ఎం హెచ్ 370: చిమ్మ చీకట్లో నల్లపిల్లి కోసం వెతుకులాట | MH 370: Searching for a black cat in a dark hole | Sakshi
Sakshi News home page

ఎం హెచ్ 370: చిమ్మ చీకట్లో నల్లపిల్లి కోసం వెతుకులాట

Published Fri, Mar 21 2014 12:11 PM | Last Updated on Sat, Sep 2 2017 5:00 AM

ఎం హెచ్ 370: చిమ్మ చీకట్లో నల్లపిల్లి కోసం వెతుకులాట

ఎం హెచ్ 370: చిమ్మ చీకట్లో నల్లపిల్లి కోసం వెతుకులాట

మలేషియా విమానం కోసం అన్వేషణ చిమ్మ చీకట్లో నల్లపిల్లిపి వెతకడం లాగా మారింది. ఆస్ట్రేలియా దగ్గర సముద్రంలో విమానం శిధిలాలున్నాయని సాటిలైట్లు చెప్పిన ఇరవై నాలుగు గంటల తరువాత కూడా విమానం ఎక్కడుందో తెలియడం లేదు. ఇవన్నీ చాలవన్నట్టు దక్షిణ హిందూ మహాసముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కూడ ఇబ్బందులకు దారితీస్తోంది.


ఇప్పటికే వెతుకులాటలో ఉన్న విమానాలు ఆస్ట్రేలియాలోని పెర్త్ కు తిరిగి వచ్చేస్తున్నాయి. ఈ సమయంలో ఆస్ట్రేలియా తీరంలో వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. అమెరికా నేవీకి చెందిన పొసైడన్ ఎయిర్ క్రాఫ్ట్ లోనూ తగినంత ఇంధనం లేకపోవడంతో తిరిగి రాక తప్పలేదు.


సాటిలైట్ కెమెరాలకు కనిపించిన శిథిలాలు ఏమిటన్న విషయంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అవి బోయింగ్ విమానపు రెక్కలై ఉండవచ్చునని అంటున్నారు. రెక్కల్లో ఉండే ఫ్యూయల్ టాంకులు ఖాళీ అయిపోవడం వల్ల రెక్కలు పైకి తేలి ఉండవచ్చునని అంటున్నారు.


నార్వే కి చెందిన కార్గో నౌక హోయె సెంట్ పీటర్బర్గ్ సెర్చి లైట్ల సాయంతో అన్వేషణ కొనసాగిస్తోంది. సౌత్ ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియాకి కార్లను తీసుకువెళ్తున్న ఈ నౌక శుక్రవారం కూడా తన వెతుకులాట కొనసాగిస్తుందని అధికారులు చెబుతున్నారు. బ్లాక్ బాక్స్ నుంచి వెలువడే సందేశాల ఆధారంగా విమాన శకలాలు ఎక్కడున్నాయో గుర్తించవచ్చునని, అయితే ఆ బ్యాటరీ 25 రోజుల వరకూ పనిచేస్తుందని, ఇప్పటికే దాదాపు రెండు వారాలైపోయాయని అధికారులు అంటున్నారు.


మలేషియాకి చెందిన రెండు విమానాలు, మూడు హెలీకాప్టర్లు, ఆరు పడవలు, చైనాకి చెందిన మూడు విమానాలు, మూడు హెలికాప్టర్లు, అయిదు పడవలు, ఇండోనీషియాకి చెందిన నాలుగు విమానాలు, ఆరు నౌకలు, ఆస్ట్రేలియాకి చెందిన అయిదు విమానాలు, ఒక పడవ, జపాన్కి చెందిన నాలుగు విమానాలు, మన దేశానికి చెందిన రెండు విమానాలు, దక్షిణ కొరియాకి చెందిన రెండు విమానాలు, అమెరికా, న్యూజీలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన చెరొక్క విమానం, ఇంగ్లండ్ కి చెందిన ఒక నౌక అన్వేషణలో ఉన్నాయి. అదే ప్రాంతంలో ఉన్న నార్వే నౌక కూడా అదే పనిలో ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement