పాండ్యాతో పెళ్లి.. కన్ఫ్యూజ్‌ చేసిన ఈషా | Esha Gupta Clears Air on Wedding Rumours with Pandya | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 5 2018 2:17 PM | Last Updated on Sun, Aug 5 2018 7:22 PM

Esha Gupta Clears Air on Wedding Rumours with Pandya - Sakshi

యువ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా, నటి ఈషా గుప్తాతో గత కొంతకాలంగా డేటింగ్‌ చేస్తున్నట్లు కథనాలు వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. హాట్‌ బ్యూటీతో కలిసి పాండ్యా.. రెస్టారెంట్లు, పార్టీలు, ఈవెంట్లకు హాజరవుతున్నాడంటూ బాలీవుడ్‌ మీడియా కోడై కూసింది. ఈ తరుణంలో త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు ఇప్పుడు ఓ కథనం వైరల్‌ అవుతోంది. 

ఈ వ్యవహారంపై పింక్‌విల్లా వెబ్‌సైట్‌ ప్రతినిధి ఈషాను సంప్రదించగా.. ఆమె గందరగోళమైన స్టేట్‌మెంట్‌ను ఇచ్చి వదిలేశారు. ‘నేను తొందర పడదల్చుకోవటం లేదు. వివాహానికి సమయం వచ్చినప్పుడు తెలియజేస్తా. ఇంతకు మించి ఏం చెప్పదల్చుకోలేదు’ అంటూ పేర్కొన్నారు. అయితే పాండ్యాతో డేటింగ్‌ చేస్తున్న మాట నిజమేనన్న ప్రశ్నకు మాత్రం ఆమె నవ్వి ఊరుకోవటం విశేషం. 

గతంలో నటి ఎల్లీ అవ్రమ్‌తో ఓపెన్‌ రొమాన్స్‌ కొనసాగించిన పాండ్యా.. తర్వాత ఇషాను ఓ పార్టీలో పరిచయం చేసుకుని డేటింగ్‌ మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే హెరా పెరీ-3, టోటల్‌ ధమాల్‌, పల్టాన్‌ చిత్రాలతో ఈషా బాలీవుడ్‌లో బిజీగా ఉండగా.. మరోవైపు పాండ్యా ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ ఆడుతున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement