బుమ్రాతో పెళ్లి : స్పందించిన రాశీఖన్నా | Rashi Khanna Clarifies About Marriage Rumor With Bumrah | Sakshi
Sakshi News home page

బుమ్రాతో పెళ్లి : స్పందించిన రాశీఖన్నా

Mar 23 2018 9:05 AM | Updated on Oct 22 2018 6:10 PM

Rashi Khanna Clarifies About Marriage Rumor With Bumrah - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారత్‌లో క్రికెట్‌, సినిమాలది విడదీయలేని బంధం. క్రికెటర్లు, ఫిలిం స్టార్స్‌ మధ్య ప్రేమాయణాలు మనకు చాలా కామన్‌. అయితే ప్రస్తుతం క్రికెటర్ బుమ్రా, సినీ నటి రాశీఖన్నా పెళ్లి చేసుకుంటారన్న పుకార్లు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.  టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ రాశీఖన్నా, ఇటీవల తొలి ప్రేమ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. గతంలో తొలిప్రేమ సినిమా ప్రమోషన్ సందర్భంగా రాశీ మీడియాతో మాట్లాడుతూ క్రికెటర్‌ బూమ్రా అంటే తనకు ఇష్టమని చెప్పిందనే వార్తలు వచ్చాయి. 

దీంతో నెటిజన్లు ‘బుమ్రాకు రాశీ ఖన్నా బౌల్డ్’ అంటూ.. వాళ్ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందన్న వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ వార్త రాశీ వరకు చేరడంతో దీనిపై ఓ టీవీ కార్యక్రమంలో క్లారిటీ ఇచ్చింది.  బూమ్రా తనకు ఒక క్రికెటర్‌గా మాత్రమే తెలుసని, వ్యక్తిగతంగా తెలియదని చెప్పింది. అసలు బూమ్రా ఆడిన మ్యాచ్‌లు కూడా తాను చూడలేదని, ఇలాంటి రూమర్‌లు ఎలా పుట్టుకొస్తాయోనని అసహనం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement