మలేషియా విమాన ప్రమాదంపై విచారణకు మలేషియా ప్రధాని ఆదేశించారు. ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మలేషియా విమాన ప్రమాదంపై విచారణకు మలేషియా ప్రధాని ఆదేశించారు. ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు విమానం కూలిన ఘటనపై ఉక్రెయిన్ ప్రధాని కూడా విచారణకు ఆదేశించారు. విమానం కూలడానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అయితే, ఉక్రెయిన్ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య తీవ్ర ఘర్షణాత్మక వాతావరణం ఉన్న ప్రాంతంలోనే ఈ విమానం కుప్పకూలింది. (చదవండి: కుప్పకూలిన మలేషియా విమానం: 295 మంది మృతి)
కాగా, గత నాలుగు నెలల్లో మలేషియాకు ఇది రెండో విమాన ప్రమాదం. మార్చి 8వ తేదీన 239 మందితో వెళ్తున్న మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం ఒకటి హిందూ మహాసముద్రంలో గల్లంతైంది. నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు దాని ఆచూకీ తెలియలేదు. తాజా విమానం మాత్రం భూమికి పదివేల మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుండగా రాడార్తో దాని సంబంధాలు తెగిపోయాయి.