ఓటీటీలో హారర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా స్ట్రీమింగ్‌ | Aghathiyaa Movie OTT Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఓటీటీలో హారర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా స్ట్రీమింగ్‌

Published Mon, Mar 24 2025 1:21 PM | Last Updated on Mon, Mar 24 2025 1:48 PM

Aghathiyaa Movie OTT Streaming Date Locked

జీవా(jeeva), అర్జున్‌ సర్జా(arjun sarja) హీరోలుగా నటించిన 'అగత్యా' (Aghathiyaa) చిత్రం ఓటీటీలోకి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఫాంటసీ హారర్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది.  రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన పాన్‌ ఇండియా మూవీని ప్రముఖ గీత రచయిత పా.విజయ్‌ దర్శకత్వం వహించారు. డా.ఇషారి కె.గణేశ్, అనీశ్‌ అర్జున్‌దేవ్‌ నిర్మాతలు.   ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న విడుదల అయింది. ట్రైలర్‌కు అయితే మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కానీ, బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేదు.

గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం.. సన్‌ నెక్స్ట్‌ వేదికగా మార్చి 28 నుంచి స్ట్రీమింగ్‌కు రానుందని ప్రకటన వచ్చేసింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో తమిళ్‌,హిందీ,తెలుగు,మలయాళం, కన్నడలో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం ఎన్ని భాషలలో విడుదల అవుతుంది అనేది మాత్రం ఆ సంస్థ చెప్పలేదు. కానీ, అన్ని లాంగ్వేజెస్‌లో అగత్యా స్ట్రీమింగ్‌ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో కూడా ఈ మూవీ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది.

కథేంటంటే..
అగత్య(జీవా) ఓ ఆర్ట్‌ డైరెక్టర్‌. ఓ పెద్ద సినిమా చేసే చాన్స్‌ వస్తుంది. ఓ భారీ సెట్‌ వేసిన తర్వాత నిర్మాత షూటింగ్‌ నిలిపివేస్తాడు. దీంతో ప్రియురాలు వీణా(రాశీ ఖన్నా) ఇచ్చిన సలహాతో  ఆ సెట్‌ని స్కేరీ హౌస్‌లా మార్చుతాడు. అయితే నిజంగానే ఆ బంగ్లాలో దెయ్యాలు ఉంటాయి. అసలు ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలు ఎవరు? ఓ ఆడ దెయ్యం అగత్యను ఎందుకు బయటకు పంపించాలనుకుంటుంది? అసలు 1940లో ఆ బంగ్లాలో ఏం జరిగింది? సిద్ద వైద్యం కోసం డాక్టర్‌ సిద్ధార్థ్‌(అర్జున్‌) ఎలాంటి కృషి చేశాడు? బ్రిటిష్‌ గవర్నర్‌ ఎడ్విన్‌ డూప్లెక్స్‌ చేసిన అరాచకం ఏంటి? అతని చెల్లెలు జాక్వెలిన్‌ పూవిలేకి సిద్ధార్థ్‌ చేసిన సహాయం ఏంటి? ఫ్రీడం ఫైటర్‌ నాన్సీకి అగత్యకు ఉన్న సంబంధం ఏంటి? కాన్సర్‌తో బాధపడుతున్న తల్లిని రక్షించుకునేందుకు అగత్యా ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement