ఎమ్హెచ్ 17 విమాన ప్రమాద దుర్ఘటనలో మృతి చెందిన 298 మందిని గుర్తించినట్లు మలేషియా ఎయిర్లైన్స్ వెల్లడించింది. మృతుల వివరాలను శనివారం కౌలాలంపూర్లో మలేషియా ఎయిర్లైన్స్ విడుదల చేసింది. మృతుల్లో 192 మంది డచ్ దేశస్తులని... వారిలో ఒకరు నెదర్లాండ్స్ / యూఎస్ పౌరసత్వం కలిగి ఉన్నారని పేర్కొంది.
15 మంది విమాన సిబ్బంది, ఇద్దరు చిన్నారులతో మొత్తం 44 మంది మలేషియన్లు ఉన్నారని చెప్పింది. 27 మంది ఆస్ట్రేలియన్లు, ఓ శిశువుతో సహా12 మంది ఇండోనేషియన్లు ఉన్నారని వివరించింది. దక్షిణ ఆఫ్రికా పౌరసత్వం కలిగిన ఓ ప్రయాణికుడితోపాటు 9 మంది బ్రిటన్ దేశస్తులు ఉన్నారని తెలిపింది. నలుగరు జర్మన్, నలుగురు బెల్జియం, ముగ్గురు పిలిప్పీన్స్, ఒకరు కెనడా, మరోకరు న్యూజిలాండ్ దేశస్తుడని మలేషయా ఎయిర్లైన్స్ విశదీకరించింది.