Aghathiyaa Review: జీవా ‘అగత్యా’ రివ్యూ | Actor Jiiva Aghathiyaa Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Aghathiyaa Movie Review: జీవా ‘అగత్యా’ రివ్యూ

Published Fri, Feb 28 2025 2:41 PM | Last Updated on Fri, Feb 28 2025 3:21 PM

Aghathiyaa Movie Review And Rating In Telugu

టైటిల్‌: అగత్యా
నటీనటులు: జీవా, అర్జున్‌ సర్జా, రాశీ ఖన్నా, ఎడ్వర్డ్  సోన్నెన్‌బ్లిక్, యోగి బాబు తదితరులు
నిర్మాణ సంస్థ: వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, వామిండియా
నిర్మాతలు: డాక్టర్‌ ఇషారి కే గణేశ్‌, అనీష్‌ అర్జున్‌దేవ్‌
దర్శకత్వం: పా.విజయ్‌
సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా
విడుదల తేది: ఫిబ్రవరి 28, 2025

రంగం, యాత్ర2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు జీవా. తాజాగా ఈ తమిళ హీరో నటించిన చిత్రం అగత్యా. పా. విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
అగత్య(జీవా) ఓ ఆర్ట్‌ డైరెక్టర్‌. ఓ పెద్ద సినిమా చేసే చాన్స్‌ వస్తుంది. ఓ భారీ సెట్‌ వేసిన తర్వాత నిర్మాత షూటింగ్‌ నిలిపివేస్తాడు. దీంతో ప్రియురాలు వీణా(రాశీ ఖన్నా) ఇచ్చిన సలహాతో  ఆ సెట్‌ని స్కేరీ హౌస్‌లా మార్చుతాడు. అయితే నిజంగానే ఆ బంగ్లాలో దెయ్యాలు ఉంటాయి. అసలు ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలు ఎవరు? ఓ ఆడ దెయ్యం అగత్యను ఎందుకు బయటకు పంపించాలనుకుంటుంది? అసలు 1940లో ఆ బంగ్లాలో ఏం జరిగింది? సిద్ద వైద్యం కోసం డాక్టర్‌ సిద్ధార్థ్‌(అర్జున్‌) ఎలాంటి కృషి చేశాడు? బ్రిటిష్‌ గవర్నర్‌ ఎడ్విన్‌ డూప్లెక్స్‌ చేసిన అరాచకం ఏంటి? అతని చెల్లెలు జాక్వెలిన్‌ పూవిలేకి సిద్ధార్థ్‌ చేసిన సహాయం ఏంటి? ఫ్రీడం ఫైటర్‌ నాన్సీకి అగత్యకు ఉన్న సంబంధం ఏంటి? కాన్సర్‌తో బాధపడుతున్న తల్లిని రక్షించుకునేందుకు అగత్యా ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ఇదొక డిఫరెంట్‌ హారర్‌ మూవీ. హారర్‌ ఎలిమెంట్స్‌కి దేశభక్తి, మదర్‌ సెంటిమెంట్‌ని యాడ్‌ చేసిన డిఫరెంట్‌గా కథ చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు పా.విజయ్‌. అయితే ఆ కథను తెరపై చూసినప్పుడు రొటీన్‌ హారర్‌ చిత్రంగానే అనిపిస్తుంది. కొన్ని చోట్ల భయపెట్టే సన్నివేశాలు ఉన్నప్పటికీ.. చాలా వరకు కథనం సాదాసీదాగానే సాగుతుంది. కథలో ఎక్కువ లేయర్స్‌ ఉండడంతో దర్శకుడు ఎం చెప్పాలనుకున్నాడనేది సరిగ్గా అర్థంకాదు. ఫస్టాఫ్‌లో వచ్చే హారర్‌ సన్నివేశాలు కొన్ని చోట్ల భయపడితే.. మరికొన్ని చోట్ల నవ్విస్తాయి.

కథ 1940లోకి వెళ్లిన తర్వాత  సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సిద్దవైద్యం గొప్పదనం గురించి చెప్పేందుకు అనవసరపు సన్నివేశాలను జోడించారు. మధ్యలో కాసేపు స్వాతంత్ర పోరాటం.. మదర్‌ సెంటిమెంట్‌.. దైవ భక్తి  అంటూ అసలు కథను పక్కన పెట్టేసినట్లుగా అనిపిస్తుంది. ఇక దెయ్యాల ప్లాష్‌బ్యాక్‌ ప్రారంభం అయిన కాసేపటికే క్లైమాక్స్‌ ఊహించొచ్చు. అయితే ఈ క్రమంలో వచ్చే యాక్షన్‌ సీన్లు,  యానిమేషన్ ఫైట్ ఆకట్టుకుంటాయి. మదర్‌ సెంటిమెంట్‌ కూడా వర్కౌట్‌ అయింది. క్లైమాక్స్‌  బాగుంటుంది. 

ఎవరెలా చేశారంటే.. 
అగత్యా పాత్రకు జీవా న్యాయం చేశాడు. ఈ తరహా పాత్రలు ఆయనకు కొత్తేమి కాదు. గతంలో చాలానే చేశాడు. అర్జున్‌ సర్జా ఓ డిఫరెంట్‌ పాత్రలో కనిపించాడు. డాక్టర్‌ సిద్ధార్థ్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రాశీఖన్నా పాత్ర నిడివి ఎక్కువే ఉంటుంది కానీ అంతగా ప్రాధాన్యత ఉండదు. యోగిబాబు, టీవీ గణేష్‌ కనిపించేది ఒక్క సీన్‌లోనే అయినా.. నవ్వించే ప్రయత్నం చేశారు. హీరో తల్లిగా రోహిణి రొటీన్‌ పాత్రే చేసింది. అయితే ఆమె ప్రాస్థెటిక్ మేకప్‌తో కనిపించడం కొత్తగా అనిపిస్తుంది.  విలన్‌గా ఫారిన్‌ యాక్టర్‌ ఎడ్వర్డ్  సోన్నెన్‌బ్లిక్ చక్కగా నటించాడు. మిలిగిన నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా బాగుంది.  

యువన్‌ శంకర్‌ రాజాగా నేపథ్య సంగీతం పర్వాలేదు.  అమ్మ పాట ఆకట్టుకునేలా ఉంటుంది.  సినిమాటోగ్రఫీ, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పనితీరుని బాగుంది. 1940 కాలం నాటి బంగ్లాతో పాటు అప్పటి వాతావరణాన్ని తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement