అతనెవరో కూడా నాకు తెలీదు | Rashi Khanna Affair With Bumrah | Sakshi
Sakshi News home page

అతనెవరో కూడా నాకు తెలీదు

Mar 26 2018 1:40 AM | Updated on Mar 26 2018 1:40 AM

Rashi Khanna Affair With Bumrah  - Sakshi

రాశీఖన్నా

వరుస సక్సెస్‌లు అందుకుంటున్న హీరోయిన్లు రిలేషన్‌షిప్‌లో లేకుండా సింగిల్‌గా ఉంటే తట్టుకోలేరు గాసిప్‌రాయుళ్లు. ఏదో ఒక బిజినెస్‌మేన్‌తోనో, క్రికెటర్‌తోనో లవ్‌లో ఉన్నటు వదంతులు సృష్టిస్తారు. అలాగే యంగ్‌ క్రికెటర్‌ బూమ్రాతో రాశీఖన్నా లవ్‌లో ఉన్నట్టు పుకార్లు సృష్టించారు. 

‘అబ్బే అలాంటిదేం లేదు’ అని రాశీ ఖన్నా చెబుతూ –‘‘అతను క్రికెటర్‌ అన్న విషయం వరకూ తెలుసు. అంతకు మించి అతనెవరో కూడా నాకు తెలీయదు. నేను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేను. సరైన ఇన్‌ఫర్మేషన్‌ లేకుండా ఒక అమ్మాయిని ఇలా లింకప్‌ చేస్తూ రాయడం చాలా బాధాకరం’’ అని పేర్కొన్నారు. ఇటీవల ‘తొలిప్రేమ’ సక్సెస్‌తో జోరులో ఉన్న రాశీ ప్రస్తుతం నితిన్‌ సరసన ‘శ్రీనివాస కళ్యాణం’, తమిళంలో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement