓ కొంటె చూపుతో అంటూ వికాస్ అనే పైలెట్ స్వాతి మనసుని దోచేశారట. ఇక్కడున్న ఫొటోని చూసి పెళ్లి ఆల్రెడీ అయిపోయింది అనుకుంటే పొరబడ్డట్టే. ఇది సినిమాలోని పెళ్లి ఫొటోనే. నిజమైన పెళ్లి మరో 15రోజుల్లో జరగనుంది. ‘అష్టా చమ్మా, సుబ్రమణ్యపురం, కార్తికేయ వంటి సినిమాలతో తెలుగులో హీరోయిన్గా పాపులారిటీ సంపాదించక ముందు చిన్ని తెరపై ‘కలర్స్’ స్వాతిగా బోలెడంత పాపులార్టీ సంపాదించుకున్నారామె. ఈ మధ్య సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టారు. త్వరలోనే వధువు కానున్నారు. కేరళకు చెందిన వికాస్ అనే పైలెట్‌తో ఈ నెలాఖరున మూడు ముళ్లు వేయించుకోనున్నారు. స్వాతి వివాహ విషయమై ఆమె కుటుంబ సభ్యులను ‘సాక్షి’ సంప్రదించగా – ‘‘కేరళకు చెందిన వికాస్ అనే పైలెట్‌తో స్వాతి పెళ్లి కుదిరింది. పెళ్లి వేడుక ఈ నెల 30న కేవలం ఇరు కుటుంబ సభ్యులు, దగ్గర చుట్టాలు, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య హైదరాబాద్‌లో జరగనుంది’’ అన్నారు. మలేషియన్ ఎయిర్ లైన్స్‌లో పని చేసే వికాస్, స్వాతిది లవ్, అరేంజ్డ్ మ్యారెజ్ అట. పెళ్లి జరిగిన రెండు రోజులకే కేరళలోని కొచ్చిలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఎందుకంటే వికాస్ మలయాళీ. ఇదిలా ఉంటే.. స్వాతి అధికారికంగా కాబోయే భర్త ఫొటోను బయటపెట్టలేదు కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో సోమవారం నెట్లో హల్చల్ చేసింది. -
మలేసియా విమానాన్ని హైజాక్ చేశారా?
సిడ్నీ: రెండేళ్ల క్రితం మలేసియా ఎయిర్ లైన్స్ ఎంహెచ్ 370 విమానం అదృశ్యమైన ఘటన మిస్టరీగానే మిగిలిపోయింది. విమాన ప్రమాదానికి గల కారణాలేంటి? ఎక్కడ కూలిపోయింది? వంటి విషయాలు ఇప్పటికీ తేలలేదు. విమానంలోని ప్రయాణికులు హైజాక్ చేశారన్న వాదన కొత్తగా వినిపిస్తోంది. కొందరు విదేశీయులు విమానాన్ని దారి మళ్లించారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా ఈ విమానం హిందూ మహాసముద్రంలో కూలిపోయినట్టు మలేసియా అధికారులు భావిస్తున్నా.. ప్రమాదానికి కచ్చితమైన కారణమేంటన్నది ఇంకా నిర్ధారించలేదు. విమానంలోని ప్రయాణికులు ఒకరు లేదా ఎక్కువ మంది హైజాక్ చేసిఉంటారన్న వార్తలు ఇటీవల వచ్చాయి. తప్పుడు పాస్ట్ పోర్టులతో ఇద్దరు ఇరాన్ దేశస్తులు ప్రయాణించడం అనుమానాలకు తావిస్తోంది. అయితే వీరిద్దరికీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు లేవని విచారణాధికారులు స్పష్టం చేశారు. బీజింగ్‌కు వెళ్లాల్సిన విమానాన్ని విదేశీయులు దారి మళ్లించారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. విమానం ఆచూకీ కనుగొనేందుకు నియమించిన దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో చీఫ్ కమిషనర్ మార్టిన్ డొలాన్ ఈ ఆరోపణలను ఖండించారు. కొందరు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, అయితే అంతుచిక్కని మిస్టరీగా మారిన విమాన అదృశ్యానికి గల కారణాలు కచ్చితంగా తెలియరాలేదని వెల్లడించారు. ఇదిలావుండగా, హిందూ మహాసముద్రంలో డీగో గార్కియాలోని అమెరికా సైనిక స్థావరం వైపు వెళ్తున్న ఈ విమానాన్ని.. దాడి చేసేందుకు వస్తోందని భావించి అమెరికా దళాలు కూల్చివేశాయని గతంలో ఓ కథనం వెలువడింది. అయితే దీన్ని అమెరికా తోసిపుచ్చింది. 2014 మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు 239 మందితో వెళ్తున్న బోయింగ్ 777 అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ విమానానికి చెందినవిగా భావిస్తున్న శకలాలను గుర్తించారు. గతేడాది హిందూ మహాసముద్రంలోని రీయూనియన్ దీవిలో, ఇటీవల మొజాంబిక్ సముద్రతీరంలో మరో శకలాన్ని గుర్తించారు. కాగా మలేసియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ సిబ్బందిని రంగంలోకి దింపి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా విమానం కూలిన ప్రాంతాన్ని గుర్తించలేకపోయాయి. -
పైలట్.. దారి మర్చిపోయాడు!
రోడ్డుమీద కారులో వెళ్తుంటే ఒకోసారి మనం సరిగా దారి తెలియక తప్పిపోతాం. అదే విమానాలైతే.. వాటికి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా కచ్చితంగా వెళ్తాయి. కానీ, మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం న్యూజిలాండ్ నుంచి బయల్దేరి, దాదాపు గంట పాటు తప్పుడు దిశలో వెళ్లిపోయింది! ఎంహెచ్132 అనే ఈ విమానం ఆక్లండ్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాలి. అందుకు ఆస్ట్రేలియా మీదుగా వాయవ్య దిశలో నేరుగా వెళ్లాలి. కానీ, రాడార్ డేటాను బట్టి చూస్తే.. అది దక్షిణ దిశగా దాదాపు గంటపాటు ప్రయాణించినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పైలట్లు.. ఆక్లండ్ ఓషియానిక్ కంట్రోల్ సెంటర్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్లతో చర్చిస్తున్నా, ప్రయాణికులకు మాత్రం చెప్పలేదు. విమానం ఇలా వెళ్లడం వల్ల దానికి ప్రమాదం ఏమీ రాలేదుగానీ, అసలు సాధారణంగా వెళ్లాల్సిన మార్గాన్ని ఎందుకు మార్చారనే దానిపై విచారణ జరుపుతామని అధికారులు చెబుతున్నారు. -
'ఎమ్హెచ్ 17 మృతులందరిని గుర్తించాం'
ఎమ్హెచ్ 17 విమాన ప్రమాద దుర్ఘటనలో మృతి చెందిన 298 మందిని గుర్తించినట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. మృతుల వివరాలను శనివారం కౌలాలంపూర్‌లో మలేషియా ఎయిర్‌లైన్స్ విడుదల చేసింది. మృతుల్లో 192 మంది డచ్ దేశస్తులని... వారిలో ఒకరు నెదర్లాండ్స్ / యూఎస్ పౌరసత్వం కలిగి ఉన్నారని పేర్కొంది. 15 మంది విమాన సిబ్బంది, ఇద్దరు చిన్నారులతో మొత్తం 44 మంది మలేషియన్లు ఉన్నారని చెప్పింది. 27 మంది ఆస్ట్రేలియన్లు, ఓ శిశువుతో సహా12 మంది ఇండోనేషియన్లు ఉన్నారని వివరించింది. దక్షిణ ఆఫ్రికా పౌరసత్వం కలిగిన ఓ ప్రయాణికుడితోపాటు 9 మంది బ్రిటన్ దేశస్తులు ఉన్నారని తెలిపింది. నలుగరు జర్మన్, నలుగురు బెల్జియం, ముగ్గురు పిలిప్పీన్స్, ఒకరు కెనడా, మరోకరు న్యూజిలాండ్ దేశస్తుడని మలేషయా ఎయిర్‌లైన్స్ విశదీకరించింది. -
అతనికి విమానం కూలుతుందని ముందే తెలుసా?
విమానం ఎక్కే ముందు ఆ ప్రయాణికుడు ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు. "విమానానికి ఏదైనా అయితే ఇదిగో నేనెక్కిన విమానం ఇలా ఉంటుంది" అంటూ పోస్టు చేశాడు అతను. కొద్ది గంటల తరువాతే అతను ప్రయాణిస్తున్న విమానం ఉక్రేన్ గగనతలం నుంచి భూతలానికి నిప్పురవ్వలా రాలిపోయింది. దాంతో అతని ప్రాణాలు కూడా అనంతవాయువుల్లో కలిసిపోయాయి. కోర్ పాన్ అనే డచ్ ప్రయాణికుడు ఉక్రేన్ లో కుప్పకూలిన విమానంలో ప్రయాణించి, కౌలాలంపూర్ కి బయలుదేరాడు. విమానం ఎక్కడానికి క్షణాల ముందు విమానం ఫోటో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. హిందూ మహాసముద్రంలో కుప్పకూలిన ఎం హెచ్ 370 గుర్తుకొచ్చిందేమో, కాస్త సరదాగా ఓ కామెంట్ కూడా పెట్టాడు. దానికి మిత్రుల నుంచి కామెంట్లు కూడా వచ్చాయి. ఆ తరువాత కాస్సేపటికే ప్రమాదం జరగడంతో మిత్రుల కామెంట్లు వేళాకోళం నుంచి విషాదానికి మారాయి. కోర్ పాన్ తో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ నీల్ ట్యే తోలా కూడా అదే విమానంలో ఉంది. కలసి చేసిన ప్రయాణమే వారి ఆఖరి ప్రయాణంగా మారింది. -
ఎంహెచ్-17:ఆధిపత్య పోరుతో అమాయకుల ప్రాణాలు గాల్లోకి
రెండు దేశాల ఆధిపత్య పోరులో 295 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 295 మందితో అమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన మలేసియా విమానాన్ని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై కూల్చివేసిన విషయం తెలిసిందే. రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్ ప్రభుత్వ దళాలు, రష్యా అనుకూల తిరుగుబాటుదారుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతంలో.. ఆ విమానం కూలిపోయింది. ఘటనలో విమానంలో ఉన్న 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది.. మొత్తం 295 మంది మరణించారు. పేల్చివేతపై ఇప్పటివరకూ ఎవరూ బాధ్యత తీసుకోలేదు. కానీ ఉక్రెయిన్ దళాలే పేల్చేశాయని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు పేర్కొంటుండగా.. అది తిరుగుబాటుదారుల పనేనంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. అయితే ప్రయాణీకుల విమానాన్ని కూల్చివేయడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నాలుగు నెలల కిందట హిందూ మహా సముద్రంలో అంతు చిక్కని రీతిలో అదృశ్యమైన ఎంహెచ్ 370 విమాన ఘటనను మరచిపోకముందే ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన ఈ రెండు విమానాలు మలేసియన్ ఏర్‌లైన్స్‌కు చెందినవే కావడం గమనార్హం. గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌కు చెందిన పలు మిలటరీ విమానాలను రష్యా అనుకూల తిరుగుబాటు దారులు పేల్చేస్తున్నారు. బుధవారం కూడా తమ యుద్ధవిమానాన్ని పేల్చేశారని ఉక్రెయిన్ ప్రకటించింది. తిరుగుబాటుదారులకు రష్యా అన్నిరకాలుగా సహకరిస్తోందని, అత్యాధునిక క్షిపణులను వారికి అందిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ సాయుధ దళాలు గగన లక్ష్యాలపై ఎలాంటి దాడులు చేయలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకొ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించారు. ఉక్రెయిన్ వైమానిక దళమే మలేసియా ప్యాసెంజర్ విమానాన్ని పేల్చేసిందని తిరుగుబాటుదారుల నేత అలెక్జాండర్ బొరొదాయి ఆరోపించారు. -
మలేషియాకి మళ్లీ విషాదం....
-
క్షిపణితో మలేసియా విమానం కూల్చివేత
-
ఉక్రెయిన్ గగనతలంపై భద్రత లేదా ?
-
విమాన మృతుల్లో ప్రముఖ ఎయిడ్స్ పరిశోధకులు
మలేషియా విమాన ప్రమాదంలో ఎయిడ్స్ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న పలువురు ప్రముఖులు మరణించారని అంతర్జాతీయ ఎయిడ్స్ సోసైటి (ఐఏఎస్) శుక్రవారం తన అధికారి వెబ్సైట్లో పేర్కొంది. ఐఏఎస్ మాజీ అధ్యక్షుడు, ఎయిడ్స్ వ్యాధిపై సుదీర్ఘ కాలంగా పరిశోధనలు చేస్తున్న ప్రముఖ పరిశోధకుడు జోపి లాంజ్ కూడా మృతుల్లో ఉన్నారని వెల్లడించింది. 20వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సు ఆదివారం ఆస్ట్రేలియా రాజధాని మెల్బోర్న్లో ప్రారంభం కానుంది. ఆ సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్న పలువురు మలేషియా విమానంలో ఆస్ట్రేలియా బయలుదేరారు. రష్యా సరిహద్దుల్లోని చేరుకున్న ఆ విమానాన్ని ఉక్రెయిన్‌లో తిరుగుబాటు దారులు క్షిపణులతో దాడి చేయడంతో కూలిపోయింది. ఆ ప్రమాదంలో విమానంలోని 295 మంది మరణించారు. మృతుల్లో ఎయిడ్స్ పరిశోధకులు ఉన్నారు. మలేషియా విమానం మృతువు రూపంలో తమ సహచరులు, సన్నిహితులను కబళించివేసిందని ఐఏఎస్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. -
'మారణ హోమం సృష్టిస్తున్నారు'
రష్యన్ వేర్పాటు వాదులు ఉక్రెయిన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. తమ డిమాండ్లను సాధించుకునేందుకు హింసతో పాటు, నిత్య మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌కు చెందిన పలు మిలటరీ విమానాలను రష్యా అనుకూల తిరుగుబాటు దారులు పేల్చేస్తున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్‌ను ఆందోళనల ద్వారా గద్దె దించేసిన తర్వాత రెండు దేశాల మద్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్-రష్యా సరిహద్దులోని కొంత భూభాగాన్ని రష్యా ఇటీవల స్వాధీనం చేసుకుంది. ఆక్రమించుకున్న ప్రాంతం నుంచే పంజా విసురుతున్న వేర్పాటు వాదులు నెత్తుటి వ్యూహాలతో రక్త చరిత్రను లిఖిస్తున్నారు. ఎంహెచ్ 17 విమానం నేలకొరిగిన గ్రాబోవో కూడా రష్యన్ వేర్పాటు వాదుల ఆధీనంలో ఉంది. దీంతో గగనతలం నుంచి దాడులు చేస్తున్నారనే అనుమానంతో సాయుధ తిరుగుబాటు దళాలే విమానాన్ని పేల్చేసి ఉంటారని సర్వత్రా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ గగనతలం కూడా ప్రమాదకరంగా మారిపోయింది. కాగా ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి కౌలాలంపూర్ వెళుతున్న మలేసియా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777 విమానం గురువారం సాయంత్రం రష్యా సరిహద్దులో యుద్ధరంగంగా మారిన ఉక్రెయిన్ భూభాగంలో కూలిపోయింది. ఈ ఘటనలో 15 మంది సిబ్బందితోపాటు మొత్తం 295 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మలేసియాకే చెందిన ఎంహెచ్ 370 విమానం మార్చిలో హిందూ మహాసముద్ర ప్రాంతంలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. గత నాలుగు నెలల్లో ఇది రెండో విమాన ప్రమాదం. -
ఆ ప్రాంతమే ప్రమాదకరం!
రష్యా క్షిపణులతో ఉక్రెయిన్ గగనతలంలో కరువైన భద్రత పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చేసిన తిరుగుబాటుదారులు ఆధిపత్య పోరుతో విషమించిన పరిస్థితి రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా.. అదే రోజున మలేసియా విమాన దుర్ఘటన ఉక్రెయిన్‌లో తిరుగుబాటుదారులకు మద్దతుగా రష్యా అందజేస్తున్న క్షిపణులే ప్రమాదకరంగా మారాయా? వాటివల్లే ఉక్రెయిన్ గగనతలం ఏమాత్రం భద్రత లేనిదిగా తయారైందా? ఇలాంటి ప్రశ్నలు తలెత్తడానికి కారణం.. ఆ దేశంలో కొద్ది రోజులుగా చోటు చేసుకున్న ఘటనలే! ఉక్రెయిన్‌లో అంతర్యుద్ధం కారణంగా.. ప్రభుత్వ సైన్యానికి, రష్యా అనుకూల తిరుగుబాటుదారులకు మధ్య తీవ్ర పోరు జరుగుతోంది. ఈ క్రమంలో తిరుగుబాటుదారులు రష్యా విమాన విధ్వంసక క్షిపణులతో పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చివేశారు. గత నాలుగు రోజుల్లోనే ఐదు యుద్ధ విమానాలను కూల్చేశారు. సోమవారం తిరుగుబాటు దారులు ఉక్రెయిన్ యుద్ధ విమానాన్ని కూల్చివేయగా, బుధవారం తమ ఎస్‌యూ-25 విమానాన్ని రష్యా కూల్చివేసిందని ఉక్రెయిన్ పేర్కొంది. అంతేగాకుండా బుధవారం రెండు, మంగళవారం ఒక ఉక్రెయిన్ యుద్ధవిమానాలను తాము పేల్చివేసినట్లు తీవ్రవాదులు ప్రకటించారు కూడా. దీంతో యుద్ధ విమానాలకే కాదు, పౌర విమానాలకు కూడా ఆ దేశ గగనతలం ప్రమాదకరంగా మారింది. కాగా.. అంతర్యుద్ధంతో కుతకుతలాడుతున్న తూర్పు ఉక్రెయిన్ ప్రాంతం మీ దుగా విమానాల రాకపోకలను నిలిపివేయాలని భారత వైమానిక సంస్థలు నిర్ణయించి నట్లు సమాచారం. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థల సలహా ప్రకారం తాము నడుచుకోనున్నట్లు ఎయిరిండియా అధికారి తెలిపారు. పతనమైన అమెరికా మార్కెట్లు.. రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఆంక్షలు విధించిన రోజే మలేసియా విమానాన్ని ఉక్రెయిన్‌లో కూల్చివేశారనే వార్త లు రావడంతో.. అమెరికా స్టాక్‌మార్కెట్లలో దడ పుట్టించింది. డౌజోన్స్, నాస్డాక్, ఎస్ అండ్ పీ సూచీలన్నీ ప్రస్తుత సెషన్లో అతి తక్కువ స్థాయిని తాకాయి. ఈ సందర్భంగా న్యూయార్క్‌లోని మెరిడియన్ ఈక్విటీ ఎండీ జోసెఫ్ గ్రెసో మాట్లాడుతూ.. ‘మలేషియా విమానంఘటనపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ రోజే అమెరికా అధ్యక్షుడు ఒబామా రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించా రు. పలు హెచ్చరికలు కూడా చేశా రు. విమానం ఘటన నేపథ్యంలో ఇదో వివాదమయ్యే అవకాశముంది..’ అని వ్యాఖ్యానించారు. -
క్షిపణితో మలేసియా విమానం కూల్చివేత!
కీవ్/మాస్కో/వాషింగ్టన్/ కౌలాలంపూర్: రెండు దేశాల ఆధిపత్య పోరులో 295 మంది అమాయక ప్రయాణికులు బలయ్యారు. 295 మందితో అమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు బయల్దేరిన విమానాన్ని గురువారం సాయంత్రం ఉక్రెయిన్ గగనతలంపై పేల్చేశారు. రష్యా సరిహద్దుల్లో ఉక్రెయిన్ ప్రభుత్వ దళాలు, రష్యా అనుకూల తిరుగుబాటుదారుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రాంతంలో.. ఆ విమానం కూలిపోయింది. ఘటనలో విమానంలో ఉన్న 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది.. మొత్తం 295 మంది మరణించారు. పేల్చివేతపై ఇప్పటివరకూ ఎవరూ బాధ్యత తీసుకోలేదు. కానీ ఉక్రెయిన్ దళాలే పేల్చేశాయని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు పేర్కొంటుండగా.. అది తిరుగుబాటుదారుల పనేనంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ప్రయాణీకుల విమానాన్ని కూల్చివేయడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నాలుగు నెలల క్రితం హిందూ మహాసముద్రంలో అంతు చిక్కని రీతిలో అదృశ్యమైన ఎంహెచ్ 370 విమాన ఘటనను మరచిపోకముందే ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైన ఈ రెండు విమానాలు మలేసియన్ ఏర్‌లైన్స్‌కు చెందినవే కావడం గమనార్హం. సమాచారం అందగానే హుటాహుటిన అత్యవసర సహాయ దళాలు ఘటనాప్రాంతానికి బయల్దేరాయని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనను విమాన విపత్తుగా పేర్కొన్న ఉక్రెయిన్ ప్రధానమంత్రి వెంటనే విచారణకు ఆదేశించారని సమాచారం. విమానం కూలిపోయిన ప్రాంతంలో 22 మృతదేహాలను లెక్కించినట్లు ఘటనాస్థలానికి చేరిన జర్నలిస్ట్ ఒకరు తెలిపారు. 10 కిమీల ఎత్తున మలేసియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 ప్యాసెంజర్ విమానం గురువారం సాయంత్రం ఉక్రెయిన్‌లోని, సంక్షోభ ప్రాంతమైన దొనెస్క్లో ఉన్న షక్తర్క్ పట్టణ పరిసరాల్లోకి రాగానే రాడార్ సంకేతాలకు దూరమైంది. అది రష్యా అనుకూల తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతం. ఆ సమయంలో ఆ విమానం ఉక్రెయిన్ గగనతలంపై 30 వేల అడుగుల (దాదాపు 10 కిమీల) ఎత్తున ఉంది. దీన్ని భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణితో పేల్చేశారని భావిస్తున్నారు. కాలిపోతు న్న శకలాలు, మృతదేహాలు రష్యా సరిహద్దుకు 40 కిమీల దూరంలోని గ్రబావొ గ్రామ సమీపంలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మీరంటే మీరు.. గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌కు చెందిన పలు మిలటరీ విమానాలను రష్యా అనుకూల తిరుగుబాటు దారులు పేల్చేస్తున్నారు. బుధవారం కూడా తమ యుద్ధవిమానాన్ని పేల్చేశారని ఉక్రెయిన్ ప్రకటించింది. తిరుగుబాటుదారులకు రష్యా అన్నిరకాలుగా సహకరిస్తోందని, అత్యాధునిక క్షిపణులను వారికి అందిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఉక్రెయిన్ సాయుధ దళాలు గగన లక్ష్యాలపై ఎలాంటి దాడులు చేయలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పొరొషెంకొ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించారు. ఉక్రెయిన్ వైమానిక దళమే మలేసియా ప్యాసెంజర్ విమానాన్ని పేల్చేసిందని తిరుగుబాటుదారుల నేత అలెక్జాండర్ బొరొదాయి ఆరోపించారు. విమాన ప్రమాద వార్త వినగానే షాక్‌కు గురయ్యానని, దీనిపై తక్షణమే విచారణకు ఆదేశించానని మలేసియా ప్రధానమంత్రి నజిబ్ రజాక్ ప్రకటించారు. ఒబామా ఆరా విమాన ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఆరా తీశారు. రష్యాపై అమెరికా తాజాగావిధించిన ఆంక్షల విషయంపై ఫోన్లో మాట్లాడుతూ.. ప్రమాద విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాగా, ప్రమాద ఘటనపై జాతీయ భద్రత బృందం ఒబామాకు వివరాలందించింది. గురువారం సాయంత్రం ఎప్పుడేం జరిగింది.. 7:45: ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి కౌలాలంపూర్ వెళుతున్న మలేసియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్17(బోయింగ్ 777 రకం)తో రాడార్ సంబంధాలు తెగిపోయాయి. మొత్తం 295 మందీ చనిపోయి ఉంటారని రష్యన్ వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్ వెల్లడించింది. 7.45: ఉక్రెయిన్ గగనతలంలో తమ విమానంతో సంబంధాలు కోల్పోయినట్లు మలేసియా ఎయిర్‌లైన్స్ సంస్థ ట్విట్టర్లో ట్వీట్ చేసింది. 7.45: విమానం 33వేల అడుగుల ఎత్తులో వెళుతుండగా భూమిపై నుంచి మిసైల్‌తో కూల్చేశారని ఉక్రెయిన్ హోంమంత్రికి సలహాదారుడు ఆంటన్ గెరాషెంకో తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. 7.46: మీడియా కథనాలు తమ దృష్టికి వచ్చాయని, సమాచారం సేకరిస్తున్నామని బోయింగ్ కంపెనీ ప్రకటించింది. 7.49: మలేసియా విమాన ప్రమాదంపై వెంటనే దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రధాని ప్రకటించారు. 7.50: మలేసియా విమానం కూల్చివేతలో ఉక్రెయిన్ రక్షణ దళాల ప్రమేయం లేదని ఆ దేశాధ్యక్షుడిని ఉటంకిస్తూ ఇంటర్‌ఫ్యాక్స్ వార్తా సంస్థ కథనం. 7.50: దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలో విమాన శకలాలు పడ్డాయని, దాదాపు వంద వరకు చిధ్రమైన మృతదేహాలు కనిపిస్తున్నట్లు ఘటనా స్థలానికి వెళ్లిన ఎమర్జెన్సీ సహాయక బృందం వెల్లడి. 7.50: అమెరికా అధ్యక్షుడు ఒబామాకు విషయం తెలిసినట్లు వైట్‌హౌజ్ ప్రకటన 7.53: తక్షణ దర్యాప్తునకు ఆదేశించిన మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ 7.57: ఉక్రెయిన్ ప్రభుత్వమే విమానాన్ని కూల్చివేసిందని అక్కడి వేర్పాటువాద నేత అలెగ్జాండర్ బోరోదోయ్ ఆరోపణ. ఖండించిన ప్రభుత్వ వర్గాలు. 7.57: ఘటనపై ఉక్రెయిన్ అధికారులతో నిరంతర సంప్రదింపులు జరపాలని సీనియర్ అమెరికన్ అధికారులను ఆదేశించిన ఒబామా 8.04: మలేసియా విమానాన్ని రెబెల్స్ కూల్చివేశారని ఉక్రెయిన్ సర్కారు ఆరోపణ 8.04: ఈ ఘటనపై ఒబామాతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చర్చించినట్లు ఆ దేశ వార్తా సంస్థ వెల్లడి 8.07: మృతులకు బోయింగ్ కంపెనీ సంతాపం. అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధమని ప్రకటన -
విమాన ప్రమాదంపై విచారణకు ఆదేశం
మలేషియా విమాన ప్రమాదంపై విచారణకు మలేషియా ప్రధాని ఆదేశించారు. ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు విమానం కూలిన ఘటనపై ఉక్రెయిన్ ప్రధాని కూడా విచారణకు ఆదేశించారు. విమానం కూలడానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అయితే, ఉక్రెయిన్ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య తీవ్ర ఘర్షణాత్మక వాతావరణం ఉన్న ప్రాంతంలోనే ఈ విమానం కుప్పకూలింది. (చదవండి: కుప్పకూలిన మలేషియా విమానం: 295 మంది మృతి) కాగా, గత నాలుగు నెలల్లో మలేషియాకు ఇది రెండో విమాన ప్రమాదం. మార్చి 8వ తేదీన 239 మందితో వెళ్తున్న మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి హిందూ మహాసముద్రంలో గల్లంతైంది. నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు దాని ఆచూకీ తెలియలేదు. తాజా విమానం మాత్రం భూమికి పదివేల మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుండగా రాడార్‌తో దాని సంబంధాలు తెగిపోయాయి. -
కుప్పకూలిన మలేషియా విమానం: 295 మంది మృతి
మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఒకటి ఉక్రెయిన్‌లో కుప్పకూలింది. అమెరికాలోని ఆమ్స్టర్డామ్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్తున్న ఈ విమానం రష్యా సరిహద్దుల్లోని ఉక్రెయిన్‌లో ఉండగా కుప్పకూలింది. ఈ విమానంలో 280 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్లంతా మరణించినట్లు మలేషియా హోం శాఖ నిర్ధారించింది. ఎంహెచ్-17 విమానంతో సంబంధాలు తెగిపోయాయని, ఆ తర్వాత అది కూలిపోయినట్లు తెలిసిందని, మొత్తం అందులో ఉన్నవారంతా మరణించారని మలేషియన్ ఎయిర్ లైన్స్ సంస్థ కూడా తెలిపింది. గురువారం మధ్యాహ్నం 12.14 గంటలకు బయల్దేరిన ఈ విమానం శుక్రవారం ఉదయం 6.10 గంటలకు కౌలాలంపూర్ చేరుకోవాల్సి ఉంది. ఆలోపే ఈ ప్రమాదం జరగడంతో మొత్తం ప్రయాణికులు, సిబ్బంది అంతా మరణించారు. అయితే, రష్యా మిసైల్ వల్లే ఈ విమానం కూలినట్లు ఉక్రెయిన్ హోం మంత్రి ఆన్టోన్ తెలిపారు. విమానం 10వేల మీటర్ల ఎత్తులో ఉండగా రష్యా దాన్ని మిసైల్‌తో కూల్చేసిందన్నారు. గత రెండు వారాల్లో తమ దేశ యుద్ధ విమానాలను కూడా రష్యా కూల్చేసిందని ఆయన వివరించారు. ఈ బోయింగ్ 777 విమానం గంటకు 950 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. రెండు ప్రాంతాల మధ్య దూరం ఎక్కువ కాబట్టి ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. ప్రమాద విషయాన్ని అందరికంటే ముందుగా రష్యా వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ బయటి ప్రపంచానికి తెలిపింది. ఆ తర్వాతే మలేషియన్ ఎయిర్ లైన్స్ కూడా నిర్ధారించింది. -
మలేషియా విమానం కథ మళ్లీ మొదటికి
మలేషియా విమాన విషాదం కథ మళ్లీ మొదటికొచ్చింది. హిందూమహాసముద్రంలో నెలకు పైబడి జరిపిన అన్వేషణ నీటి మూటలా మారిపోయింది. శనివారం సముద్రంలో కనిపించిన చమురు తెట్టుకి సముద్రంలో కుప్పకూలిన విమానానికి ఎలాంటి సంబంధమూ లేదని పరీక్షలు రుజువు చేశాయి. చమురు తెట్టునుంచి సేకరించిన రెండు లీటర్ల చమురు తెట్టు సాంపిల్స్ ని అధ్యయనం చేయడంతో ఈ విషయం బయటపడింది. ఇప్పుడు రోబోట్ సాయంతో నడిచే సబ్మెరీన్ బ్లాక్ బాక్స్ ను కనుగొనగలిగితేనే ఎంతో కొంత పురోగతి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ సబ్మెరీన్ తొలి రెండు సార్లు తన ప్రయత్నంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంది. దీంతో ఇప్పటి వరకూ కేవలం 90 చ.కి.మీ ప్రదేశాన్ని మాత్రమే సబ్మెరీన్ పరీక్షించి చూడగలిగింది. మార్చి 8 న 239 మందితో బయలుదేరిన ఎం హెచ్ 370 విమానం బయలు దేరిన కొద్ది సేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. దీంతో ఈ విమానం సముద్రంలో కుప్ప కూలి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. పదకొండు విమానాలు, 11 పడవలు ప్రస్తుతం గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. -
సముద్రంపై చమురుతెట్టు - ఎం హెచ్ 370 పై కొత్త ఆశలు
దక్షిణ హిందూ మహాసముద్రంలో మలేషియన్ విమానం కుప్పకూలినట్టుగా భావిస్తున్న చోట భారీ మొత్తంలో చమురు తెట్టు ఉన్నట్టు వెల్లడైంది. కుప్పకూలిన విమానం అన్వేషణలో ఈ చమురు తెట్టు ఉపయోగపడే అవకాశం ఉందని విమానం కోసం అన్వేషణ జరుపుతున్న నిపుణులు చెబుతున్నారు. వారు ఈ చమురు తెట్టు సాంపిల్స్ సేకరించారు. మరో వైపు సముద్ర గర్భంలో విమానం శకలాలు, బ్లాక్ బాక్సును కనుగొనేందుకు ప్రత్యేక సోనార్ సెన్సర్లున్న బ్లూఫిన్ 21 జలాంతర్గామిని కూడా ప్రవేశపెట్టారు. ఇది సముద్ర గర్భంలో ఉన్న వస్తువుల వివరాలను సోనార్ మ్యాప్ సాయంతో సేకరిస్తుంది. రిమోట్ పరికరాల ద్వారా దీనిని నడిపించడానికి వీలుంటుంది. దీని ద్వారా పొందిన మ్యాపుల సాయంతో బ్లాక్ బాక్సు ఉందా లేదా అన్న విషయాన్ని కనుగొనవచ్చు. గత ఏప్రిల్ 8 నుంచి సముద్ర గర్భం నుంచి ఎలాంటి సిగ్నల్స్ రాలేదు. దీనితో బ్లాక్ బాక్స్ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జి అయి ఉంటుందని నిపుణులు అనుమానిస్తున్నారు. మార్చి 8 న మలేషియా రాజధాని కౌలాలంపుర్ నుంచి 239 మందితో బయలుదేరిన విమానం కొద్ది సేపటికే జాడ తెలియకుండా పోయింది. దీనితో నె లరోజుల నుంచి దీని కోసం పలు దేశాలు సంయుక్తంగా అన్వేషణ కొనసాగిస్తున్నాయి. -
ఎం హెచ్ 370 - ఇన్నాళ్లకి దర్యాప్తుకు ఆదేశించిన మలేషియా
మలేషియన్ విమానం తప్పుదారి పట్టగానే దాని కోసం వెతకడంలో ఆలస్యం ఎందుకు జరిగింది? దారి మారగానే ఆ విమానం ఎటువెళ్తుందో ఎందుకు గమనించలేదు? దీనికి బాధ్యులెవరు? పౌర విమానయాన రంగం తప్పు ఎంత? మిలటరీ విభాగం తప్పు ఎంత? ఇప్పుడు మలేషియా ప్రభుత్వం ఈ విషయంపై దర్యాప్తుకు ఆదేశించింది. సంఘటన వెనువెంటనే అధికారులు, వివిధ విభాగాలు స్పందించిన తీరుపై దర్యాప్తు మొదలైంది. అయితే దర్యాప్తునకు ఆదేశించినట్టు ప్రభుత్వం ధ్రువీకరించడం లేదు. ఏ విభాగం దర్యాప్తు చేస్తుంది, దర్యాప్తు దళానికి నాయకుడెవరు అన్న విషయంపై కూడా ఇప్పటి వరకూ స్పష్టత లేదు. మలేషియన్ విపక్ష పార్టీలు కూడా ప్రభుత్వ వ్యవహార శైలిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే బ్లాక్ బాక్స్ దొరికితే తప్ప దర్యాప్తునకు అర్ధం లేదని నిపుణులు అంటున్నారు. 239 మంది ప్రయాణిస్తున్న మలేషియన్ ఎయిర్ లైన్స్ కి చెందిన బోయింగ్ 777 గత మార్చి 8 న దక్షిణ హిందూ మహాసముద్రంలో కుప్పకూలిపోయింది. అయితే విమానం శకలాలు ఇప్పటి వరకూ దొరకలేదు. ఇంకో వైపు మలేషియన్ విమానం కోపైలట్ విమానం కుప్పకూలడానికి కొన్ని నిమిషాల ముందు ఒక అర్జంట్ ఫోన్ కాల్ తన సెల్ నుంచి చేశాడని, అయితే సెల్ కనెక్టివిటీ లభ్యత లేకపోవడం వల్ల కాల్ కనెక్ట్ కాలేదని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానంలో ఏదో అసాధారణ పరిస్థితి ఉందని గమనించి, ఆయన ఫోన్ చేయడానికి ప్రయత్నించారా అన్నది తేలడం లేదు. ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ వెలుగులోకి రావాలంటే బ్లాక్ బాక్స్ దొరకడం చాలా అవసరం అంటున్నారు నిపుణులు. -
ఎం హెచ్ 370 - మళ్లీ సిగ్నల్స్... మరో ఆశ... మళ్లీ వెతుకులాట
మలేషియా విమానం కోసం జరుగుతున్న అన్వేషణ కీలక దశకు చేరుకున్నట్టేనని అధికారులు నమ్మబలుకుతున్నారు. మొదట చైనా నౌక, ఆ తరువాత అస్ట్రేలియన్ నౌకలు నీటి లోపలి నుంచి సిగ్నల్స్ అందుకున్నాయి. ఈ సిగ్నల్స్ మలేషియన్ విమానం ఎం హెచ్ 370 మునిగినట్టుగా భావిస్తున్న ప్రదేశం నుంచే అందడంతో అన్వేషణలో నిమగ్నమైన సిబ్బంది ఆశలు చిగురించాయి. ఆస్ట్రేలియా కు చెందిన నౌకకు రెండు సార్లు సముద్రం లోతుల్లోనుంచి సిగ్నల్స్ అభించాయి. 'ఈ సిగ్నల్స్ బ్లాక్ బాక్సునుంచి వెలువడే సిగ్నల్స్ మాదిరిగానే ఉన్నాయి. విమానం లేదా విమాన శకలాలు త్వరలోనే లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మనం సరైన చోటే వెతుకుతున్నాం,' అన్వేషణలో ఉన్న వివిధ దేశాల ఉమ్మడి సమన్వయ సంస్థ హెడ్ అంగుస్ హౌస్టన్ చెప్పారు. ఆస్ట్రేలియన్ నౌకకు అండర్ వాటర్ సిగ్నల్స్ ను గుర్తించే పింగర్ లొకేటర్ అనే ఉపకరణం ఉంది. ఇది బ్లాక్ బాక్సు నుంచి వచ్చే సిగ్నల్స్ ను గుర్తించగలుగుతుంది. సరిగ్గా విమానం మునిగిపోయిందని భావిస్తున్న చోటే తేలియాడుతున్న పలు శకలాలు, వస్తువులు కూడా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరో వైపు బ్లాక్ బాక్స్ కోసం సముద్రం అట్టడుగున స్పెషలిస్టు డ్రైవర్లు వెతుకుతున్నారు. మంగళవారంతో విమానం కుప్పకూలి నెల రోజులైంది. దీంతో ఏ క్షణానైనా బ్లాక్ బాక్సు నుంచి సిగ్నల్స్ ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టే శనివారం ఆస్ట్రేలియన్ నౌకకు అందిన తొలి సిగ్నల్ 2 గంటల 20 నిమిషాల పాటు ఉండగా, మంగళవారం అందిన సిగ్నల్స్ అయిదున్నర నిమిషాలు, ఏడు నిమిషాలు మాత్రమే ఉన్నాయి. 239 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న మలేషియన్ విమానం ఎం హెచ్ 370 గత మార్చి 8 న హిందూమహాసముద్రంలో కుప్పకూలిపోయింది. దాని కోసం 15 విమానాలు, 14 నౌకలు 75,, 4237 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో, ఆస్ట్రేలియన్ నగరం పెర్తకి 2261 కి.మీ దూరంలో అన్వేషణ కొనసాగుతోంది. -
నెల రోజులు దాటినా.. దొరకని విమానం
మలేషియా విమానం అదృశ్యమై నెల రోజులు దాటిపోయినా ఇప్పటికీ దాని ఆచూకీ దొరకట్లేదు. ఎప్పుడో మార్చి 8వ తేదీన కనపడకుండా పోయిన ఈ విమానం కోసం గాలింపు చర్యలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 11 సైనిక విమానాలు, మూడు పౌర విమానాలు, 14 నౌకలతో మంగళవారం కూడా ఎంహెచ్370 విమానం కోసం గాలిస్తున్నట్లు అంతర్జాతీయ గాలింపు బృందాలతో ఏర్పాటైన జేఏసీసీ తెలిపింది. దాదాపు 77,580 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ గాలింపు సాగుతోంది. ఆస్ట్రేలియన్ నౌక ఓషన్ షీల్డ్ సాయంతో ఉత్తరం వైపు జల గర్భంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే, దక్షిణం వైపు చైనాకు చెందిన హైసున్ 01, బ్రిటిష్ నౌక హెచ్ఎంఎస్ ఇకో గాలిస్తున్నాయి. విమానం బ్లాక్ బాక్స్ నుంచి వస్తున్న సిగ్నళ్లను గత వారాంతంలో హౌసున్ 01, ఓషన్ షీల్డ్ నౌకలు గుర్తించాయి. అయితే, ఇవి ఎంహెచ్ 370కి సంబంధించినవేనా, కావా అనే విషయం మాత్రం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. -
ఇది మలేషియన్ విమానం పంపిన సిగ్నలేనా?
హిందూమహాసముద్ర గర్భంలో కుప్ప కూలిన మలేసియన్ విమానం నుంచి ఎలక్ట్రానిక్ పల్స్ సిగ్నల్ రూపంలో వచ్చిందా? అది విమానం నుంచి వచ్చిన సందేశమేనా? జాడతెలియకుండా పోయిన మలేషియన్ విమానం కోసం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో పలు దేశాలు అన్వేషణ జరుపుతున్నాయి. అమెరికా నుంచి ఒక ప్రత్యేక సోనార్ సెన్సార్ ఉన్న సబ్మెరీన్ కూడా ఈ గాలింపులో పాల్గొంటూంది. ఇదే సమయంలో చైనాకి చెందిన హైగ్జున్ 01 అనే పెట్రోలింగ్ పడవక హిందూ మహాసముద్ర జలాల్లోనుంచి సెకనుకు 37.5 కిలో హెర్జ్ ఫ్రీక్వెన్సీతో ఒక సిగ్నల్ వచ్చింది. మలేషియన్ విమానం ఎం హెచ్ 370 లో బ్లాక్ బాక్స్ ను తయారు చేసిన డుకానె సీకామ్ సంస్థ ఈ సిగ్నల్ విమానం నుంచి వెలువడే సిగ్నల్ కి చాలా దగ్గరగా ఉందని పేర్కొంది. గత ఇరవై ఎనిమిది రోజుల గాలింపులో లభించిన అత్యంత ముఖ్యమైన సూచనల ఇదే. ఒక వైపు బ్లాక్ బాక్స్ బాటరీ చార్జింగ్ ఇంకొన్ని గంటల్లో అయిపోతుందనగా ఈ పల్స్ సిగ్నల్ లభించడం విశేషం. ఈ పల్స్ సిగ్నల్ కూడా బ్యాటరీ చార్జింగ్ పూర్తయితే రావడం మానేస్తుంది. విమానం మార్చి 8 న అంతర్ధానమైంది. దాని కోసం పలు దేశాల నౌకలు, విమానాలు వెతుకులాట కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం పదమూడు ఎయిర్ క్రాఫ్టులు, 11 పడవలు అన్వేషణ జరుపుతున్నాయి. -
మలేషియా విమానం: శాశ్వత సమాధికి మరో 72 గంటలు
ఇంకా కేవలం మూడు రోజులు... ఈ మూడు రోజులు దాటితే సముద్ర సమాధిలో నిద్రిస్తున్న మలేషియన్ విమానం ఎం హెచ్ 370 వెనుక భాగాన ఉండే బ్లాక్ బాక్స్ బ్యాటరీ శాశ్వత నిద్రలోకి జారుకుంటుంది. మామూలుగా బ్లాక్ బాక్స్ 30 రోజుల వరకూ చార్జింగ్ ఉండి, సిగ్నల్స్ పంపగలుగుతుంది. ఇప్పటికి 27 రోజులు పూర్తయింది. గుడ్ నైట్ మలేషియన్ 370 239 మంది ప్రయాణికులను తన గర్భంలో పసిపాపల్లా అతి జాగ్రత్తగా పొదివి పట్టుకెళ్తున్న మలేషియన్ విమానం మార్చి 8 ఉదయం 8.11 గంటలకు ఉన్నట్టుండి మాయమైపోయింది. 16 రోజుల 13 గంటల, 49 నిమిషాల తరువాత విమానం పోయిందన్న విషయాన్ని మలేషియన్ ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు బ్లాక్ బాక్స్ కోసం చివరి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వైపు ముమ్మర ప్రయత్నాలు.. మరో వైపు క్షణక్షణం బలహీనపడుతున్న సిగ్నల్స్... మరో 72 గంటలు దాటేస్తే బ్లాక్ బాక్స్ సముద్ర గర్భంలో ఎక్కడో ఉండిపోతుంది. మలేషియన్ విమానంలో అంతిమ క్షణాల్లో ఏం జరిగిందో చెప్పే ఏకైక ఆధారం మటుమాయమైపోతుంది. 'గుడ్ నైట్ మలేషియన్ 370' అని పైలట్ అన్న తరువాత చీకటి ఘడియల్లో ఏం జరిగిందో తెలిపే బ్లాక్ బాక్స్ దొరకడం కేవలం అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది. హైజాకింగ్ కాదంటున్న అధికారులు హైజాక్, విద్రోహచర్య, పైలట్ల మానసిక సంతులనం దెబ్బతినడం లేదా ప్రమాదవశాత్తూ ఇంధనం అయిపోవడం - ఈ నాలుగు కారణాల్లో ఏది కరెక్టో చర్చించుకుంటూ కాలం గడపడం తప్ప మరేమీ చేయలేని పరిస్థితి ఉంది. బుధవారం మలేషియా అధికారులు ఈ ప్రమాదం వెనుక హైజాకింగ్ కోణం లేదని అధికారికంగా ప్రకటించారు. యాత్రికులెవరూ హైజాకర్లు కారని కూడా ప్రకటించారు. హెచ్ ఎం ఏ ఎస్ సిడ్నీ అనే పడవ మునిగిపోయిన 60 ఏళ్ల వరకూ దొరకలేదు. టైటానిక్ అవశేషాలు దొరకడానికి కూడా 80 ఏళ్లు పట్టింది. ఎం హెచ్ 370 పరిస్థితి కూడా ఇలాగే అవుతుందా? గతంలోనూ ఇలాగే జరిగింది! 2009 లో అట్లాంటిక్ లో ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ 447 అట్లాంటిక్ లో కుప్పకూలిపోయింది. అప్పుడు కూడా బ్లాక్ బాక్స్ బ్యాటరీ ఇలాగే చార్జింగ్ అయిపోయింది. దీంతో ఫ్రెంచి ప్రభుత్వం సైడ్ స్కాన్ సోనార్ సెన్సర్లు ఉన్న జలాంతర్గాములతో సముద్రం అడుగున 5 కి.మీ లోతున, 20 కిమీ ప్రాంతంలో అన్వేషణ జరిపించింది. ఎయిర్ ఫ్రాన్స్ విమానం తాలూకు బ్లాక్ బాక్స్ రెండేళ్ల తరువాత దొరికింది. ఎం హెచ్ 370 విషయంలోనూ అదే జరుగుతుందా అన్నదే అసలు ప్రశ్న! -
విమాన శకలాల అన్వేషణలో ఆలస్యం ఎందుకు?
సముద్రంలో కుప్పకూలిన మలేషియన్ విమానం శకలాల కోసం అన్వేషణ ఎందుకింత సమస్యగా మారింది? ఎందుకు ప్రతి రోజూ శకలాలు ఇక్కడ కనిపించాయి, అక్కడ కనిపించాయి అని వార్తలు వస్తున్నాయి? ప్రతి రోజూ ఉపగ్రహ చిత్రాలు కొత్త కథలు చెబుతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలు ఇవి. దీనికి ప్రధాన కారణం విమానం మునిగిన చోటు. దక్షిణ హిందూ మహాసముద్రం, ముఖ్యంగా ఆస్ట్రేలియాకి దగ్గరలోనే ఉన్న చోట చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. సముద్రం చాలా అశాంతిగా ఉంటుంది. సముద్రంపై వెర్రి గాలులు వీస్తాయి. ఒకసారి అటు, ఒక సారి ఇటు వీస్తాయి. ఇవన్నీ చాలవన్నట్లు ఈ ప్రాంతమంతా భారీ వర్షాలు కురుస్తాయి. మేఘాలు దట్టంగా అలుముకుంటాయి. సముద్ర విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ఇక్కడ గాలులు, అలలు, వానల వల్ల ఒక రోజులో శకలాలు దాదాపు 70 కిమీ దూరం వరకూ ప్రయాణించవచ్చు. ఒక ఏడాది పాటు శకలాలు ఇలాగే అటూ ఇటూ తేలాడుతూ ఉంటే అవి దాదాపు 2600 కిమీ ప్రయాణించి దక్షిణ ఆస్ట్రేలియా వరకూ వెళ్లవచ్చునని అంచనా వేస్తున్నారు. అలాగే శకలాలు పసిఫిక్ సముద్రం వంటి ఇతర సముద్రాలకు కూడా వెళ్లే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే రోజుకో చోట విమాన శకలాలు కనిపిస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. శుక్రవారం నాడు దాదాపు 75 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు ఉన్న చెక్క వంటి వస్తువు కనిపించింది. దీనికి పలు రంగుల బెల్టుల్లాంటి వి అమర్చి ఉన్నాయని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఇవి సీట్ బెల్టులకు సంబంధించిన శకలం అయి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా అన్వేషణ జరిపి, శకలాలను కనుగొనాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
అవి మలేషియా విమాన శకలాలేనా?
మలేషియా విమానం ఆస్ట్రేలియాకి దగ్గర్లో సముద్రంలో కుప్పకూలిపోయిందనడానికి మరిన్ని ఆధారాలు దొరికాయి. ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్తలు తమ ఉపగ్రహ చిత్రాలలో ఆస్ట్రేలియాకి దాదాపు 2500 కి.మీ దూరంలో దక్షిణ హిందూ మహాసముద్రంలో సముద్రంలో పలు శకలాలు ఉన్నట్టు కనుగొన్నారు. ఈ చిత్రాలను వారు మలేషియా ప్రభుత్వపు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి అందచేశారు. ఈ ఉపగ్రహ చిత్రాల్లో దాదాపు 122 వస్తువులు కనిపించాయి. ఇందులో కొన్ని వస్తువులు దాదాపు 23 మీటర్ల పొడవున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మలేషియన్ ప్రభుత్వం దక్షిణ హిందూ మహాసముద్రంలోనే విమానం కుప్పకూలినట్టు ప్రకటించింది. మరో వైపు సముద్రంలో జాడ తెలియకుండా పోయిన విమానం తాలూకు బ్లాక్ బాక్సును కనుగొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బ్లాక్ బాక్స్ ను కనుగొనేందుకు అమెరికా నుంచి నిపుణులు మలేషియా వచ్చారు. మామూలుగా బ్లాక్ బాక్సులు 30 రోజుల వరకూ పనిచేస్తాయి. వాటి బ్యాటరీల చార్జింగ్ అప్పటి వరకూ పనిచేస్తుంది. వాటికి అండర్ వాటర్ లోకేటర్ బీకన్లు అమర్చి ఉంటాయి. ఇవి నీటి అట్టడుగున 14000 అడుగుల లోతున ఉన్నా సందేశాలు పంపగలుగుతాయి. అయితే ఇప్పటికే విమానం నీట మునిగి 17 రోజుల, 13 గంటల, 49 నిమిషాలు అయింది. అంటే ఇంకా పదకొండు రోజుల్లో బ్లాక్ బాక్సును కనుగొనలేకపోతే అది శాశ్వతంగా దొరకకుండా పోతుందన్నమాట. ఫ్లైట్ డేటా రికార్డర్ లేదా బ్లాక్ బాక్సులో విమాన ప్రయాణ కాలంలో కాక్ పిట్ లో జరిగిన సంభాషణలను రికార్డు చేస్తాయి. దీని ఆధారంగా అసలేం జరిగిందో అంచనా వేయడానికి వీలుంటుంది.