పెళ్లెప్పుడంటే! వడివేలు స్టైల్లో విషయం చెప్పేసిన కీర్తీసురేశ్‌ | Actress Keerthy Suresh Wedding Response In Vadivelu Style - Sakshi
Sakshi News home page

పెళ్లెప్పుడంటే! వడివేలు స్టైల్లో విషయం చెప్పేసిన కీర్తి.. ఎంతైనా మహానటి కదా!

Published Thu, Apr 20 2023 7:35 AM | Last Updated on Thu, Apr 20 2023 8:33 AM

Actress Keerthy Suresh Wedding Response in Vadivelu style - Sakshi

నటి కీర్తీసురేశ్‌ పెళ్లిపై సోషల్‌ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. సినీ కుటుంబం నుంచి వచ్చిన నటి ఈ బ్యూటీ. తల్లి మేనక నటి. తండ్రి సురేశ్‌ నిర్మాత. వీరి వారసత్వంతో ముందుగా మలయాళంలో నటిగా రంగప్రవేశం చేసిన కీర్తీ ఆ తరువాత ఇదు ఎన్న మాయం చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయ్యింది. అయితే ఇక్కడ తొలి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత శివకార్తికేయన్‌తో నటించిన రజనీ మురుగన్‌ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కీర్తీసురేశ్‌కు నటిగా వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు.

తెలుగులో మహానటి చిత్రంతో సావిత్రిగా జీవించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డునే గెలుచుకుంది. కీర్తీ సురేశ్‌ ఏ తరహా పాత్రనైనా అవలీలగా నటించి శభాష్‌ అనిపించుకుంటుంది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా నటించిన మామన్నన్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. జయంరవితో నటిస్తున్న సైరన్‌ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. కాగా చాలా మంది హీరోయిన్లు ఉన్నా, నటి కీర్తీసురేశ్‌ పెళ్లి గురించే ఎక్కువగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఓ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకోబోతోందని, తల్లిదండ్రులు సంబంధం చూశారు అనీ రకరకాల ప్రచారం వైరల్‌ అవుతోంది.

ఇది ఒక రకంగా ఆమెకు ఫ్రీ పబ్లిసిటీనే అవుతోందని చెప్పవచ్చు. కాగా ఈ భామ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈమెకు ఫాలోవర్స్‌ అధికమే. ఇటీవల తన ఇన్‌స్ట్రాగామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. అప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఓ అభిమాని అడగ్గా నటుడు వడివేలు రెండు చేతులను జేబులో పెట్టుకుని ఏముందీ? ఏమీలేదు అనే విధంగా ఒక కార్టూన్‌ పోస్ట్‌ చేసి ఇప్పట్లో పెళ్లి ప్రస్తావనే లేదు అని తేల్చి చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement